• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /ఫ్రాన్స్ సంక్షోభానికి కారణమైన మాక్రాన్ 5 బ్లండర్ మిస్టేక్స్.. యూరప్‌పై పడనున్న తీవ్ర ప్రభావం! ఏకైక మార్గం ఇదేనా?

ఫ్రాన్స్ సంక్షోభానికి కారణమైన మాక్రాన్ 5 బ్లండర్ మిస్టేక్స్.. యూరప్‌పై పడనున్న తీవ్ర ప్రభావం! ఏకైక మార్గం ఇదేనా?

యూరప్ దేశాలు ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న నిత్యావసర ధరలు, తగ్గుతున్న ప్రభుత్వ సేవలకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి కేవలం ఫ్రాన్స్ మాత్రమే కాకుండా ఇటలీ, అల్బేనియా, సెర్బియా, బెల్జియం వంటి దేశాలకు కూడా విస్తరించింది. అయితే, ఈ నిరసనలన్నీ ఫ్రాన్స్‌లోనే మొదలయ్యాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం చేసిన 5 ప్రధాన తప్పిదాల వల్ల దేశం అగ్నిగుండంగా మారుతోందా? అధ్యక్షుడు ఇమాన్యూల్ మాక్రోన్ ముందున్న సవాళ్లు ఏంటి? ఈ పరిస్థితులను ఆయన ఎలా అదుపు చేయబోతున్నారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Written ByRenuka Godugu
Published: Oct 21, 2026, 11:48 AM IST|Updated: Oct 21, 2026, 11:59 AM IST
joinshare
ఫ్రాన్స్ సంక్షోభానికి కారణమైన మాక్రాన్ 5 బ్లండర్ మిస్టేక్స్.. యూరప్‌పై పడనున్న తీవ్ర ప్రభావం! ఏకైక మార్గం ఇదేనా?
Image Credit: France protests news 2026:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Supreme Court: ఈనెల 25 వరకు వాయిదా  వేయండి.. ఏపీ స్థానిక సంస్థల నామినేషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

Supreme Court: ఈనెల 25 వరకు వాయిదా వేయండి.. ఏపీ స్థానిక సంస్థల నామినేషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

2

కన్నీళ్లు తెప్పిస్తున్న తల్లి కుక్క వీడియో.. చనిపోయిన పిల్లను తన కాళ్లతోనే పూడ్చిపెట్టింది!

3

వామ్మో.. విషపూరితమైన పామును నమిలి తింటున్న జింక.. వీడియో ఇదే!

4

యవ్వనంలో ఈ 3 తప్పులు చేయకండి.. వృద్ధాప్యంలో బాధలు తప్పాలంటే చాణక్యుడి సూచనలు!

5

ప్రైవేట్ బడుల్లో 25శాతం ఫ్రీ సీట్లు.. ఇకపై ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

France protests news 2026: రాజకీయ విశ్లేషణ నిపుణుల అంచనా ప్రకారం, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యూల్ మాక్రోన్ చేసిన ఐదు తప్పుల వల్ల ఫ్రాన్స్‌లో అగ్నిగుండంగా మారిపోయింది.మొదటిది, పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలు సక్రమంగా జరగకపోవడంతో నిరసనలు మొదలయ్యాయి. ఉద్యోగ సంఘాలు, ఇతర శక్తులు తోడవ్వడంతో ఈ నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వ కట్టడాలను ధ్వంసం చేస్తూ, కాల్చివేస్తున్నారు. చివరికి సుప్రీంకోర్టును కూడా తగలబెట్టారు. పారిస్, లియోన్, మార్సెయిల్ వంటి ప్రధాన నగరాల్లో హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి, మాల్స్‌లో దోపిడీలు కూడా జరుగుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల ప్రకారం, మాక్రోన్ ప్రభుత్వం చేసిన ఈ ఐదు తప్పిదాలే ఈ వివాదానికి మూలకారణం.

1. విద్యా బడ్జెట్‌లో భారీ కోతలు:
ఏ దేశానికైనా విద్యార్థులే భవిష్యత్తు. కానీ, ఫ్రాన్స్ ప్రభుత్వం ద్రవ్య లోటును నియంత్రించే క్రమంలో విద్యా బడ్జెట్‌లో భారీగా కోతలు విధించింది. దీనివల్ల విశ్వవిద్యాలయాలపై ప్రభావం పడి, ఉపాధ్యాయుల కొరత ఏర్పడటమే కాకుండా మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి. తమ భవిష్యత్తు ప్రమాదంలో ఉందని భావించిన విద్యార్థులు తరగతులను బహిష్కరించి మొదటగా శాంతియుతంగానే నిరసన తెలిపారు. వారి డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించడంతో ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ఉధృతమైంది.

