మన దగ్గర ఉచితంగా దొరికే మామిడి ఆకులు అమెరికాలో ఇంత ఖరీదా?
4 Mango Leaves Cost 575 Rupees: అమెరికాలో ఓ వ్లాగర్ మామిడి ఆకులు కొనుగోలు చేసే సమయంలో పోస్ట్ చేసిన వీడియో విపరీంతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ యువతి మామిడి ఆకుల ధరలు చూసి షాక్ అయిపోయింది. అమెరికాలో కేవలం 4 ఆకుల ధర రూ.575గా విక్రయిస్తున్నారు..
4 Mango Leaves Cost 575 Rupees Viral News: భారల్లో పండుగలు, శుభకార్యాలు వచ్చాయంటే.. తప్పకుండా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం.. మన ఊళ్లలో అయితే.. పెరట్లో ఉండే మామిడి చెట్టు నుంచో లేదా ఇరుగుపొరుగు వారిని అడిగో ఎలాగోలా ఫ్రీగా తెచ్చుకుంటూ ఉంటారు.. మార్కెట్కు వెళ్లినా.. పది లేదా ఇరవై రూపాయలకే మామిడి ఆకులు లభిస్తూ ఉంటాయి.. కానీ.. అదే ఆకులు అమెరికా లాంటి దేవాల్లో కొనాలంటే.. మాత్రం జేబులు గుల్ల కావాల్సిందే.. నవరాత్రి పూజల కోసం షాపింగ్కు వెళ్లిన ఓ భారత మహిళకు కేవలం నాలుగు మామిడి ఆకులకే ఏకంగా రూ.575 ధరకు విక్రయిస్తున్నారు.
అమెరికాలో ఉంటున్న స్వాతి అనే వ్లాగర్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేందుకు సమీపంలోని స్టోర్కు వెళ్లింది.. అయితే, పూజా సామగ్రితో పాటు గుమ్మానికి కట్టేందుకు మామిడి ఆకులను కూడా అక్కడే వెతికిందట.. అక్కడ ఒక ప్యాకెట్లో కేవలం నాలుగు మాత్రమే.. మామిడి ఆకులు ఉన్నాయి.. అయితే, దానిపై ఉన్న ధరను చూసి.. ఆమె ఒక్కసారి ఆశ్చర్యానికి గురైన్నట్లు తెలుస్తోంది. ఆ ప్యాకెట్ ధర భారత కరెన్సీలో రూ. 575 పైగా ఉండడం చూసి ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది.. 4 ఆకులకు అంత ధరను చూసి అవాక్కైన ఆమె.. ఈ విషయాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే ఊహించని స్థాయిలో వైరల్ అయ్యింది.
మన దేశంలో చాలా తేలికగా.. తక్కువ ఖర్చుతో లభించే వస్తువులు విదేశాల్లో ఎంత ఖరీదైనవిగా మారుతాయో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తూ వస్తోంది. స్వదేశాన్ని వదిలి వేరే దేశాల గడ్డపై స్థిరపడినప్పటికీ.. మన సంస్కృతి, ఆచారాలను కాపాడుకోవాలని తపించే ప్రవాస భారతీయులు ఇలాంటి వాటి కోసం అధికంగా డబ్బులు ఖర్చు పెట్టడం తప్పడం లేదు.. ట్రాన్స్పోర్ట్ ఛార్జిలతో పాటు, దిగుమతి టాక్సులు కలిపి చిన్నచిన్న పూజా సామగ్రికి కూడా అక్కడ భారీ డిమాండ్తో పాటు అంతకుమించిన ధరలు ఉంటున్నాయని ఆ మహిళ చెబుతూ వచ్చారు..
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే విపరీతంగా వైరల్ అవ్వడం ప్రారంభమైంది.. దీనిని చూసిన సోషల్ మీడియయా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. మన ఊర్లో చెట్టు ఎక్కి కోసుకుంటే ఉచితం.. అక్కడ నాలుగు ఆకులకు రూ. 575 అంటే నమ్మలేకపోతున్నాం.. అని కొంతమంది కామెంట్లు పెడుతూ వస్తున్నారు. అంతేకాకుండా అక్కడికి వెళ్లి మామిడి ఆకుల వ్యాపారం మొదలుపెడితే.. కోటీశ్వరులం అయిపోవచ్చు.. అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు.