• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /కేవలం రూ.598కే ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. నెట్‌ఫ్లిక్స్, జీ5తో పాటు రూ.4 వేల విలువైన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ఉచితం!

కేవలం రూ.598కే ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. నెట్‌ఫ్లిక్స్, జీ5తో పాటు రూ.4 వేల విలువైన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ఉచితం!

ప్రైవేట్ దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్ ఎన్నో ప్రయోజనాలు ఉండే యూజర్లకు మంచి ఫలితాలనిచ్చే ప్లాన్లను అందిస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యంతో పాటు డేటా, ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. అలాంటి ఎయిర్‌టెల్ అందిస్తున్న రూ.598 రీఛార్జ్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 16, 2026, 11:45 IST|Updated: Nov 16, 2026, 11:51 IST
joinshare
కేవలం రూ.598కే ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. నెట్‌ఫ్లిక్స్, జీ5తో పాటు రూ.4 వేల విలువైన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ఉచితం!
Image Credit: Airtel OTT Plan:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Airtel OTT Plan: యూజర్లకు డేటా లేదా ఓటీటీ కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ చేసుకోవాలంటే పెద్ద తలనొప్పిగా ఉంటుంది. అయితే ప్రైవేట్ దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్ ఒక బంపర్ ప్లాన్ తీసుకువచ్చింది. దీని ధర కేవలం రూ.598 మాత్రమే. ఇందులో మీరు ప్రతి రోజు 2GB డేటా పొందుతారు. 28 రోజుల పాటు వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో ఓటీటీ కోసం ప్రత్యేకంగా సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితంగా పొందుతారు. ఎయిర్‌టెల్ రూ.598 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజుల పాటు లభిస్తుంది. ఇందులో మీరు ప్రతి రోజు 2GB డేటా పొందుతారు, అంటే మొత్తం పరిమితి ముగిసే సమయానికి 56GB డేటా లభిస్తుంది. ఈ డేటాను మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు.

దీంతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్‌టీడీ రోమింగ్ కాల్స్ కూడా పొందుతారు. లోకల్, ఎస్టీడీ రోమింగ్ కూడా ఉచితం. దీనికి ప్రత్యేకంగా మీరు ఎలాంటి సర్వీసుల కోసం రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి రోజు 100 ఎస్ఎంఎస్‌లు కూడా అదనంగా ఉచితంగా పొందుతారు.

నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్..
ఎయిర్‌టెల్ యూజర్లు ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే ప్రత్యేకంగా ఓటీటీ కోసం రీఛార్జ్ చేసుకునే అవసరమే ఉండదు. ఈ రూ.598 రీఛార్జ్ ప్లాన్‌తో సబ్స్క్రైబర్లకు ప్రత్యేకంగా నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. దీంతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా వీక్షించవచ్చు. కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్‌గా జియోహాట్‌స్టార్ సూపర్ కూడా ఉచితంగా పొందుతారు. 28 రోజుల వ్యాలిడిటీతో జీ5 ప్రీమియం కూడా అందుబాటులో ఉందని ఎయిర్‌టెల్ ఈ విషయాన్ని అధికారికంగా షేర్ చేసుకుంది.

అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం..
ఎయిర్‌టెల్ అందిస్తున్న రూ.598 ప్లాన్‌తో అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం కూడా పొందుతారు. దీని విలువ రూ.4000. ఇందులో క్రియేటివ్ వర్క్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. 12 నెలల పాటు ఉచితంగా పొందుతారు. ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులే అయినప్పటికీ, ఈ కాంప్లిమెంటరీ సర్వీస్ 12 నెలల పాటు ఉచితంగా లభిస్తుంది. దీంతో మీరు సోషల్ మీడియా పోస్టులు, బ్యానర్లు, పోస్టర్లు, ఇతర డిజైన్లను కూడా సులభంగా సిద్ధం చేసుకోవచ్చు.

ఎయిర్‌టెల్ అపరిమిత 5G సేవలు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు ఎయిర్టెల్ థ్యాంక్స్ ద్వారా కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. 5G స్మార్ట్‌ఫోన్ ఉన్నవారికి, వారి ప్రాంతంలో 5G అందుబాటులో ఉంటే ఆ సేవలను పొందవచ్చు. అంటే 2GB డేటాను 5G హై స్పీడ్‌లో ఇంటర్నెట్ సదుపాయం లభిస్తుంది. దీంతో పాటు ఎయిర్‌టెల్ సేఫ్ కూడా ఉచితంగా లభిస్తుంది. ఇందులో రియల్ టైమ్ కాల్స్, మోసపూరిత లింక్‌ల నుంచి అలర్ట్‌లు కూడా అందుతాయి. ఓటీపీ అలర్ట్‌లు కూడా పొందుతారు. హలో ట్యూన్స్ కూడా ఉచితంగా పొందవచ్చు. ఇవి కూడా 30 రోజుల పాటు వ్యాలిడిటీతో లభిస్తాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
Recharge Plans
National News
Business News
Telugu News