• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /KTR: రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన.. ఎక్స్ వేదికగా కేటీఆర్ సంచలన ట్విట్.. హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు..

KTR: రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన.. ఎక్స్ వేదికగా కేటీఆర్ సంచలన ట్విట్.. హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు..

ktr fires on rahul gandhi: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై, ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా గతంలో ఎన్నికల వేళ ఇచ్చిన హమీలపై ఏమయ్యాయని కౌంటర్ లు వేశారు.

Written ByInamdar Paresh
Published: Nov 14, 2026, 01:27 PM IST|Updated: Nov 14, 2026, 01:36 PM IST
joinshare
KTR: రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన.. ఎక్స్ వేదికగా కేటీఆర్ సంచలన ట్విట్.. హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు..
Image Credit: ktr(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
సూర్య హాట్రిక్.. ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. సింగం రిటర్న్స్..

సూర్య హాట్రిక్.. ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. సింగం రిటర్న్స్..

2

KTR: రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన.. ఎక్స్ వేదికగా కేటీఆర్ సంచలన ట్విట్.. హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు..

3

హసీనా సొంత దేశం వెళ్లటంపై బంగ్లాదేశ్ కు భారత్ డిమాండ్..!

4

పెళ్లి బరాత్‌లో బాలుడి మాస్ డ్యాన్స్.. స్టెప్పులు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

5

Andhra Cyclone Alert: ఏపీకి మరో తుఫాను ముప్పు.. 18వ తేదీ నుంచి భారీ వర్షాలు! ఐఎండీ కీలక హెచ్చరిక

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Kts slams on cm revanth reddy govt over fake election promises: తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఇప్పటికే ఎల్ నినో ప్రభావంతో ప్రజలు, రైతన్నలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. మరోవైపు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటపై కూడా వివాదం రాజుకుంది. గతంలో ఎన్నికల వేళ అమలుకు సాధ్యం కానీ 420 హమీలు ఇచ్చి ప్రజల్నిమోసం చేశారని ఏకీపారేశారు.  ముఖ్యంగా యువతను ఉద్యోగాల పేరిట కాంగ్రెస్ వెన్నుపొటు పొడించిందన్నారు. ఈ క్రమంలో కేటీఆర్ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై అనేక ప్రశ్నల్ని సంధించారు.


కాంగ్రెస్ పార్టీ గతంలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రవేశ పెట్టిన అభయహస్తం ఏమైందని కేటీఆర్ ఫైర్ అయ్యారు.ప్రజల సొమ్మును కాంగ్రెస్ ఇష్టారితీన ఖర్చులు చేస్తుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల అమలుపై  సీఎం రేవంత్ రెడ్డి ఏంచెప్తారని ప్రశ్నలు సంధించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు ఇప్పటికి నెరవేర్చలేదన్నారు.  ఈ క్రమంలో..బీసీ డిక్లరేషన్‌లో భాగంగా వెనుకబడిన తరగతుల వారి సంక్షేమం కోసం ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల బడ్జెట్‌  కేటాయిస్తామని చెప్పి మాట తప్పారన్నారు. 

విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం వాటా కల్పిస్తామని చెప్పి ఇప్పటికి అమలు చేయలేదన్నారు. యూత్‌ డిక్లరేషన్‌లో భాగంగా 365 రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పటికి అత్తా పత్తా లేదన్నారు. ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకంను కూడా అమలు చేయలేదన్నారు. విద్యార్థులకు రూ.5 లక్షల ‘విద్యా భరోసా కార్డు’ ఇస్తామని చెప్పి అడ్డంగా మోసంచేశారన్నారు. పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందించే ‘అంబేడ్కర్‌ అభయహస్తం’ పథకం, అలాగే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు 31 శాతం వాటా కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ పథకాల్లో ఎలాంటి పురోగతి లేదని విమర్శలు గుప్పించారు.


మైనారిటీ డిక్లరేషన్‌లో భాగంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తామని చెప్పి మాటమార్చారన్నారు.  అన్ని వర్గాల్ని కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అసత్యాలు, అబద్దాలతో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిందని తన ట్విట్ లో తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ సైతం నిరుద్యోగులకు ఏడాదిలోనే భారీగా జాబ్ లు  ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ముఖంచాటేశారని ఎద్దేవా చేశారు. మరోవైపు కేటీఆర్ ట్విట్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
KTR
Revanth Reddy
Congress
Rahul Gandhi