• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /రూ.15 లక్షల బీమా, 50 శాతం డీఏ బేసిక్ పేలో విలీనం.. 8వ వేతన సంఘం కీలక డిమాండ్స్ ఇవే..!

రూ.15 లక్షల బీమా, 50 శాతం డీఏ బేసిక్ పేలో విలీనం.. 8వ వేతన సంఘం కీలక డిమాండ్స్ ఇవే..!

8th Pay Commission Updates: 8వ వేతన సంఘం సిఫార్సులపై చర్చలు కొనసాగుతున్న తరుణంలో రక్షణ శాఖలోని సివిలియన్ ఉద్యోగుల నుంచి కీలక ప్రతిపాదనలు వచ్చాయి. ప్రస్తుతం రూ.30 వేలుగా ఉన్న గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజీని ఏకంగా రూ.15 లక్షలకు పెంచాలని ఉద్యోగ సంఘం కోరుతోంది.

Written ByAshok Krindinti
Published: Nov 24, 2026, 19:18 IST|Updated: Nov 24, 2026, 19:21 IST
joinshare
రూ.15 లక్షల బీమా, 50 శాతం డీఏ బేసిక్ పేలో విలీనం.. 8వ వేతన సంఘం కీలక డిమాండ్స్ ఇవే..!
Image Credit: 8th Pay Commission Latest News (Source: File)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
రూ.15 లక్షల బీమా, 50 శాతం డీఏ బేసిక్ పేలో విలీనం.. 8వ వేతన సంఘం కీలక డిమాండ్స్ ఇవే..!

రూ.15 లక్షల బీమా, 50 శాతం డీఏ బేసిక్ పేలో విలీనం.. 8వ వేతన సంఘం కీలక డిమాండ్స్ ఇవే..!

2

3 నెలల పాటు రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 1199 ప్లాన్‌తో రోజుకు 2.5GB డేటా, అమెజాన్ ప్రైమ్, 18+ OTT యాప్స్ ఉచితం!

3

Vaibhav Sooryavanshi: కోచ్ చెప్పిన ఆ ఒక్క మాటే.. పిచ్ చూసి ప్లాన్ మార్చిన వైభవ్.. డబుల్ సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే..!

4

Karnataka: కర్ణాటకలో షాకింగ్.. రన్నింగ్ బస్సు నుంచి రోడ్డుపై జారీ పడ్డ మహిళ.. వీడియో వైరల్..

5

మీ ఓటర్ ఐడీ కార్డు పోయిందా? ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లో నుంచే కేవలం 2 నిమిషాల్లో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

8th Pay Commission Updates: 8వ వేతన సంఘం సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో భారీ ఆసక్తి నెలకొంది. కొత్త పే కమిషన్ సిఫార్సుల కోసం ఎదురుచూస్తుండగా.. మరోవైపు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను కమిషన్ ముందు పెడుతున్నాయి. ఈ క్రమంలో రక్షణ శాఖ పరిధిలో పనిచేసే సివిలియన్ ఉద్యోగుల తరఫున భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్ (BPMS) 73 ప్రతిపాదనలను 8వ వేతన సంఘానికి సమర్పించింది. వీటిలో ఉద్యోగుల బీమా మొత్తాన్ని భారీగా పెంచాలన్న డిమాండ్ ఇప్పుడు ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ (CGEGIS) కింద లభిస్తున్న బీమా కవరేజీ చాలా తక్కువగా ఉందని.. ఈ మొత్తాన్ని ప్రస్తుతమున్న రూ.30 వేల నుంచి కనీసం రూ.15 లక్షలకు పెంచాలని కోరింది. ఉద్యోగికి అనుకోని పరిస్థితి ఎదురైతే అతడి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే బీమా రక్షణ పెరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేసింది.

అంతేకాదు.. ఉద్యోగి మరణించిన సందర్భంలో అతడి కుటుంబానికి అందించే డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (DLI) ప్రయోజనాన్ని కూడా రూ.10 లక్షలకు పెంచాలని సంఘం కోరింది. తద్వారా ఉద్యోగుల కుటుంబాలకు మరింత మెరుగైన ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొంది. బీమాతో పాటు ఉద్యోగుల వేతనాల విషయంలోనూ సంఘం పలు ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 3 శాతం వార్షిక ఇంక్రిమెంట్‌ను 6 శాతానికి పెంచాలని కోరింది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు అవసరమని అభిప్రాయపడింది.

అదేవిధంగా ప్రస్తుతం లభిస్తున్న డీఏలో 50 శాతాన్ని బేసిక్ పేలో విలీనం చేయాలని ప్రతిపాదన పంపించింది. దీంతో కొత్త వేతన నిర్మాణంలో ఉద్యోగులకు మెరుగైన ప్రయోజనాలు లభిస్తాయని సంఘం భావిస్తోంది. ఉద్యోగుల కనీస వేతనాన్ని నిర్ణయించేటప్పుడు కుటుంబ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ (ILC) నిబంధనలు, ఎక్రాయిడ్ ఫార్ములా ఆధారంగా కనీస వేతనాన్ని ఖరారు చేయాలని కోరింది.

ఆహారం, దుస్తులు, నివాసం, కుటుంబ నిర్వహణకు అయ్యే వాస్తవ ఖర్చులను లెక్కలోకి తీసుకోవాలని తెలిపింది. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అయితే ఇవన్నీ ఉద్యోగ సంఘం 8వ వేతన సంఘం ముందు ఉంచిన ప్రతిపాదనలు మాత్రమే. వీటికి కమిషన్ ఇంకా ఆమోదం తెలిపినట్లు కాదు. కమిషన్ సిఫార్సులు, తదుపరి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల ఆధారంగానే ఉద్యోగుల వేతనాలు, భత్యాలు, బీమా ప్రయోజనాలపై క్లారిటీ రానుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Pay Commission
Employees