చిన్ననాటి వేధింపుల కోపం.. 75 ఏళ్ల తాతను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చం**పిన 20 ఏళ్ల మనవరాలు!
Granddaughter Kills Grandfather: చిన్నతనంలో తనపై లైం**గిక దాడికి పాల్పడ్డారని.. 75 ఏళ్ల తాతను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన మనవరాలికి సంబంధించిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకొని సోషల్ మీడియా వినియోగదారులు సైతం షాక్ అయిపోతున్నారు. అయితే, ఈ అంశానికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Granddaughter Kills Grandfather News: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఓ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రక్త బంధాల మధ్య గూడుకట్టుకున్న చేదు అనుభవం ఓ వృద్ధుడి ప్రాణాలను బలి తీసుకుంది. చిన్నతనంలో తనపై లైం**గిక దాడికి పాల్పడ్డాడు అన్న ఆగ్రహంతో 20 ఏళ్ల మనవరాలు. తన 75 ఏళ్ల తాతపై క్రికెట్ బ్యాట్ తో విచక్షణ రహితంగా దాడి చేసి చంపేసింది. ఇప్పుడు ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇండోర్ కు చెందిన సదరు యువతి అక్కడే ఓ కళాశాలలో డిగ్రీ చదువుకుంటుంది. శనివారం రాత్రి ఆమె ఇంటికి ఆలస్యంగా రావడంతో తల్లిదండ్రులు మందలించారట. ఈ క్రమంలో వారి మధ్య తీవ్రవాగ్వాదం కూడా చెలరేగినట్లు తెలుస్తోంది. అయితే ఆ వాగ్వాదం ముదురుతున్న సమయంలో ఆమె చిన్ననాటి చేదు అనుభవం అందులో వచ్చింది.. చిన్నతనంలోనే తన తాత తనపై లైం**గిక వేధింపులకు పాల్పడ్డాడని.. ఆ సమయంలో కన్నవారై ఉండి కూడా ఆయనను ఎందుకు అడ్డుకోలేద.. తనకు ఎందుకు రక్షణగా నిలబడలేదని తల్లిదండ్రులను అదే సమయంలో ఆ యువతీ నిలదీసింది..
ఈ గొడవలతో తీవ్ర మానసిక ఆవేశానికి గురైన ఆ యువతి.. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ఉన్న ఒక క్రికెట్ బ్యాట్ తీసుకొని తన మోటార్ సైకిల్ పై తాత ఇంటికి బయలుదేరింది.. ఆదివారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో వేరే ప్రాంతంలో నివసిస్తున్న తాత నానమ్మల ఇంటికి చేరుకుందట.. తలుపులు తట్టడంతో తన నానమ్మ నిద్రలేచి తలుపులు తీసిందట..
తలుపులు తెరవగానే ఏమాత్రం సమయం వృధా చేయకుండా ఆ యువతి లోపలికి వెళ్లి.. నేరుగా నిద్రపోతున్న తాత గదిలోకి వెతుక్కుంటూ వెళ్లిపోయిందట.. ఆవేశంతో తన చేతిలో ఉన్న క్రికెట్ బ్యాట్ తో వృద్ధుడిపై విచక్షణారహితంగా దాడి చేసిందట.. ఆమె దాడితో తీవ్ర రక్తస్రావమైన ఆ వృద్ధుడు అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయినట్లు తెలుస్తోంది..
కుటుంబ సభ్యులు వెంటనే తీవ్ర గాయాల పాలైన ఆ వృద్ధుడిని సమీపంలోని అరబిందో ఆసుపత్రికి తరలించారట. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆచారి అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అంతరం నిందితురాలైన మనవరాలిని పోలీసు అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారట..
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితురాలు తన చిన్నతనంలో ఉన్నప్పుడు తాత తనతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా.. పదేపదే లైం**గిక వేధింపులకు గురి చేశాడని.. ఆ కోపంతోనే.. ఆవేశంలో ఈ దాడికి పాల్పడినట్లు అధికారుల దర్యాప్తులో భాగంగా తేలింది.. పోలీసులు నిందితురాని వాంగ్మూలాన్ని నమోదు చేసుకొని.. ఆమెపై చేసిన లైం**గిక వేధింపుల ఆరోపణలతో పాటు కుటుంబ నేపథ్యం, ఈ సంఘటన వెనుక ఉన్న పూర్తి కారణాలపై ప్రత్యేకమైన దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.. ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది.