ఇమ్మిగ్రేషన్ విషయంలో ట్రంప్ సర్కార్ స్ట్రిక్ట్ రూల్స్.. 3 లక్షలకుపైగా వీసాలు రద్దు..
Donald Trump Visa Immigration: రెండో సారి అధికారంలో వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదంలో భాగంగా వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా తన ఎన్నికల్లో ఇచ్చిన హామిలను అమలు చేసే పనిలో పడ్డాడు. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది.
US New Immigration Policy: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలకు తన విశ్వరూపం చూపిస్తున్నారు ట్రంప్. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ విషయంలో ఎక్కడా తగ్గేదే లేదంటున్నారు. తాజాగా ఈయన తన రెండో సారి పదవి చేపట్టిన కాలంలో దాదాపు 3 లక్షలకు పైగా వీసాలను రద్దు చేసినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది.అమెరికా చరిత్రలోనే ఇంత తక్కువ టైమ్‌లో ఈ స్థాయిలో వీసాలను రద్దు చేయడం గతంలో ఎన్నడు లేదంటున్నారు.
బర్త్ టూరిజం..
ముఖ్యంగా నేర ప్రవృత్తి కలిగివారు.. వీసా గడువు ముగిసిన దేశంలో ఉండటం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారు, దేశ భద్రతకు ముప్పుతో పాటు పౌరసత్వ దుర్వినియోగానికి పాల్పడే 'బర్త్ టూరిజం' వ్యవహారాలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. బర్త్ టూరిజం అంటే విదేశీయులు తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లి ప్రసవించడం ఎక్కువైంది. ఈ విధానానికి సంబంధించి నిబంధనల ఉల్లంఘన జరిగిందని భావించిన సందర్భాల్లో అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలను తప్పు పడుతున్న హ్యూమన్ రైట్స్ కమిషన్..
అయితే ట్రంప్ సర్కారు తీసుకుంటున్న ఈ ఏకపక్ష కఠిన నిర్ణయాలపై ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ హయాంలో రద్దు చేసిన వీసాల సంఖ్య అమెరికా చరిత్రలో ఇతర అధ్యక్షుడి కాలంతో పోలిస్తే ఎక్కువని విదేశాంగ శాఖ తెలిపింది. అమెరికాలో నివసిస్తూ చట్టాలను ఉల్లంఘించే విదేశీయులపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఇందులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటోంది ట్రంప్ సర్కార్. గత ఏడాది జనవరిలో మొత్తం 3,లక్షల వీసాల్లో 2.5 లక్షల వీసాలు రద్దయ్యాయి.
అక్రమ వలస దారుల విషయంలో సింహ స్వప్నం..
రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ట్రంప్ అక్రమ వలసదారులను బహిష్కరించే పనిలో పడ్డారు. వీసా జారీ చేయడానికి ముందు అప్లికేషన్స్ చేసుకున్నవారి సోషల్ మీడియా అకౌంట్స్ లను పరిశీలిస్తున్నారు. వీసా దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలించే ప్రక్రియను 'సోషల్ మీడియా వెట్టింగ్' అంటారు. వీసా దరఖాస్తుదారులు అమెరికాలో ప్రవేశించేందుకు అర్హులా? వారి కార్యకలాపాల వల్ల దేశ భద్రతకు ఏమైనా ముప్పు ఉందా? అనే అంశాలను అంచనా వేయడానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు. చట్టాలను ఉల్లంఘించే వారి వీసాలను వారి సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా రద్దు చేసే ప్రక్రియ ముమ్మరం చేశారు. గతంతో పోలిస్తే వీసాల రద్దు సంఖ్య రెట్టింపు అయింది. స్థానిక చట్టాలను ఉల్లంఘించడం వంటి కార్యకలాపాలకు పాల్పడే విదేశీ విద్యార్థులపై ట్రంప్ పరిపాలన నిఘాను పెంచింది.