• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /ఇమ్మిగ్రేషన్​ విషయంలో ట్రంప్ సర్కార్ స్ట్రిక్ట్ రూల్స్.. 3 లక్షలకుపైగా వీసాలు రద్దు..

ఇమ్మిగ్రేషన్​ విషయంలో ట్రంప్ సర్కార్ స్ట్రిక్ట్ రూల్స్.. 3 లక్షలకుపైగా వీసాలు రద్దు..

Donald Trump Visa Immigration: రెండో సారి అధికారంలో వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదంలో భాగంగా వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా తన ఎన్నికల్లో ఇచ్చిన హామిలను అమలు చేసే పనిలో పడ్డాడు. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 22, 2026, 07:35 AM IST|Updated: Oct 22, 2026, 08:05 AM IST
joinshare
ఇమ్మిగ్రేషన్​ విషయంలో ట్రంప్ సర్కార్ స్ట్రిక్ట్ రూల్స్.. 3 లక్షలకుపైగా వీసాలు రద్దు..
Image Credit: Donald Trump (File/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాలు విడుదల..

తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాలు విడుదల..

2

ఈ చిన్న QR కోడ్‌తో పీఎం కిసాన్‌ యాప్ డౌన్‌లోడ్ చేయండి.. మీ స్టేటస్ వెంటనే చెక్ చేసుకోండి!

3

Tirumala: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం.. బోల్తా పడ్డ సుమో.. పలువురు భక్తులకు గాయాలు .!.

4

అల్ప పీడన ప్రభావం.. చెన్నైను ముంచెత్తుతున్న వర్షాలు..

5

పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. బ్యాంక్‌కు వెళ్లకుండానే ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్! IPPB ప్రాసెస్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

US New Immigration Policy: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలకు తన విశ్వరూపం చూపిస్తున్నారు ట్రంప్. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ విషయంలో ఎక్కడా తగ్గేదే లేదంటున్నారు. తాజాగా ఈయన తన రెండో సారి పదవి చేపట్టిన కాలంలో దాదాపు 3 లక్షలకు పైగా వీసాలను రద్దు చేసినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది.అమెరికా చరిత్రలోనే ఇంత తక్కువ టైమ్‌లో  ఈ స్థాయిలో వీసాలను రద్దు చేయడం గతంలో ఎన్నడు లేదంటున్నారు.


బర్త్ టూరిజం.. 
ముఖ్యంగా నేర ప్రవృత్తి కలిగివారు..  వీసా గడువు ముగిసిన దేశంలో ఉండటం వంటి  ఉల్లంఘనలకు పాల్పడిన వారు, దేశ భద్రతకు ముప్పుతో పాటు పౌరసత్వ దుర్వినియోగానికి పాల్పడే 'బర్త్ టూరిజం' వ్యవహారాలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. బర్త్‌ టూరిజం అంటే విదేశీయులు తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లి ప్రసవించడం ఎక్కువైంది.  ఈ విధానానికి సంబంధించి నిబంధనల ఉల్లంఘన జరిగిందని భావించిన సందర్భాల్లో అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలను తప్పు పడుతున్న హ్యూమన్ రైట్స్ కమిషన్..

అయితే ట్రంప్ సర్కారు తీసుకుంటున్న ఈ ఏకపక్ష కఠిన నిర్ణయాలపై ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్  సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ హయాంలో రద్దు చేసిన వీసాల సంఖ్య అమెరికా చరిత్రలో ఇతర అధ్యక్షుడి కాలంతో పోలిస్తే ఎక్కువని విదేశాంగ శాఖ తెలిపింది. అమెరికాలో నివసిస్తూ చట్టాలను ఉల్లంఘించే విదేశీయులపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఇందులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటోంది  ట్రంప్‌ సర్కార్‌. గత ఏడాది జనవరిలో మొత్తం 3,లక్షల వీసాల్లో 2.5 లక్షల వీసాలు  రద్దయ్యాయి.

అక్రమ వలస దారుల విషయంలో సింహ స్వప్నం..

రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత  ట్రంప్ అక్రమ వలసదారులను బహిష్కరించే పనిలో పడ్డారు.  వీసా జారీ చేయడానికి ముందు అప్లికేషన్స్‌ చేసుకున్నవారి  సోషల్ మీడియా అకౌంట్స్‌ లను పరిశీలిస్తున్నారు.  వీసా దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలించే ప్రక్రియను 'సోషల్‌ మీడియా వెట్టింగ్‌' అంటారు. వీసా దరఖాస్తుదారులు అమెరికాలో ప్రవేశించేందుకు అర్హులా? వారి కార్యకలాపాల వల్ల దేశ భద్రతకు ఏమైనా ముప్పు ఉందా? అనే అంశాలను అంచనా వేయడానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు. చట్టాలను ఉల్లంఘించే వారి వీసాలను వారి సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా  రద్దు చేసే ప్రక్రియ ముమ్మరం చేశారు.  గతంతో పోలిస్తే వీసాల రద్దు సంఖ్య రెట్టింపు అయింది. స్థానిక చట్టాలను ఉల్లంఘించడం వంటి కార్యకలాపాలకు పాల్పడే విదేశీ విద్యార్థులపై ట్రంప్ పరిపాలన నిఘాను పెంచింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Donald Trump
America
World News