SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

3 రోజులు బ్యాంకులు బంద్.. మీ ఫోన్‌కు ఈ మెసేజ్ వస్తే అస్సలు నమ్మకండి, ఖాతా ఖాళీ అవుతుంది: సైబర్ పోలీసుల బిగ్ అలర్ట్

రేపటి నుంచి బ్యాంకులు వరుసగా మూడు రోజులు బంద్‌ ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఖాతాదారులకు సైబర్‌ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు సెప్టెంబర్ 27, ఆదివారం నాడు బ్యాంకులు పనిచేస్తున్నాయి. అయితే, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు, ముఖ్యంగా APK ఫైళ్లను అసలు డౌన్‌లోడ్ చేయకూడదని సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Sep 27, 2026, 08:29 AM IST | Updated: Sep 27, 2026, 08:31 AM IST
Image Credit: 3 Day Bank Strike
Join

కేంద్ర ప్రభుత్వం, బ్యాంకుల మధ్య వారానికి ఐదు పని దినాల అంశంపై జరిగిన చర్చలు విఫలం కావడంతో, రేపటి నుండి బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు సమ్మెకు దిగనున్నాయి. దీనివల్ల సెప్టెంబర్ 28 నుండి 30 వరకు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు బంద్ ఉంటాయి. బ్యాంక్ ఖాతాదారులకు ఇబ్బంది కలగకుండా ఈరోజు సెప్టెంబర్ 27, ఆదివారం బ్యాంకులు పనిచేస్తున్నప్పటికీ, రేపటి నుండి మూడు రోజుల పాటు బ్యాంకులు మూసివేత ఉంటున్నందున సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్యాంక్ సర్వీసుల పేరుతో ఫేక్ లింకులు లేదా APK ఫైళ్లను పంపే అవకాశం ఉందని, మీ వివరాలను అప్‌డేట్ చేయకపోతే డెబిట్ కార్డులు లేదా ఆన్‌లైన్ UPI పేమెంట్స్ పనిచేయవని ఒకవేళ ఎవరైనా చెబితే నమ్మవద్దని చెబుతున్నారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఆయా బ్యాంకుల టోల్ ఫ్రీ నంబర్లను లేదా 1930 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

ఇటీవల సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, APK ఫైళ్లను పొరపాటున కూడా డౌన్‌లోడ్ చేయవద్దని పోలీసులు గత కొన్ని రోజులుగా హెచ్చరిస్తున్నారు. బ్యాంకులు మూసివేతలో ఉన్న సమయంలో మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని భావిస్తూ ఖాతాదారులకు అప్రమత్తతను సూచిస్తున్నారు. సెప్టెంబర్ 28 నుండి 30 వరకు బ్యాంకుల సమ్మె నేపథ్యంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి. SBI బాటలో ఏటీఎంల ద్వారా పరిమితికి మించిన లావాదేవీలపై మూడు రోజుల పాటు చార్జీలను రద్దు చేశాయి.

ఏ బ్యాంక్ ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసుకున్నా ఇకపై చార్జీలు ఉండవు, ఇది కేవలం ఈ మూడు రోజులకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణంగా ఫ్రీ ట్రాన్సాక్షన్ పరిమితి ముగిసిన తర్వాత బ్యాంకుల వారీగా పది రూపాయల నుండి గరిష్టంగా 23 రూపాయలు ప్లస్ GST వరకు చార్జీలు ఉంటాయి. ఈ తాజా ప్రకటన కస్టమర్లకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది.

బ్యాంకులు మూసివేత నేపథ్యంలో కేంద్రం కూడా కీలక సూచన చేసింది. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఏటీఎంలలో నగదు కొరత లేకుండా చూసుకోవాలని, అత్యవసర బ్యాంకింగ్ సేవలు నిరంతరం కొనసాగేలా చూడాలని సూచిస్తూ సమావేశం నిర్వహించింది.

యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్లకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయని ప్రకటించడంతో, ఉద్యోగులు ఈ మూడు రోజులు పని చేయబోతున్నారు. వారానికి ఐదు పని దినాలు ఉండాలనే డిమాండ్‌తో పాటు ఇతర అంశాల సాధన కోసం బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఆదివారం నాడు ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులు కూడా తెరిచి ఉంచాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఈరోజు బ్యాంకులు పనిచేస్తున్నాయి, కానీ ఆ తర్వాత మూడు రోజులు బంద్ ఉంటాయి. అయితే, సమ్మె వల్ల ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు, ఆర్‌బీఐ అనుమతితో ఏటీఎంలు, బ్యాంక్ కార్యాలయాలు, కరెన్సీ చెస్టులు యథావిధిగా పనిచేస్తాయి.

వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉండాలని బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి రెండో, నాలుగో శనివారాలతో పాటు ఆదివారాలు కూడా సెలవుల్లో భాగంగా ఉన్నాయి. ఆరు రోజులు పని చేయడం వల్ల తాము తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని, కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతున్నామని వారు వాదిస్తున్నారు. ఐదు రోజులు పని దినాలుగా నిర్ణయించినా పని గంటలు తగ్గవని, పైగా ఏడాదికి 17 గంటల 20 నిమిషాల పని సమయం పెరుగుతుందని వారు పేర్కొంటున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES