• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Tirumala: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం.. బోల్తా పడ్డ సుమో.. పలువురు భక్తులకు గాయాలు .!.

Tirumala: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం.. బోల్తా పడ్డ సుమో.. పలువురు భక్తులకు గాయాలు .!.

Road accident in Tirumala ghat road: రెండో ఘట్ రోడ్డులో సుమో బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Written ByInamdar Paresh
Published: Oct 22, 2026, 08:59 AM IST|Updated: Oct 22, 2026, 09:22 AM IST
joinshare
Tirumala: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం.. బోల్తా పడ్డ సుమో.. పలువురు భక్తులకు గాయాలు .!.
Image Credit: Tirumala ghat road accident

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర  ‘రణబాలి’ దూకుడు.. త్వరలో లాభాల్లోకి..!

మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర ‘రణబాలి’ దూకుడు.. త్వరలో లాభాల్లోకి..!

2

తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాలు విడుదల..

3

ఈ చిన్న QR కోడ్‌తో పీఎం కిసాన్‌ యాప్ డౌన్‌లోడ్ చేయండి.. మీ స్టేటస్ వెంటనే చెక్ చేసుకోండి!

4

Tirumala: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం.. బోల్తా పడ్డ సుమో.. పలువురు భక్తులకు గాయాలు .!.

5

అల్ప పీడన ప్రభావం.. చెన్నైను ముంచెత్తుతున్న వర్షాలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Several devotees injured road accident in Tirumala: తిరుమలలో ఇటీవల నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. టీటీడీ సైతం భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంది. మరోవైపు  తిరుమలలో భక్తుల రద్దీ మాత్రం ఇంకా కొనసాగుతుంది. మరోవైపు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో డిసెంబర్ మొదటి వారం వరకు ఇటీవల వీఐపీ బ్రేక్ దర్శనాల సిఫారసు లేఖల్ని టీటీడీ రద్దు చేసింది. తిరుమలలో రద్దీ ప్రస్తుతం ఒక మోస్తరుగా ఉంది. 12 కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు.  

 ఇటీవల తిరుమల ఘాట్ రోడ్డులో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మలుపుల వద్ద వాహనాలు అదుపు తప్పి ప్రమాదంకు గురౌతున్నాయి. తాజాగా.. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో సుమో ప్రమాదంకు గురై బోల్తా పడింది. తిరుమలలోని రెండో ఘాట్ లో సుమో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. కొండ పైకి వెళ్తున్న క్రమంలో సుమో ఒక్కసారిగా అదుపు తప్పి ప్రమాదంకు గురైంది.

 వెంటనే ఆ మార్గంలో వెళ్తున్న వారు అప్రమత్తమైన వాహనంలో చిక్కుకున్న వారిని బైటకు తీశారు. అంబులెన్స్ కు సమాచారం అందించారు. సుమోలో ప్రయాణిస్తున్న పలువురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. పెద్ద ప్రమాదం తప్పడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనతో ఆ మార్గంలో వాహనాల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘాట్ రోడ్డులో ఇటీవల జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాద ఘటనలతో .. ప్రమాద నివారణలకు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చర్యలు తీసుకొవాాలని భక్తులు కోరుతున్నారు.

తిరుమల సమాచారం..

తిరుమలలో నిన్న స్వామి వారిని 73.226  యాత్రికులు దర్శించుకున్నారు. 24.754 మంది భక్తులు నిన్న తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి హుండీ  ఆదాయం ₹2.66కోట్లు సమకూరింది. 3.63లక్షలు లడ్డూ విక్రయాలు జరిగాయి. 12 కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనం కోసం సుమారుగా దర్శన సమయం (SSD టోకెన్లు లేకుండా) ఉన్న భక్తులకు 6 గంటల సమయం పడుతుంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tirupathi
Tirumala
Andhra Pradesh
AP News