SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

3 నెలల పాటు రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 1199 ప్లాన్‌తో రోజుకు 2.5GB డేటా, అమెజాన్ ప్రైమ్, 18+ OTT యాప్స్ ఉచితం!

ఎయిర్‌టెల్ తన ఫ్రెండ్లీ యాప్ ద్వారానే మొబైల్ రీఛార్జ్ ప్లాన్లను పరిచయం చేస్తుంది. అందుకే యూజర్లు ఎక్కువగా ఎయిర్‌టెల్ వైపు ఆకర్షితులవుతుంటారు. అయితే ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం మరో అద్భుతమైన ప్లాన్ను తీసుకొచ్చింది. దీని ధర కేవలం రూ.1199, ఇందులో మీరు OTT బెనిఫిట్ కూడా పొందుతారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 24, 2026, 19:13 IST | Updated: Nov 24, 2026, 19:16 IST
Image Credit: Airtel Best Prepaid Plan:
Join

Airtel Best Prepaid Plan: ఒకే రీఛార్జ్ ప్లాన్లో ఓటీటీ ఎంటర్టైన్మెంట్, కాలింగ్, ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉంటే ఎవరు కాదంటారు? ఎయిర్‌టెల్ అలాంటి అద్భుతమైన ప్లాన్‌ను పరిచయం చేసింది. అదే రూ.1199 రీఛార్జ్ ప్లాన్. ఇది బడ్జెట్లోనే ఉంది. దీని వ్యాలిడిటీ 84 రోజుల పాటు లభిస్తుంది. అంటే మూడు నెలల పాటు రీఛార్జ్ గురించి టెన్షన్ ఉండదు. ప్రతిరోజు 2.5 జీబీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా పొందుతారు. అంతేకాకుండా, ఇందులో మల్టిపుల్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ సదుపాయం కూడా ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా డబ్బులు కేటాయించాల్సిన అవసరం లేదు.

ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ ప్లాన్ కేవలం రూ.1199 కే లభిస్తుంది, దీని వ్యాలిడిటీ 84 రోజులు. ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే మూడు నెలల పాటు ఆనందించవచ్చు. ఈ ఎయిర్‌టెల్ ప్లాన్లో అపరిమిత లోకల్, ఎస్టీడీ రోమింగ్ కాల్స్‌తో పాటు ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్లో ప్రతిరోజు 2.5 జీబీ డేటా లభిస్తుంది, అంటే మొత్తం 210 జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా పొందుతారు. ఈ మూడు నెలల కాలంలో 5జీ డేటా కూడా లభిస్తుంది. ఇందులో మీకు కావలసినంతగా డేటాను ఉపయోగించుకోవచ్చు. డేటా లిమిట్ అయిపోతుందనే ఆందోళన కూడా ఉండదు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే అమెజాన్ ప్రైమ్ లైట్ కూడా లభిస్తుంది. దీని వ్యాలిడిటీ 84 రోజులు. ఇది అమెజాన్ వన్-డే ఫ్రీ షిప్పింగ్ డెలివరీ ఆప్షన్ కూడా అందిస్తోంది. అమెజాన్లో మీరు ఓటీటీ కంటెంట్ను వీక్షించవచ్చు.

ఎయిర్‌టెల్ ప్లాన్లో 18 ఓటీటీ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.1199 తో రీఛార్జ్ చేస్తే 84 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే ప్రీమియం లభిస్తుంది. ఇందులో 18 ఓటీటీ ప్లాట్ఫారమ్స్ను కూడా యాక్సెస్ చేయవచ్చు. అంటే సోనీ లివ్, ప్లే, ఆహా, చౌపాల్, సన్ నెక్స్ట్ వంటివి చూడవచ్చు. ఇందుకోసం ఎయిర్టెల్ యాప్ను డౌన్‌లోడ్ చేసుకుంటే ఈ బెనిఫిట్స్ అన్నీ పొందవచ్చు. ఎయిర్‌టెల్ ప్లాన్లో మరో ప్రత్యేకత ఉంది, అదే ఎక్స్‌ప్రెస్ ప్రీమియం ప్లాన్. ఇందులో 12 నెలల పాటు ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది. దీని ద్వారా కంటెంట్, వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుంచి సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో రియల్ టైమ్ స్పామ్ కాల్ అలర్ట్, బ్లాకింగ్, ఓటీపీ, బెస్ట్ బ్యాంకింగ్ ప్రొటెక్షన్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే అదనంగా హలో ట్యూన్స్ యాక్సెస్ కూడా పొందుతారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES