Ship Accident: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో టైటానిక్ తరహా పడవ ప్రమాదం చోటు చేసుకుంది. పోర్ట్ ఆఫ్ న్యూ ఓర్లీన్స్ సమీపంలోని మిస్సిస్సిప్పి నదిలో భారీ నౌక ప్రమాదం జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి.
నది ఒడ్డున నిలిపి ఉంచిన రివర్ క్రూయిజ్ నౌకను బలంగా ఢీకొట్టింది..
అదుపుతప్పిన ఒక ఆయిల్ ట్యాంకర్ నౌక, నది ఒడ్డున నిలిపి ఉంచిన రివర్ క్రూయిజ్ నౌకను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ‘అట్లాంటిక్ ఆస్ఫాల్ట్’ అనే ట్యాంకర్ నౌక, అమెరికన్ క్రూయిజ్ లైన్స్ సంస్థకు చెందిన అమెరికన్ హెరిటేజ్ క్రూయిజ్ నౌకను ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాద సమయంలో సుమారు 190 మంది ప్రయాణికులు..
ప్రమాదం జరిగిన సమయంలో క్రూయిజ్ నౌకలో సుమారు 190 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో ప్రయాణికులతో సహా ఆ పడవ మునిగిపోయింది. ఇది గమణించిన రెస్క్యూ సిబ్బంది పడవలోని ప్రయాణికులందరిని రక్షించారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన 32 మందిని చికిత్స నిమిత్తం సమీపంలోని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. యితే, అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాపాయ స్థితి, తీవ్రమైన గాయాలు కాలేదని, అందరి పరిస్థితి నిలకడగా ఉందని మేయర్ స్పష్టం చేశారు. ట్యాంకర్ అదుపు తప్పడానికి గల సాంకేతిక కారణాలపై అమెరికా కోస్ట్ గార్డ్, పోర్ట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.