• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /Vaibhav Sooryavanshi: కోచ్ చెప్పిన ఆ ఒక్క మాటే.. పిచ్ చూసి ప్లాన్ మార్చిన వైభవ్.. డబుల్ సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే..!

Vaibhav Sooryavanshi: కోచ్ చెప్పిన ఆ ఒక్క మాటే.. పిచ్ చూసి ప్లాన్ మార్చిన వైభవ్.. డబుల్ సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే..!

Vaibhav Sooryavanshi on Double Century: డబుల్ సెంచరీ హీరో వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర ఇన్నింగ్స్ వెనుక రహస్యాన్ని చెప్పాడు. పిచ్ చూసి తన ప్లాన్ మార్చుకున్నానని.. పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో దూకుడుగా ఆడానని తెలిపాడు.

Written ByAshok Krindinti
Published: Nov 24, 2026, 19:02 IST|Updated: Nov 24, 2026, 19:04 IST
joinshare
Vaibhav Sooryavanshi: కోచ్ చెప్పిన ఆ ఒక్క మాటే.. పిచ్ చూసి ప్లాన్ మార్చిన వైభవ్.. డబుల్ సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే..!
Image Credit: Vaibhav Sooryavanshi News (Source: BCCI/X)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
రూ.15 లక్షల బీమా, 50 శాతం డీఏ బేసిక్ పేలో విలీనం.. 8వ వేతన సంఘం కీలక డిమాండ్స్ ఇవే..!

రూ.15 లక్షల బీమా, 50 శాతం డీఏ బేసిక్ పేలో విలీనం.. 8వ వేతన సంఘం కీలక డిమాండ్స్ ఇవే..!

2

3 నెలల పాటు రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 1199 ప్లాన్‌తో రోజుకు 2.5GB డేటా, అమెజాన్ ప్రైమ్, 18+ OTT యాప్స్ ఉచితం!

3

Vaibhav Sooryavanshi: కోచ్ చెప్పిన ఆ ఒక్క మాటే.. పిచ్ చూసి ప్లాన్ మార్చిన వైభవ్.. డబుల్ సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే..!

4

Karnataka: కర్ణాటకలో షాకింగ్.. రన్నింగ్ బస్సు నుంచి రోడ్డుపై జారీ పడ్డ మహిళ.. వీడియో వైరల్..

5

మీ ఓటర్ ఐడీ కార్డు పోయిందా? ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లో నుంచే కేవలం 2 నిమిషాల్లో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vaibhav Sooryavanshi on Double Century: వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో యూఏఈ బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. దొరికిన బంతిని బౌండరీకి తరుముదాం.. దొరకని బంతిని వేటాడి చితక్కొడదాం.. అనే రీతిలో వైభవ్ ఇన్నింగ్స్ సాగింది. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 28 బంతుల్లో సెంచరీ.. 52 బంతుల్లో డబుల్ సెంచరీ మార్క్.. ప్రత్యర్థి బౌలర్‌కు ఎక్కడ బంతి వేయాలో కూడా దిక్కుతోచని రీతిలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఏకంగా 28 సిక్సర్లు, 7 ఫోర్లు బాదాడు. వైభవ్ మొత్తం 204 పరుగులు చేస్తే.. ఇందులో బౌండరీల ద్వారానే 196 పరుగులు చేయడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత్ ఏ జట్టు 250 పరుగుల టార్గెట్‌ను 14.2 ఓవర్లలోనే ఛేదించి అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన తరువాత వైభవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

"గత రెండు మ్యాచ్‌ల్లో మంచి ఆరంభాలు లభించినా.. వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాను. అందుకే ఈ మ్యాచ్‌లో మొదట కాస్త నెమ్మదిగా ఆడాలని అనుకున్నా. కానీ ఒకటి, రెండు బంతులు ఎదుర్కొన్న తర్వాత పిచ్ బౌలర్లకు పెద్దగా సహకరించడం లేదని అర్థమైంది. బంతి బ్యాట్‌పైకి బాగా వస్తుండటంతో నా బలాన్ని నమ్ముకుని ఆడాను. నిజానికి నా మనసులో ఎలాంటి రికార్డుల ఆలోచన లేదు. పిచ్ సహకరించకపోతే ఓపికగా ఆడి ఎక్కువసేపు క్రీజ్‌లో ఉండాలనే ప్లాన్‌తో ఉన్నా. కానీ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో నా ఆటను నా శైలిలో కొనసాగించాను.

బ్యాటింగ్ చేసేటప్పుడు నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కొంత టెన్షన్ పడటం సహజమే. అయితే రెండు, నాలుగు బంతులు ఆడిన తర్వాత కుదురుకుంటాను. అండర్-19 రోజుల నుంచి మా కోచ్ హృషి సర్ ఒకటే చెబుతున్నారు. బంతిని సరిగ్గా గమనిస్తే ఆట చాలా సులభమవుతుందని సూచిస్తుంటారు. జట్టులోని సీనియర్లు కూడా నాకు ఎంతో సహకరిస్తారు. వారి సలహాలను తీసుకుంటాను. ఈ ఇన్నింగ్స్‌తో మళ్లీ నా ఆటలో పాత లయను అందుకున్నాను. మిగిలిన మ్యాచ్‌ల్లోనూ ఇదే జోరు కొనసాగించి సెమీఫైనల్‌లో గెలిచి ఫైనల్‌కు చేరుకోవాలని ఉంది." అని అన్నాడు.
  
బీహార్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం మంచి అనుభవమని వైభవ్ చెప్పుకొచ్చాడు. జట్టు కూడా బాగానే ఆడుతోందని.. ఇదే ప్రదర్శనను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఇండియా ఎ జట్టులోని సీనియర్ ఆటగాళ్లతో తనకు చాలా కాలంగా పరిచయం ఉందన్నాడు. వారందరితో చాలా సౌకర్యంగా ఉంటానని.. తనకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే వారు స్వేచ్ఛగా చెబుతారని వివరించాడు. అందరి అభిప్రాయాలను తాను వింటానని అన్నాడు. యూఏఈపై ఆడటం తనకు బాగుంటుందని చెప్పిన వైభవ్.. ఈ ఇన్నింగ్స్‌తో తన ఆటలో మళ్లీ పాత లయను అందుకున్నానని తెలిపాడు.  

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket