• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /శ్రీలంకలో అల్లు అర్జున్ కూతురు అర్హ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎన్నో పుట్టినరోజో తెలుసా..!!

శ్రీలంకలో అల్లు అర్జున్ కూతురు అర్హ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎన్నో పుట్టినరోజో తెలుసా..!!

Allu Arjun Daughter Birthday Celebrations: ఈ మధ్య కాలంలో హీరోలు సినిమాలు, ఫ్యామిలీని రెండింటిని సమానంగా బ్యాలెన్స్ చేస్తున్నారు. మొత్తంగా సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో.. కుటుంబానికి అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తన చిన్నారి కూతురి పదో బర్త్ డే రోజును శ్రీలంకలో గ్రాండ్‌గా కుటుంబ సభ్యుల మధ్యలో సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 25, 2026, 16:29 IST|Updated: Nov 25, 2026, 16:35 IST
joinshare
శ్రీలంకలో అల్లు అర్జున్ కూతురు అర్హ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎన్నో పుట్టినరోజో తెలుసా..!!
Image Credit: Allu Arjun Birthday Celebrations (Instagram/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Bihar: వామ్మో.. భర్త డబ్బులతో  కన్నింగ్ ప్లాన్.. ప్రియుడి కోసం మహిళ చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాంక్..

Bihar: వామ్మో.. భర్త డబ్బులతో కన్నింగ్ ప్లాన్.. ప్రియుడి కోసం మహిళ చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాంక్..

2

దూసుకెళ్తున్న రూపాయి.. డాలర్‌కు చెక్ పెడుతూ 8 నెలల గరిష్ఠ స్థాయికి రూపీ.. కారణాలు ఇవే..!!

3

రూ.కోటి విలువైన బుల్లి గేదె.. కేవలం 2 అడుగులే ఎత్తు.. వీడియో!

4

శ్రీలంకలో అల్లు అర్జున్ కూతురు అర్హ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎన్నో పుట్టినరోజో తెలుసా..!!

5

ఎలాంటి రిస్క్ లేకుండా మీ డబ్బు డబుల్.. రూ. లక్ష పెడితే రూ. 2 లక్షలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Allu Arha 10th Birthday Celebration: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుమార్తె అల్లు అర్హ 10వ పుట్టినరోజున అదిరిపోయేలా సెలబ్రేట్ చేసుకున్నాడు. బర్త్ డే  వేడుకల కోసం ఫ్యామిలీతో కలిసి శ్రీలంకకు వెళ్లారు. తన బిడ్డ లైఫ్‌లో ఈ స్పెషల్ బర్త్ డేని కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవడం విశేషం. అంతేకాదు ఈ వేడుకకు అల్లు అర్హ తాత అల్లు అరవింద్‌తో పాటు నానమ్మ నిర్మలతో పాటు బాబాయి శిరీష్, నయనిక ఈ పుట్టినరోజు వేడుకల్లో పార్టిసిపేట్ చేశారు.  

అర్హకు పుట్టినరోజు వేడుకలకు సంబంధించి అల్లు అర్జున్ షేర్ చేసిన స్పెషల్ ఫోటో, పెట్టిన క్యాప్షన్‌లో కురిపించిన ప్రేమ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘జాయ్ ఆఫ్ మై లైఫ్’ అంటూ అల్లు అర్జున్ తన కూతురిపై ప్రేమను కురిపించారు. అర్హ పుట్టినరోజును ఘనంగా సెలెబ్రేట్ చేయాలని అల్లు అర్జున్ ప్లాన్ చేశారు. అందుకే అల్లు వారి సపరివారమంతా శ్రీలంకకు చేరుకుంది. ఈ ఏర్పాట్లను అల్లు అర్జున్ పర్యవేక్షణలో  జరిగింది. బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఒక ఫోటో తాజాగా బయటకు వచ్చింది. అందులో అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విందును  ఆస్వాదిస్తున్నారు. అల్లు వారి ఆత్మీయతను ప్రతిబింబించేలా ఆ ఫోటో ఉంది.

సినిమాల పరంగా  అల్లు అర్జున్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబంతో విలువైన సమయాన్ని గడిపేందుకు ఎప్పుడూ ఇష్టపడుతుంటాడు. అలాగే లైఫ్‌లో ఇలాంటి స్పెషల్ మూమెంట్‌‌లో వారి పక్కన ఉండటానికి ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తుంటారు. అర్హ పుట్టినరోజును ఎప్పటికీ గుర్తుండి పోయేలా  ఈ ఏర్పాట్లు కుటుంబంపై అల్లు అర్జున్‌కి ఉన్న ప్రేమను, బాధ్యతను చాటి చెబుతున్నాయి.

అర్హ తన పదో ఏట అడుగుపెట్టిన ఈ సమయంలో శ్రీలంకలో జరిగిన ఈ వేడుకలు అల్లు కుటుంబం మధ్య ఉన్న బలమైన భావోద్వేగమైన  అనుబంధాన్ని, జీవితంలోని ప్రత్యేక క్షణాలను ఇలా సెలెబ్రేట్ చేసుకునేందుకు వారు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చారనే విషయాన్ని చాటి చెప్పాయి.  

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News