SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అలర్ట్.. రేపటి నుంచి కొత్త రూల్స్.. SBI ఏటీఎం ఛార్జీలు, LPG గ్యాస్ సబ్సిడీలో భారీ మార్పులు!

సెప్టెంబర్ మాసం ఈరోజుతో ముగిసింది. రేపటి నుంచి కొత్త నెల ప్రారంభం కానుంది. అయితే అక్టోబర్ 1వ తేదీ నుంచి మన దేశంలో కొన్ని మార్పులు జరగనున్నాయి.ఇవి సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ ధరల సవరణ జరుగుతుంది. మరి రేపటి నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఏంటో తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Sep 30, 2026, 07:24 AM IST | Updated: Sep 30, 2026, 07:27 AM IST
Image Credit: Rule Changes Effective October 1
Join

అక్టోబర్ ఒకటో తేదీ నుంచి దేశంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరగనున్నాయి. ప్రధానంగా నిత్యావసర వస్తువుల ధరల సవరణ ఉండనుంది. ఇది సామాన్యులపై ప్రభావం చూపుతుంది. గ్యాస్ ధరలతో పాటు రిఫ్రిజిరేటర్, టీవీ, ఏసీ వంటి వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. పండుగల సీజన్ దృష్ట్యా మొత్తం 10 రకాల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇవి మీ ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోండి.

ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు..
సాధారణంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన ఎల్‌పీజీ గ్యాస్ ధరలను సవరిస్తుంటాయి. అక్టోబర్ ఒకటో తేదీన 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం సిలిండర్ ధరలు ఢిల్లీలో రూ.942, కోల్‌కతాలో రూ.968, ముంబైలో రూ.941, చెన్నైలో రూ.957 ఉన్నాయి.

ఎల్‌పీజీ సబ్సిడీ మార్పులు..
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను మార్చే అవకాశం ఉంది. అలాగే, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ పొందాలంటే ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే అందుతుంది, లేకుంటే రేపటి నుంచి సబ్సిడీ పొందలేరు.

ఓటిపి ఆధారంగా గ్యాస్‌ డెలివరీ..
అక్టోబర్ ఒకటో తేదీ నుంచి మరో కీలక మార్పు అమల్లోకి రానుంది. ఇకపై ఓటీపి ఆధారంగానే మీకు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయబడుతుంది. ఈ ఓటీపి కస్టమర్ మొబైల్ నంబర్‌కు వస్తుంది. ఆ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే గ్యాస్ ఏజెంట్లు సిలిండర్‌ను డెలివరీ చేస్తారు.

ఏటీఎఫ్ ధరల మార్పులు..
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కేవలం ఎల్‌పీజీ ధరలనే కాకుండా, ప్రతి నెల ఒకటో తేదీన ఏటీఎఫ్ ధరలను కూడా సవరిస్తాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఏటీఎఫ్ ధర 1,049.27 గా ఉంది.

ఎస్‌బీఐ ఏటీఎం రూల్స్..
ఎస్‌బీఐ కస్టమర్లకు కూడా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొన్ని మార్పులు వర్తిస్తాయి. క్యాష్ విత్ డ్రాయల్ అంశం సేవింగ్స్, శాలరీ అకౌంట్లపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా ప్రతి నెలా నాలుగు సార్లు ఉచితంగా విత్ డ్రాయల్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ సార్లు డ్రా చేస్తే రూ.15 తోపాటు జీఎస్టీ విధిస్తారు. శాలరీ అకౌంట్ హోల్డర్లు ప్రతి నెలా మొత్తం 10 సార్లు విత్ డ్రాయల్ చేసుకోవచ్చు, అయితే ప్రస్తుతం ఈ పరిమితిని ఐదుకు తగ్గించారు. లిమిట్ దాటితే రూ.23 తోపాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఎఫ్‌డీ రూల్స్ లో మార్పులు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లపై కూడా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొన్ని మార్పులు చేయనుంది. బ్యాంకులు ప్రతిరోజూ ఉదయం 10 గంటల కల్లా తమ ఎఫ్‌డీ వివరాలను అప్‌డేట్ చేయాలి. అలాగే, అన్ని బ్రాంచ్‌లకు ఒకే విధమైన వడ్డీ రేట్లు అందించాల్సి ఉంటుంది.

ఎన్నారై పెట్టుబడులు..
గతంలో ఎన్నారైలు పెట్టుబడి పెట్టాల్సి వస్తే ఎక్కువ పేపర్ వర్క్ ఉండేది. కానీ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ టిడిఎస్ ప్రక్రియను సులభతరం చేసింది. ఇప్పటి నుంచి రెసిడెంట్ ఇండియన్లు లేదా హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ ఏదైనా ప్రాపర్టీని ఎన్నారైలు కొనుగోలు చేసినా, ప్రత్యేక టాక్స్ డిడక్షన్ అకౌంట్ నంబర్ అవసరం లేదు. పాన్ కార్డు ఆధారంగానే టిడిఎస్ రిపోర్ట్స్ ప్రాసెస్ చేస్తారు.

బర్త్, డెత్ సర్టిఫికేట్..
అక్టోబర్ ఒకటో తేదీ నుంచి బర్త్, డెత్ సర్టిఫికేట్ల జారీలో కూడా కఠినమైన నిబంధనలు అమలులోకి రానున్నాయి. 21 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తే భారీ జరిమానా విధించడమే కాకుండా, అదనంగా అఫిడవిట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది.

టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ ధరల పెంపు..
దసరా, దీపావళి పండుగలు వస్తున్న నేపథ్యంలో హౌస్ అప్లయన్స్‌ ధరలు పెరుగుతున్నాయి. మీరు కొత్తగా టీవీ, రిఫ్రిజిరేటర్ లేదా ఎయిర్ కండిషనర్ కొనాలనుకుంటే, అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ధరలు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి.

16 రోజులు బ్యాంకులు బంద్..
మీకు బ్యాంకింగ్ పనులు ఏవైనా ఉంటే ముందే పూర్తి చేసుకోండి, ఎందుకంటే అక్టోబర్ నెలలో మొత్తం 16 రోజులు బ్యాంకులు బంద్ ఉంటాయి.  ఆర్బీఐ ప్రకారం, ప్రతి ఆదివారంతో పాటు రెండో శనివారాలు బ్యాంకులు సెలవు ఉంటాయి. వీటితో పాటు స్థానిక పండుగల కారణంగా కూడా బ్యాంకులు బంద్‌ ఉంటాయి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES