రూ. 200 లకే అదిరిపోయే ఆఫర్.. 30GB డేటాతో పాటు ఉచిత యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్!
ఎయిర్‌టెల్ మరో బంపర్ ప్లాన్ మీ ముందుకు తీసుకువచ్చాం.. మీరు కూడా ఎయిర్‌టెల్ యూజర్స్ అయితే ఈ ప్లాన్‌పై ఓ లుక్కేయండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో కేవలం రూ.200 ప్రీపెయిడ్ రీఛార్జీ ప్లాన్ 28 రోజులపాటు వ్యాలిడిటీ కూడా లభిస్తుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Airtel Rs 200 Plan: మొబైల్ రీఛార్జీ ప్లాన్ చేసుకుంటున్నారా? ఎయిర్‌టెల్ వినియోగదారులు అయితే, ఈ ప్లాన్ గురించి మీరు పక్కా తెలుసుకోవాల్సిందే.కొంతమంది కేవలం మొబైల్ రీఛార్జీ చేయడం మాత్రమే కాదు.. ఓటీటీ, మూవీస్, మ్యూజిక్, స్పోర్ట్స్ కూడా వీక్షిస్తారు. వారికి ఎయిర్‌టెల్ రూ.200 ప్లాన్ బెస్ట్. తక్కువ ధరలోనే ఉంది. ఇందులో మీకు 30 జీబీ డేటా లభిస్తుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులపాటు వర్తిస్తుంది.
ఈ ఎయిర్‌టెల్ రూ.200 జీబీ డేటా ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులపాటు లభిస్తుంది. ఇందులో మీరు 30 జీబీ ఇంటర్నెట్ వాడుకోవచ్చు. అయితే, మీ పూర్తి వ్యాలిడిటీ సమయంలో ఈ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మీరు రోజు ఒక్క జీబీ లేదా 2 జీబీ మాత్రమే వాడాలనే నిబంధన ఏదీ లేదు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, గూగుల్ సెర్చ్, ఆన్‌లైన్ బ్రౌజింగ్ చేయవచ్చు. వీడియో యూజర్స్, ఆన్‌లైన్ గేమింగ్ వారు కూడా జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇందులో హై క్వాలిటీతో వీడియో ఫాస్ట్ ఇంటర్నెట్‌తో పొందుతారు.
యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో..
ఈ రూ.200 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే మీరు పొందే మరో మేజర్ బెనిఫిట్ యూట్యూబ్ ప్రీమియం. ఇందులో వినియోగదారులు యాడ్స్ లేని వీడియో కంటెంట్ పొందుతారు. బ్యాక్‌గ్రౌండ్ ప్లే ఆప్షన్ కూడా లభిస్తుంది. ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్స్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే మీరు ఇతర యాప్స్ వాడుతూనే యూట్యూబ్ ఆడియ కూడా వినవచ్చు.
ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌లో మీరు ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ కూడా లభిస్తుంది. ఇందులో మీకు ఇష్టమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు మొబైల్‌లో చూడవచ్చు. ఈ ఎడిషన్‌లో మీరు కేవలం ఎస్‌డీ క్వాలిటీ స్ట్రీమింగ్ మాత్రమే పొందుతారు అని గుర్తుంచకోండి, కేవలం ఒక్క డివైజ్‌లో మాత్రమే పొందుతారు.
జియో హాట్‌స్టార్, జీ5 ప్రీమియం..
ఎయిర్‌టెల్ రూ.200 ప్లాన్‌లో 28 రోజుల ప్లాన్ వ్యాలిడిటీ కూడా లభిస్తుంది. దీంతోపాటు జియో హాట్‌స్టార్ మొబైల్‌లో చూడవచ్చు. ఇందులో లైవ్ స్పోర్ట్స్, సినిమాలు, వెబ్‌సిరీస్, హాట్‌స్టార్ స్పెషల్స్ వీక్షించవచ్చు.
Read Also: నలుగురికి ఒకే రీఛార్జ్.. ఉచిత 5G డేటా, నెట్‌ఫ్లిక్స్‌తో ఎయిర్‌టెల్ ఫ్యామిలీ ప్లాన్ ధమాకా!
ఎయిర్‌టెల ఎక్స్‌ట్రీమ్ ప్లే..
ఈ ప్లాన్‌తో మీరు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే పొందుతారు. మొత్తం ఈ ప్లాన్‌లో 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ యాక్సెస్ లభిస్తుంది. ఇవి కూడా 28 రోజులపాటు ఉంటుంది. సోనీ లైవ్, లయన్స్‌గేట్ ప్లే, ఆహా, చౌపల్, సన్ నెక్ట్స్ లభిస్తుంది. ఈ ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లేలోని ఓటీటీ కంటెంట్ యాక్సెస్ పొందుతార
యాపిల్ మ్యూజిక్..
ఎయిర్‌టెల్ ఈ రూ.200 ప్లాన్‌తో అదనంగా యాపిల్ మ్యూజిక్ కూడా పొందుతారు. ఇందులో మీరు 100 మిలియన్ పైగా యాడ్స్ లేకుండా సాంగ్స్ వినవచ్చు. లైఫ్‌టైమ్ ఫ్రీ క్లెయిమ్‌గా ఒక్కసారి ఈ యాక్సెస్ పొందుతారు.