• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /యవ్వనంలో ఈ 3 తప్పులు చేయకండి.. వృద్ధాప్యంలో బాధలు తప్పాలంటే చాణక్యుడి సూచనలు!

యవ్వనంలో ఈ 3 తప్పులు చేయకండి.. వృద్ధాప్యంలో బాధలు తప్పాలంటే చాణక్యుడి సూచనలు!

Chanakya Niti Telugu News: చాణక్య నీతి శాస్త్రంలో యవ్వనంలో కొన్ని లక్షణాలున్న వారు వృద్ధాప్యంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారని.. ముఖ్యంగా ప్రశాంతంగా ఉండలేరని తెలుపుతోంది. అసలు చాణక్యనీతి శాస్త్రం ప్రకారం.. యవ్వనంలో ఎలాగుండాలో.. ఇలాంటి లక్షణాలకు దూరంగా ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 21, 2026, 11:54 AM IST|Updated: Oct 21, 2026, 11:56 AM IST
joinshare
యవ్వనంలో ఈ 3 తప్పులు చేయకండి.. వృద్ధాప్యంలో బాధలు తప్పాలంటే చాణక్యుడి సూచనలు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Supreme Court: ఈనెల 25 వరకు వాయిదా  వేయండి.. ఏపీ స్థానిక సంస్థల నామినేషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Supreme Court: ఈనెల 25 వరకు వాయిదా వేయండి.. ఏపీ స్థానిక సంస్థల నామినేషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

2

కన్నీళ్లు తెప్పిస్తున్న తల్లి కుక్క వీడియో.. చనిపోయిన పిల్లను తన కాళ్లతోనే పూడ్చిపెట్టింది!

3

వామ్మో.. విషపూరితమైన పామును నమిలి తింటున్న జింక.. వీడియో ఇదే!

4

యవ్వనంలో ఈ 3 తప్పులు చేయకండి.. వృద్ధాప్యంలో బాధలు తప్పాలంటే చాణక్యుడి సూచనలు!

5

ప్రైవేట్ బడుల్లో 25శాతం ఫ్రీ సీట్లు.. ఇకపై ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Chanakya Niti Telugu News: ఏ దేశ పురోగతికైనా.. కుటుంబ ఎదుగుదల కైనా యువత పాత్ర క్రియాశీలకమని.. ఆచార్య చానక్యుడు తన నీతి శాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నాడు.. నవభారత నిర్మాతలైన యువతరం తీసుకునే నిర్ణయాలే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తూ ఉంటాయి.. అయితే, యవ్వనంలో ఉన్నప్పుడు తప్పుడు మార్గంలోకి లాగే శక్తులు.. ప్రలోభాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి.. సరైన సమయంలో వాటిని గుర్తించి దూరంగా ఉండకపోతే.. యవ్వన దశతో పాటు వృద్ధాప్యంలో కూడా కష్టాలతో పాటు కన్నీళ్లు ఉంటాయని చాణక్యనీతి శాస్త్రం హెచ్చరిస్తూ వస్తోంది. ముఖ్యంగా యవ్వనంలో ఉన్నవారు తమ జీవితాన్ని సార్ధకతం చేసుకోవడానికి దూరంగా ఉండాల్సిన మూడు కీలకమైన విషయాలను చాణక్యనీతి శాస్త్రం స్పష్టంగా వివరిస్తోంది.

చెడు సావాసం..
మంచిదైన.. చెడ్డదైనా ఒక వ్యక్తి జీవన శైలిపై సావాసం ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. చెడు లక్షణాలతో పాటు మోసపూరిత ఆలోచనలు కలిగిన వ్యక్తులతో స్నేహం మనిషిని తప్పుడు పనుల వైపు నడిపిస్తూ ఉంటుంది.. అంతేకాకుండా వ్యసనాలతో పాటు గొడవలు, విచ్చల విడితనం వంటివి మనిషిని లక్ష్యానికి ఆమడ దూరంలో నిలబెడుతూ ఉంటాయి. ఇటువంటి చెడు సావాసాల వల్ల వ్యక్తిలో ఆలోచన శక్తి.. విచక్షణ జ్ఞానం నశించిపోతూ ఉంటుంది. ఫలితంగా విజయాలు దూరమై.. జీవితం అంధకారం అవుతుందని చాణక్యనీతి శాస్త్రం వివరిస్తూ ఉంది. యవ్వనంలో ఉన్నప్పుడు మంచి తో పాటు చెడులను గుర్తించి వెంటనే చెడు నుంచి బయటపడాలని.. అలా ఉంటేనే భవిష్యత్తుతోపాటు వృద్ధాప్యం కూడా సుఖమయంగా మారుతుందని చాణక్యనీతి శాస్త్రం సూచిస్తుంది..

సోమరితనం..
యవ్వనంలో ఎంత కష్టపడితే వృద్ధాప్యంలో అంత సుఖపడతారనేది జగమెరిగిన సత్యమే.. ఈ వయస్సులో మనిషి ఎదుగుదలకు అత్యంత ప్రమాదకరమైన శత్రువు బద్ధకం.. సోమరితనంతో కాలయాపన చేసే వారికి విద్య లభించకపోవడంతో పాటు విద్య లేని లోటు ధన సంపాదన సాధ్యం కాదని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది. ధనం లేకపోతే జీవితాంతం ఆర్థిక ఇబ్బందులతో పాటు సంఘర్షణలతోనే గడపాల్సి వస్తుందని.  కాబట్టి యువత సమయం విలువలను గుర్తించి.. బద్దకాన్ని విడిచిపెట్టి పట్టుదలతో పనిచేస్తే తిరుగులేని విజయాలు సాధించగలుగుతారని చాణక్యనీతి శాస్త్రం తెలుపుతోంది..

విపరీతమైన కోపం..
ఆవేశంతో పాటు కోపంలో పనులను చక్కబెట్ట లేకపోతే.. నిర్మించుకున్న ప్రతిష్టలు క్షణంలోనే నాశనమయ్యే అవకాశాలున్నాయి. యవ్వనంలో ఉడుకు రక్తం వల్ల సహజంగానే దూకుడుతో పాటు కోపం రావడం సర్వ సహజం.. కానీ దానిపై నియంత్రణ సాధించిన వారే ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు ఉన్నాయని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది. కోపం మనిషి వివేకాన్ని నాశనం చేసే ఒక విషం లాంటిది.. కోపిష్టి వ్యక్తులకి ఆప్తులే కాకుండా సమాజం కూడా దూరం అవుతూ ఉంటుంది. మీ శత్రువు మీ కోపాన్ని అస్త్రంగా మార్చుకొని.. మీ కష్టాన్ని బూడిదలో పోసేసిన పన్నీరుగా మార్చే ప్రమాదం కూడా ఉంది.. కాబట్టి యవ్వన దశలో చెడు సావాసంతో పాటు బద్ధకం.. మితిమీరిన కోపాన్ని విడిచిపెట్టి.. ఆత్మ నిగ్రహంతో పాటు క్రమశిక్షణతో ముందుకు సాగితే వృద్ధాప్యం చాలా ప్రశాంతంగా.. ఆనందమయంగా సాగుతుందని ఆచార్య చానక్యుడు చెబుతున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News