రూ.కోటి విలువైన బుల్లి గేదె.. కేవలం 2 అడుగులే ఎత్తు.. వీడియో!
Mini Buffalo Viral Video: రూ.1 కోటి విలువైన చిన్న గేదె ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని పుష్కర్ పశువుల మేళాలో భాగంగా అక్కడ ఇది కనిపించింది. ఇది చూడడానికి చాలా ముద్దుగా ఉంది. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Mini Buffalo Viral Video: ప్రపంచంలోనే చాలా ప్రత్యేకత కలిగిన రాజస్థాన్‌లోని పుష్కర్ పశువులకు సంబంధించిన మేళా ఈ ఏడాది కూడా అద్భుతమైన వింతలకు వేదికగా మారింది.. సాధారణంగా ఈ సంతలో భారీ శరీరంలో ఉండే ఒంటెలు, గుర్రాలు, దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి.. కానీ ఈసారి అందరి చూపు ఓ బుల్లి గేదెపై పడిందట.. కేవలం 2 అడుగుల ఎత్తు మాత్రమే ఉన్న పింకీ అనే ఈ గేదె ఇప్పుడు మేళాలో హాట్ టాపిక్‌గా మారుతూ వచ్చింది. దీని ధర ఏకంగా రూ.1 కోటి అని యజమాని ప్రకటించడంతో అక్కడున్నవారు ఆశ్చర్యపోయారట. అయితే, ఈ బుల్లిగేదుకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మహారాష్ట్రలోని థానే ప్రాంతం నుంచి ఐదేళ్ల వయసున్న పింకీని దాని యజమాని పుష్కర్ మేళాకు తీసుకువచ్చారట.. ఇంత తక్కువ ఎత్తులో.. అత్యంత అరుదైన శరీరంతో ఉండటమే కాకుండా.. పింకీ చాలా అద్భుతమైన స్వభావం కలిగి ఉంటుందని యజమాని తెలుపుతున్నారు. అందుకే దీని విలువను కోటి రూపాయలుగా నిర్ణయించినట్లు అయిన తెలిపారు. అయితే, ఈ ధర యజమాని సొంతంగా నిర్ణయించిందే తప్ప.. ఇప్పటివరకు అంత మొత్తానికి కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ.. ఈ బుల్లి గేదెను చూసేందుకు.. దానితో సెల్ఫీలు దిగేందుకు జనం భారీగా తరలివచ్చినట్లు తెలుస్తోంది.. సోషల్ మీడియాలో పింకీ వీడియోలు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు దీనిని మేళా స్టార్ అని.. బుల్లి దేవత అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.
గతంలో మహారాష్ట్రకే చెందిన రాధ అనే గేదె 2 అడుగుల 8 అంగుళాల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత పొట్టి గేదెగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు పింకీ ఎత్తు కేవలం 2 అడుగులే కావడంతో.. ఇది పాత రికార్డును సైతం అధిగమించే అవకాశం ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది పుష్కర్ మేళాకు సుమారు 7 వేలకు పైగా వివిధ రకాల జంతువులు వచ్చాయట..
పింకీతో పాటు మరికొన్ని ఖరీదైన జీవాలు కూడా అక్కడి వచ్చిన వారిని అశ్చర్యానికి గురి చేసేలా చేశాయట.. ముఖ్యంగా షాంపైన్ రంగులో మెరిసిపోతున్న ఐదేళ్ల మార్వారీ గుర్రం గోల్డెన్ కింగ్ ధర ఏకంగా రూ. 30 కోట్ల ధరతో అందుబాటులో ఉన్నట్లు సమాచారం. అలాగే 750 కిలోల బరువున్న దేవా అనే ముర్రా జాతి దున్నపోతు ధర రూ.15 లక్షలు.. సీసాతో జ్యూస్ తాగే రుద్ర అనే మరో దున్నపోతు విలువ రూ. 65 లక్షలతో అందుబాటులో ఉందట.. వీటితో పాటు రెండున్నర అడుగుల పుంగనూరు ఆవు.. 15 అంగుళాల దాని దూడ కూడా ఇక్కడ ఆకర్షణగా నిలిచినట్లు తెలస్తోంది..