• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /అల్ప పీడన ప్రభావం.. చెన్నైను ముంచెత్తుతున్న వర్షాలు..

అల్ప పీడన ప్రభావం.. చెన్నైను ముంచెత్తుతున్న వర్షాలు..

Heavy Rains Chennai:దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా తమిళనాడు తీర ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అల్పపీడన ద్రోణి కారణంగా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 22, 2026, 08:42 AM IST|Updated: Oct 22, 2026, 08:49 AM IST
joinshare
అల్ప పీడన ప్రభావం..  చెన్నైను ముంచెత్తుతున్న వర్షాలు..
Image Credit: Chennai Rains (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాలు విడుదల..

తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాలు విడుదల..

2

ఈ చిన్న QR కోడ్‌తో పీఎం కిసాన్‌ యాప్ డౌన్‌లోడ్ చేయండి.. మీ స్టేటస్ వెంటనే చెక్ చేసుకోండి!

3

Tirumala: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం.. బోల్తా పడ్డ సుమో.. పలువురు భక్తులకు గాయాలు .!.

4

అల్ప పీడన ప్రభావం.. చెన్నైను ముంచెత్తుతున్న వర్షాలు..

5

పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. బ్యాంక్‌కు వెళ్లకుండానే ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్! IPPB ప్రాసెస్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Tamil Nadu Rains: తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. చెన్నైలోని మీనంబాకం లో అత్యధికంగా 12 సెంటీమీటర్లు, నుంగంబాకంలో 11 సెంటీమీటర్ల మేర భారీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల మరో రెండు మూడు రోజుల పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

మత్స్య కారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ.. 
సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారడంతో పాటు ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, సీఎం జోసెఫ్ విజయ్ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను నిన్న సందర్శించి నగరవ్యాప్త పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

35 ప్రాంతాల్లో నిలిచిన నీటిని తెలిగించిన అధికారులు..

మూడు  రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలోని 35 ప్రాంతాల్లో నిలిచిన నీటిని మోటార్ పంపుల ద్వారా అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన తొలగించింది. అలాగే 22 ప్రాంతాల్లో కూలిన చెట్లను తొలగించి, నగరంలోని మొత్తం 22 అండర్‌ పాస్ సబ్‌వేలలో ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను సీఎం విజయ్ ఆదేశించారు. వర్షాల వల్ల ప్రభావితమైన లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం జీసీసీ 227 తాత్కాలిక పునరావాస కేంద్రాలను, ఆహార తయారీకి 112 కేంద్రీకృత వంటశాలలను సిద్ధంగా ఉంచింది.

ఆహార పంపిణి..
నీట మునిగిన ప్రాంతాల్లోని దాదాపు 13,500 మందికి ఆహార పంపిణీ చేశారు. సహాయక చర్యల కోసం కార్పొరేషన్ సొంత పంపులు, అద్దె పంపులు, ట్రాక్టర్ ఆధారిత పంపులతో సహా మొత్తం 1,189 వాహనాలు, భారీ యంత్రాలను రంగంలోకి దించారు. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జీసీసీ తరఫున 36 బోట్లు, మత్స్యశాఖ ఆధ్వర్యంలో 97 బోట్లను అప్రమత్తం చేశారు. రోడ్లపై పడే చెట్లను ఎప్పటికప్పుడు తొలగించేందుకు వందలాది పవర్ సా యంత్రాలను అందుబాటులో ఉంచారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Weather Update
National News
Rain News