SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అంబానీ VS మస్క్.. 1600 శాటిలైట్లతో జియో దెబ్బ! ఎలాన్ మస్క్‌కు కేంద్రం గట్టి కౌంటర్!

ప్రపంచ అత్యంత సంపన్న వ్యక్తి, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ భారత ప్రభుత్వంపై నిన్న సంచలన ఆరోపణలు చేశారు. శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా భారతదేశంలోని సదుపాయం లేని ప్రాంతాలకు సేవలు అందించడం గురించి ఆయన మాట్లాడారు. అయితే, భారత దేశంలోని సంపన్న వర్గాల కారణంగా కంపెనీ నియంత్రణ పరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. అసలు స్టార్‌లింక్‌కు వస్తున్న చిక్కులు ఏమిటో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Oct 09, 2026, 09:00 AM IST | Updated: Oct 09, 2026, 09:19 AM IST
Image Credit: central Counters Elon Musks Allegations:
Join

central Counters Elon Musks Allegations: స్టార్‌లింక్ అధినేత ఎలాన్ మస్క్ భారత్ పై సంచలన పోస్ట్ చేశారు. భారత్‌లో స్టార్‌లింక్ అవసరం ఉందని ఒక నెటిజన్ ప్రశ్నించగా, దానికి మస్క్ స్పందిస్తూ.. దురదృష్టవశాత్తు భారత ప్రజలపై ఏకఛత్రాధిపత్యం కొనసాగించేందుకు కొంతమంది కుబేరులు మమ్మల్ని అడ్డుకుంటున్నారని ట్వీట్ చేశారు. అంతేకాకుండా, వారెవరో మీరే ఊహించండి అంటూ కూడా పేర్కొన్నాడు. ఇది భారత ప్రజల పట్ల జరుగుతున్న నేరమని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, భారత్‌లోని కొందరు తమను అడ్డుకుంటారన్న మస్క్ మాటలను కొట్టిపారేసింది. అన్ని టెలికాం సర్వీసుల కోసం నిష్పక్షపాత వ్యవస్థను ఏర్పాటు చేశామని, మూడు సంస్థలకు లైసెన్స్ ఇచ్చామని, ప్రస్తుతం స్పెక్ట్రమ్ కేటాయింపు, సెక్యూరిటీ అసెస్మెంట్ ప్రక్రియ జరుగుతోందని తెలిపింది. గతంలోనే స్టార్‌లింక్, జియో, వన్ వెబ్ వంటి సంస్థలకు లైసెన్సులు ఇచ్చిన నేపథ్యంలో మస్క్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్టార్‌లింక్‌తో అసలు చిక్కు ఏంటి?
మస్క్ చేసిన ఆరోపణలు భారత్‌లోకి స్టార్‌లింక్ ఎంట్రీ అంశాన్ని చర్చలోకి తెచ్చాయి. ప్రధానంగా రిమోట్ ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంచే శాటిలైట్ సేవలతో సెక్యూరిటీ రిస్క్ ఉండే అవకాశం ఉంది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, మయన్మార్ సరిహద్దులు ఉన్నాయి. ఉక్రెయిన్, మయన్మార్ వంటి ప్రాంతాల్లో స్టార్‌లింక్‌ శాటిలైట్‌ దుర్వినియోగం అయ్యాయని రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందు కేంద్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించడం ముఖ్యం.

ఉపగ్రహ నెట్‌వర్క్ భద్రత, చట్టబద్ధమైన అంతరాయం, డేటా నియంత్రణ, అత్యవసర పరిస్థితుల్లో సేవపై ప్రభుత్వ నియంత్రణ వంటి అంశాలే ప్రధాన ఆందోళనలు. స్టార్‌లింక్ ఉపగ్రహాల మధ్య ఉండే లేజర్ లింకులు భారతీయ గేట్‌వేలను దాటి వెళ్లే అవకాశం ఉంది. మణిపూర్ ఇంటర్నెట్ నిషేధ సమయంలో కూడా స్టార్‌లింక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలు వచ్చాయి. అలాగే ఇరాన్ సంఘర్షణలో అనధికారిక టెర్మినల్స్ వాడినట్లు ఆందోళనలు ఉన్నాయి. ప్రస్తుతం ముగ్గురు లైసెన్సీదారుల భద్రతపై మదింపులు జరుగుతున్నాయి. మస్క్ చైనాలో వేగంగా పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి చేయగా, భారతదేశంలో మాత్రం ఆరోపణలే ఎక్కువగా ఉన్నాయి తప్ప పెట్టుబడులు, భద్రతా పరిష్కారాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

1600 శాటిలైట్ల లాంచ్ - జియో మాస్టర్ ప్లాన్..
ప్రపంచవ్యాప్తంగా ఈ వివాదం 'మస్క్ వర్సెస్ అంబానీ'గా మారింది. స్టార్‌లింక్ వివాదం మధ్య, అదే తరహాలో శాటిలైట్ కనెక్టివిటీ కోసం కృషి చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్‌లో ఈ కీలక ప్రకటన నిన్న చేస్తూ.. నెట్‌వర్క్ ఏర్పాటులో సవాళ్లు ఎదురైనప్పటికీ, దేశవ్యాప్తంగా 23 గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం 1600 శాటిలైట్లను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. దీనివల్ల ఆరు లక్షల గ్రామాలకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తోంది.

దీనిని జియో 'సార్వభౌమ ఉపగ్రహ నెట్‌వర్క్' అని పిలుస్తోంది. ఎల్ఈఓ (LEO) ఉపగ్రహాలు భూమి చుట్టూ తక్కువ కక్ష్యలో తిరుగుతాయి. ఈ ఇంజినీరింగ్ ప్రక్రియ, విస్తరణ, నిర్వహణ మొత్తం ఒక గొలుసులాగా భారత దేశం నియంత్రణలోనే ఉండాలనేదే కంపెనీ లక్ష్యం. ఈ ఉపగ్రహ నెట్‌వర్క్ భారత భూభాగంతో అనుసంధానిస్తారు. ప్రతిపాదిత 23 భూ కేంద్రాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుత టెర్రెస్ట్రియల్ నెట్‌వర్క్‌ను అనుసంధానించడానికి కూడా జియో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Read Also: చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డ్ ఏమవుతుంది? UIDAI ట్విట్టర్‌ వేదికగా కీలక ప్రకటన.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే!
 

దీని ద్వారా మారుమూల గ్రామాలు, ద్వీపకల్ప ప్రాంతాలు, సరిహద్దు అవుట్‌పోస్ట్‌లపై ప్రధానంగా దృష్టి సారించింది. విమానయానం, సముద్రయానం, రక్షణ, ప్రభుత్వ సేవలు, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దీని వినియోగాన్ని హైలైట్ చేసింది. అంతేకాకుండా, గ్రామీణ ప్రాంతాలలో 'డైరెక్ట్ టు డివైస్' కాలింగ్ సౌకర్యం గురించి కూడా ప్రస్తావించింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES