• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /రూ.కోటి విలువైన బుల్లి గేదె.. కేవలం 2 అడుగులే ఎత్తు.. వీడియో!

రూ.కోటి విలువైన బుల్లి గేదె.. కేవలం 2 అడుగులే ఎత్తు.. వీడియో!

Mini Buffalo Viral Video: రూ.1 కోటి విలువైన చిన్న గేదె ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని పుష్కర్ పశువుల మేళాలో భాగంగా అక్కడ ఇది కనిపించింది. ఇది చూడడానికి చాలా ముద్దుగా ఉంది. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 25, 2026, 16:30 IST|Updated: Nov 25, 2026, 16:32 IST
joinshare
రూ.కోటి విలువైన బుల్లి గేదె.. కేవలం 2 అడుగులే ఎత్తు.. వీడియో!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Bihar: వామ్మో.. భర్త డబ్బులతో  కన్నింగ్ ప్లాన్.. ప్రియుడి కోసం మహిళ చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాంక్..

Bihar: వామ్మో.. భర్త డబ్బులతో కన్నింగ్ ప్లాన్.. ప్రియుడి కోసం మహిళ చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాంక్..

2

దూసుకెళ్తున్న రూపాయి.. డాలర్‌కు చెక్ పెడుతూ 8 నెలల గరిష్ఠ స్థాయికి రూపీ.. కారణాలు ఇవే..!!

3

రూ.కోటి విలువైన బుల్లి గేదె.. కేవలం 2 అడుగులే ఎత్తు.. వీడియో!

4

శ్రీలంకలో అల్లు అర్జున్ కూతురు అర్హ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎన్నో పుట్టినరోజో తెలుసా..!!

5

ఎలాంటి రిస్క్ లేకుండా మీ డబ్బు డబుల్.. రూ. లక్ష పెడితే రూ. 2 లక్షలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mini Buffalo Viral Video: ప్రపంచంలోనే చాలా ప్రత్యేకత కలిగిన రాజస్థాన్‌లోని పుష్కర్ పశువులకు సంబంధించిన మేళా ఈ ఏడాది కూడా అద్భుతమైన వింతలకు వేదికగా మారింది.. సాధారణంగా ఈ సంతలో భారీ శరీరంలో ఉండే ఒంటెలు, గుర్రాలు, దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి.. కానీ ఈసారి అందరి చూపు ఓ బుల్లి గేదెపై పడిందట.. కేవలం 2 అడుగుల ఎత్తు మాత్రమే ఉన్న పింకీ అనే ఈ గేదె ఇప్పుడు మేళాలో హాట్ టాపిక్‌గా మారుతూ వచ్చింది. దీని ధర ఏకంగా రూ.1 కోటి అని యజమాని ప్రకటించడంతో అక్కడున్నవారు ఆశ్చర్యపోయారట. అయితే, ఈ బుల్లిగేదుకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మహారాష్ట్రలోని థానే ప్రాంతం నుంచి ఐదేళ్ల వయసున్న పింకీని దాని యజమాని పుష్కర్ మేళాకు తీసుకువచ్చారట.. ఇంత తక్కువ ఎత్తులో.. అత్యంత అరుదైన శరీరంతో ఉండటమే కాకుండా.. పింకీ చాలా అద్భుతమైన స్వభావం కలిగి ఉంటుందని యజమాని తెలుపుతున్నారు. అందుకే దీని విలువను కోటి రూపాయలుగా నిర్ణయించినట్లు అయిన తెలిపారు. అయితే, ఈ ధర యజమాని సొంతంగా నిర్ణయించిందే తప్ప.. ఇప్పటివరకు అంత మొత్తానికి కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ.. ఈ బుల్లి గేదెను చూసేందుకు.. దానితో సెల్ఫీలు దిగేందుకు జనం భారీగా తరలివచ్చినట్లు తెలుస్తోంది.. సోషల్ మీడియాలో పింకీ వీడియోలు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు దీనిని మేళా స్టార్ అని.. బుల్లి దేవత అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.

గతంలో మహారాష్ట్రకే చెందిన రాధ అనే గేదె 2 అడుగుల 8 అంగుళాల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత పొట్టి గేదెగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు పింకీ ఎత్తు కేవలం 2 అడుగులే కావడంతో.. ఇది పాత రికార్డును సైతం అధిగమించే అవకాశం ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది పుష్కర్ మేళాకు సుమారు 7 వేలకు పైగా వివిధ రకాల జంతువులు వచ్చాయట..

పింకీతో పాటు మరికొన్ని ఖరీదైన జీవాలు కూడా అక్కడి వచ్చిన వారిని అశ్చర్యానికి గురి చేసేలా చేశాయట.. ముఖ్యంగా షాంపైన్ రంగులో మెరిసిపోతున్న ఐదేళ్ల మార్వారీ గుర్రం  గోల్డెన్ కింగ్ ధర ఏకంగా రూ. 30 కోట్ల ధరతో అందుబాటులో ఉన్నట్లు సమాచారం. అలాగే 750 కిలోల బరువున్న  దేవా అనే ముర్రా జాతి దున్నపోతు ధర రూ.15 లక్షలు.. సీసాతో జ్యూస్ తాగే రుద్ర అనే మరో దున్నపోతు విలువ రూ. 65 లక్షలతో అందుబాటులో ఉందట.. వీటితో పాటు రెండున్నర అడుగుల పుంగనూరు ఆవు.. 15 అంగుళాల దాని దూడ కూడా ఇక్కడ ఆకర్షణగా నిలిచినట్లు తెలస్తోంది..
 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Rajendra tailor (@rajendra_phagi)

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News