2. సమాచార లోపం..
మాక్రోన్ తన రెండో పదవీకాలంలో ప్రజలతో సరిగ్గా కమ్యూనికేట్‌ చేయలేకపోయారు ఆరోపణలు ఉన్నాయి. కొత్త బడ్జెట్‌ను అమలు చేసేటప్పుడు ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు లేదా సామాన్య పౌరులతో చర్చించకుండానే అధికారుల ద్వారా నిర్ణయాలను రుద్దడానికి ప్రయత్నించారు. నిరసనలు మొదలైనప్పుడు వాటిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించకపోవడం, వాటి అమలుపై స్పష్టత లేకపోవడం వల్ల ప్రజల్లో ఆందోళన పెరిగింది.

3. ద్రవ్యోల్బణం..
నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం మరో ప్రధాన కారణం. ద్రవ్యోల్బణం వల్ల మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలపై తీవ్ర ప్రభావం పడింది. ఆహారం, విద్యుత్, గ్యాస్, ఇంధన ధరలు పెరగడంతో అద్దెలు, రోజువారీ ఖర్చులు భరించడం కష్టతరమైంది. పెద్ద పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపులు ఇస్తూ, శ్రామిక వర్గానికి ఎటువంటి ప్రయోజనం కల్పించకపోవడాన్ని ఫ్రెంచ్ కార్మిక సంఘాలు తీవ్రంగా విమర్శించాయి.

4. నిఘా వైఫల్యం..
శాంతిభద్రతలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది. నిఘా సంస్థలు, పోలీస్ యంత్రాంగం పరిస్థితి తీవ్రతను అంచనా వేయలేకపోయాయి. అరాచకవాదుల ప్రవేశంతో పోలీసులు సతమతమయ్యారు. ప్రభుత్వ వాహనాలు, భవనాలు, దుకాణాలు ధ్వంసం కావడం, దోపిడీలు జరుగుతున్నా అధికారులు సమర్థవంతంగా స్పందించలేకపోయారు.

5. సంక్షేమ వ్యవస్థపై ప్రభావం..
ఒక సంక్షేమ రాజ్యం ప్రధాన బలం ఆరోగ్యం, విద్య, పింఛన్లు, సామాజిక భద్రతపై ఆధారపడి ఉంటుంది. ఫ్రాన్స్ సంక్షేమ నమూనాకు పేరుగాంచిన దేశమైనప్పటికీ, ఈ కీలక రంగాలలో ప్రభుత్వం కోత విధించడం వల్ల ప్రజలు తీవ్రంగా నొచ్చుకున్నారు. ప్రభుత్వ ఒప్పందాలను ఉల్లంఘించారని భావించిన విద్యార్థులు, వామపక్ష పార్టీలు మాత్రమే కాకుండా ఆరోగ్య కార్యకర్తలు, రైతులు, పదవీ విరమణ చేసిన వారు కూడా ఈ పోరాటంలో పాల్గొంటున్నారు.

ఇమాన్యూల్ మాక్రోన్ ముందున్న సవాళ్లు..
ఈ నిరసనల వల్ల ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థకు, స్టాక్ మార్కెట్‌కు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పుడు మాక్రోన్ ప్రభుత్వం ముందు రెండు మార్గాలు ఉన్నాయి.. ఒకటి, భద్రతా దళాల ద్వారా బలప్రయోగం చేయడం- ఇది మరింత హింసకు దారితీయవచ్చు.. రెండు, కార్మిక, విద్యార్థి సంఘాలతో చర్చలు జరిపి నిర్ణయాలను పునఃపరిశీలించడం.

Read Also: ఫ్రాన్స్ పరిస్థితికి వలసలే కారణం.. పారిస్‌ ముస్లిం సిటీగా మారిపోతుంది! వెంటనే బార్డర్స్‌ మూసేయండి: ట్రంప్!
 

స్పందించిన ట్రంప్‌..
ఫ్రాన్స్‌లో మొదలైన ఈ నిరసనలు ఇటలీ, సెర్బియా, బెల్జియం వంటి దేశాలకు కూడా వ్యాపించింది. అక్కడ కొన్ని చోట్ల కర్ఫ్యూ విధించారు. ఈ పరిస్థితిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా స్పందిస్తూ, వలసల వల్ల ఇటువంటి దాడులు జరుగుతున్నాయని, సరిహద్దులను మూసివేయాలని సూచించారు. మాక్రోన్ అనుసరిస్తున్న ఓపెన్ బోర్డర్ పాలసీ వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రస్తుతం అందమైన పారిస్ నగరం రూపురేఖలు కోల్పోతోంది. చారిత్రక ప్రదేశాలు, విగ్రహాలు ధ్వంసమవుతున్నాయి. దీంతో వందల కొద్దీ దుకాణాలు దోపిడీకి గురవుతున్నాయి. నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నందున, ఈ పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుందనేది వేచి చూడాలి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
World News
Politics
Donald Trump