• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /బాక్సాఫీస్ దగ్గర ‘రణబాలి’ దూకుడు.. త్వరలో లాభాల్లోకి..!

బాక్సాఫీస్ దగ్గర ‘రణబాలి’ దూకుడు.. త్వరలో లాభాల్లోకి..!

Ranabaali 6 Days Box Office Collections: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ టైటిల్‌ రోల్లో యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘రణబాలి’. రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నా.. డీసెంట్ వసూళ్లతో త్వరలో లాభాల్లో ఎంట్రీ ఇవ్వనుంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 22, 2026, 09:53 AM IST|Updated: Oct 22, 2026, 11:35 AM IST
joinshare
బాక్సాఫీస్ దగ్గర  ‘రణబాలి’ దూకుడు.. త్వరలో లాభాల్లోకి..!
Image Credit: Ranabaali Collections (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
India vs New Zealand Highlights: 'ఆ ఇద్దరికి చెప్పాల్సిన పనిలేదు, బాదడమే తెలుసు.. మ్యాచ్ చేతుల్లో పెట్టేస్తారు..'

India vs New Zealand Highlights: 'ఆ ఇద్దరికి చెప్పాల్సిన పనిలేదు, బాదడమే తెలుసు.. మ్యాచ్ చేతుల్లో పెట్టేస్తారు..'

2

వాట్సాప్ వీడియో కాల్‌లో శవాన్ని చూసి డెత్ సర్టిఫికెట్.. బుల్లెట్ మరణాన్ని గుండెపోటుగా మార్చి..!

3

10th క్లాస్ విద్యార్థులకు బిగ్ అప్‌డేట్.. టెన్త్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల..!!

4

Kwala Intel: స్టాక్‌ మార్కెట్‌లో ఏఐ హవా.. ఇన్వెస్టర్ల భవిష్యత్‌కు మార్గనిర్దేశం

5

IND Vs NZ 1st T20I: ఉత్కంఠ పోరులో భారత్ ఘనవిజయం..తొలి టీ20లో న్యూజిలాండ్‌పై టీమ్ఇండియా జయకేతనం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ranabaali Box Office Report: విజయ్ దేవరకొండ టాలీవుడ్‌లో జయాపజయాలతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర వరుస సినిమాలతో రప్ఫాడిస్తున్నాడు. కానీ విజయ్ కోరకున్న సక్సెస్ మత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత తన జీవిత భాగస్వామి రష్మిక మందన్న‌తో  కలిసి నటించిన ‘రణబాలి’ సినిమాతో మంచి హిట్‌ను అందుకున్నాడు. విజయ దశమి కానుకగా విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ సొంతం చేసుకున్నా.. మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో తొలిసారి విజయ్ దేవరకొండ చారిత్రక పాత్ర ‘రణబాలి’గా తన మార్క్ హీరోయిజం చూపించాడు.ఇక జయమ్మ పాత్రలో రష్మిక మందన్న ఒదిగిపోయింది.

దసరా సెలవుల్లో హౌస్‌ఫుల్ వసూళ్లు..

‘రణబాలి’కి దసరా పండుగ సెలవులు బాగానే కలిసొచ్చాయి.  మంగళవారం దసరా సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ సినిమా హాళ్ల దగ్గర  హౌస్‌ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటకు ఉన్న క్రేజ్ కూడా ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తోంది. ముఖ్యంగా గతంలో వచ్చిన దేశ భక్తి చిత్రాల మాదిరి కాకుండా కరువు నేపథ్యంలో బ్రిటిష్ వారు మనకు తినడానికి తిండి గింజలు లేకుండా చేసి ఉన్న మొత్తాన్ని బ్రిటన్‌కు పంపాలనుకుంటారు. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన రణబాలి వారిపై ఎలా తిరగబడి తన ప్రజల ఆకలిని తీర్చాడనే ఇతివృత్తం చూసిన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.

రణబాలిగా విజయ్ విశ్వరూపం.. 
ముఖ్యంగా ‘రణబాలి’ గా విజయ్ దేవరకొండ తన నట విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్లను ఊచకోత కోసే సీన్స్ ‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి.

బ్రేక్‌ఈవెన్ దిశగా ‘రణబాలి..
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘రణబాలి’ ఇప్పటివరకు తన ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సుమారు 75 శాతం వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా బ్రేక్‌ఈవెన్‌కు చేరువైనట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 35 కోట్ల షేర్ (రూ. 62 కోట్ల గ్రాస్)వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. ఈ రోజు రేపటితో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని క్లీన్ హిట్‌గా నిలిచే అవకాశాలున్నాయి.


విజయ్‌–రష్మిక ప్రమోషన్లు కలిసొచ్చాయి..

‘రణబాలి’ కథ చారిత్రక నేపథ్యంతో సాగుతుండటంతో, ఈ కథను ప్రేక్షకులకు చేరువ చేయడానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రత్యేకంగా ఇద్దరు  ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇలాంటి కథలు అరుదుగా వస్తాయని చెప్పడంతో పాటు చరిత్ర పుఠల్లో ఎక్కడో  ఓ ముఖ్యమైన కథను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇద్దరూ సినిమాను కాళ్లకు బలపం కట్టుకొని మరి ప్రచారం నిర్వహించారు. ఓ రకంగా ఇది ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.   ప్రమోట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి, విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న జంటకు ఉన్న క్రేజ్, దసరా సెలవులు ‘రణబాలి’కి బాక్సాఫీస్‌కు బాగా హెల్ప్ అయ్యాయి.  

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie