SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రాత్రి సెక్యూరిటీ గార్డ్‌గా పని.. పగలు బీటెక్ చదువు.. హైదరాబాద్ యువకుడి కథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

BTech Students Story Goes Viral: ఒక యువకుడు చదువుకుంటూ.. కుటుంబం కోసం ప్రతి రోజు సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు.. రూ.10 లక్షల వరకు అప్పులు ఉండడంతో వాటిని తీర్చేందుకు తను ఇలా చదువుకుంటూ.. పని చేస్తున్నారని తెలిపారు. అయితే, ఆయనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 14, 2026, 03:42 PM IST | Updated: Nov 14, 2026, 03:44 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Hyderabad BTech Students Inspiring Story Goes Viral: సాధారణంగా పందొమ్మిదేళ్ల వయసంటే.. కాలేజీ క్యాంపస్‌లో స్నేహితులతో సరదాగా గడుపుతూ.. భవిష్యత్తుపై అద్భుతమైన కలలు కనే సమయం.. కానీ హైదరాబాద్‌కు చెందిన అభిరామ్ అనే యువకుడి జీవితం మాత్రం దీని చాలా పూర్తి భిన్నంగా ఉంది.. పగలు పుస్తకాలతో చదువుకుంటూ.. రాత్రివేళ సెక్యూరిటీ గార్డ్ యూనిఫాం వేసుకుని.. కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు.. 10 లక్షల కుటుంబ అప్పును తీర్చేందుకు ఈ యువకుడు పడుతున్న కష్టం ఇప్పుడు సోషల్ మీడియాలో లక్షలాది మందిని కదిలిస్తోంది. అంతేకాకుండా ఆతను పోస్ట్‌ చేసిన వీడియో ఊహించని స్థాయిలో వైరల్‌ అవుతూ వస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్‌లోని కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు అభిరామ్.. అతని కుటుంబం ఫిల్మ్ నగర్‌తో ప్రాంతంలోని ఒక అద్దె ఇంట్లో ఉంటోంది.. తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెళ్లతో మొత్తం ఐదుగురి కుటుంబ సభ్యులు.. పెద్ద చెల్లెలు ఫిజియోథెరపీ నాలుగో సంవత్సరం చదువుకుంటోంది.. చిన్న చెల్లెలు పదో తరగతి చదువుతోంది.. అయితే, కుటుంబంపై ఉన్న సుమారు రూ.10 లక్షల అప్పుకు ప్రతినెలా రూ.27 వేల వరకు EMI చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అభిరామ్ గత పది నెలలుగా సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడట..

అత్యంత భావోద్వేగపూరితమైన అంశం ఏమిటంటే.. అభిరామ్, అతని తండ్రి ఇద్దరూ ఒకే చోట సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు.. తండ్రి పగటిపూట పని చేస్తాడట.. అభిరామ్ రాత్రి షిఫ్ట్‌లో పనిచేస్తాడు.. ఉదయం 7 గంటలకు తండ్రి డ్యూటీకి రాగానే.. అభిరామ్ తన షిఫ్ట్ ముగించుకుని.. నేరుగా కాలేజీకి వెళ్తాడట.. తండ్రికి రూ.16 వేలు.. అభిరామ్‌కు రూ.13 వేల జీతం వస్తుందట.. ఇంటి అద్దె, ఇతర ఖర్చుల కోసం తల్లి కూడా ఇళ్లలో పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తూ వస్తోంది..

గతంలో అభిరామ్ ప్యాకేజింగ్ విభాగంలో చేసేవారట.. అక్కడ చదువుకోవడానికి సమయం దొరికేది కాదట.. అందుకే రాత్రివేళ ప్రశాంతంగా అసైన్‌మెంట్లు పూర్తి చేసుకునే వీలుంటుందని.. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడట.. అంతేకాకుండా బీటెక్ సెక్యూరిటీవాలా పేరుతో సోషల్ మీడియాలో తన రోజువారీ చేస్తున్న పనులను కూడా రీల్‌ రూపంలో పంచుకుంటూ.. ఎందరో విద్యార్థులకు మార్గదర్శిగా నిలుస్తున్నాడు..

ఏ పనీ చిన్నది కాదు.. నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ కష్టపడటానికి సిగ్గుపడకూడదు.. అని అభిరామ్ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. సోషల్ మీడియాలో గుర్తింపు వచ్చినప్పటికీ.. ఏ పరిస్థితుల్లోనూ చదువును మాత్రం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నాడు.. బీటెక్ పూర్తి చేసి మంచి ఉద్యోగం సాధించాలని.. తనలాగే ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమవుతున్న పేద విద్యార్థులకు అండగా నిలవాలన్నదే తన జీవిత లక్ష్యమని అభిరామ్ తెలిపారు..
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES