2027 సెలవుల క్యాలెండర్ చూశారా? పండగలు తెచ్చిన పెద్ద తలనొప్పి.. నిరాశలో ఉద్యోగ వర్గాలు!
2027 Holiday Calendar: ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులతోపాటు ఐటీ ఉద్యోగులకు 2027 ఏడాది తీవ్ర నిరాశను మిగుల్చనుంది. సాధారణంగా పండగలు గురువారం లేదా శుక్రవారాల్లో వస్తే దానికి శనివారం, ఆదివారం కూడా తోడై.. లాంగ్ వీకెండ్స్ వస్తాయి.
2027 Holiday Calendar: ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులతోపాటు ఐటీ ఉద్యోగులకు 2027 ఏడాది తీవ్ర నిరాశను మిగుల్చనుంది. సాధారణంగా పండగలు గురువారం లేదా శుక్రవారాల్లో వస్తే దానికి శనివారం, ఆదివారం కూడా తోడై.. లాంగ్ వీకెండ్స్ వస్తాయి. ఈ సమయంలో ఉద్యోగులు తమ ఫ్యామిలీతో కలిసి టూర్ ప్లాన్ చేసుకుంటారు. అయితే వచ్చే ఏడాది మాత్రం ఆ అద్రుష్టం ఉద్యోగులకు దక్కే ఛాన్స్ కనిపించడం లేదు. వచ్చే ఏడాది మహాశివరాత్రి నుంచి మొదలుకుని.. దీపావళి, క్రిస్మస్ వరకు కీలకమైన పండగలన్నీ శనివారం, లేదా అదివారాల్లోనే వస్తున్నాయి. పండగల సెలవులు వ్రుథా అయిపోతుండటంతో.. లాంగ్ వీకెండ్స్ కోసం ఎదురుచూసే శ్రామిక శక్తికి ఈ క్యాలెండర్ ఆందోళన కలిగిస్తోందని చెప్పాలి. 2027లో ఏయే పండగలు ఏ రోజు వస్తున్నాయో తెలుసుకుందాం.
*మహా శివరాత్రి (మార్చి 6, శనివారం)
*మేడే (శనివారం)
*స్వాతంత్ర్య దినోత్సవం ( ఆదివారం)
*వినాయక చవితి (సెప్టెంబర్ 4, శనివారం)
*గాంధీ జయంతి (శనివారం)
*దసరా (అక్టోబర్ 9, శనివారం)
*దీపావళి (అక్టోబర్ 30, శనివారం)
*గురు నానక్ జయంతి (నవంబర్ 14, ఆదివారం)
*క్రిస్మస్ (శనివారం)
ఇక కార్పొరేట్ సంస్థలు.. ప్రైవేట్ ఆఫీసులలో ఉద్యోగులకు నిర్దిష్టమైన సెలవుల కోటా ఎప్పుడూ ఉంటుంది. అయితే.. పండుగలు వారాంతాల్లో వస్తున్నప్పటికీ.. సాధారణ సెలవులు మాత్రం యథావిధిగా ఉంటాయి. ఒకవేళ లాంగ్ వీకెండ్స్ కుదిరితే ఎంజాయ్ చేయవచ్చు. కానీ వాటి గురించే ఎక్కువగా ఆలోచించి నిరాశ చెందకూడదు. అందువల్ల, లాంగ్ వీకెండ్స్ గురించి బెంగ పెట్టుకోకుండా.. వీలు కుదిరిన సమయాల్లో సెలవులు ప్లాన్ చేసుకుంటూ ప్రశాంతంగా ఎంజాయ్ చేయడం బెస్ట్ అని చెప్పాలి.