• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డ్ ఏమవుతుంది? UIDAI ట్విట్టర్‌ వేదికగా కీలక ప్రకటన.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే!

చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డ్ ఏమవుతుంది? UIDAI ట్విట్టర్‌ వేదికగా కీలక ప్రకటన.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే!

ఆధార్ కార్డు ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉండటమే కాకుండా, అప్‌డేటెడ్‌గా ఉండటం కూడా చాలా అవసరం. అయితే, మరణించిన వ్యక్తుల ఆధార్ కార్డుల పరిస్థితి ఏమిటి? అవి ఏమవుతాయి? ఏదైనా మోసపూరిత వ్యవహారం జరగకముందే ఈ ముఖ్యమైన విషయం తెలుసుకోవాలని ట్విట్టర్ వేదికగా యూఐడీఏఐ సూచించింది. ఆ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Oct 08, 2026, 08:30 PM IST|Updated: Oct 08, 2026, 08:34 PM IST
joinshare
చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డ్ ఏమవుతుంది? UIDAI ట్విట్టర్‌ వేదికగా కీలక ప్రకటన.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే!
Image Credit: Aadhaar Card New Update: Image credits X

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Trigrahi Yog 2026:  అక్టోబర్ 17 నుంచి ఈ 3 రాశులకు అదృష్టం.. డబ్బు, ఉద్యోగం విషయంలో శుభవార్తలు!

Trigrahi Yog 2026: అక్టోబర్ 17 నుంచి ఈ 3 రాశులకు అదృష్టం.. డబ్బు, ఉద్యోగం విషయంలో శుభవార్తలు!

2

Varanasi New Language: మహేష్ బాబు వారణాసిలో గంటసేపు ఆ భాషేనా.. ప్రేక్షకులకు అర్థమవుతుందా?

3

Revanth Reddy: ప్రధానమంత్రి పదవి నుంచి మోదీ దిగిపోవాలి: రేవంత్‌ రెడ్డి డిమాండ్‌

4

చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డ్ ఏమవుతుంది? UIDAI ట్విట్టర్‌ వేదికగా కీలక ప్రకటన.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే!

5

Vijay Deverakonda: నన్ను తొక్కేయడం కోసం 1000 అకౌంట్లు.. విజయ్ దేవరకొండ బయటపెట్టిన భయంకర నిజం..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Aadhaar Card New Update: మన దేశంలో ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డు. ప్రతి ఒక్కరికీ దీనిని జారీ చేస్తారు. ఆధార్ కార్డుపై ఉండే ఫోన్ నంబర్, అడ్రస్, బ్యాంకు వివరాలను కచ్చితంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలి. మరి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి ఆధార్ కార్డు ఏమవుతుంది? అది ఆటోమేటిక్‌గా క్యాన్సల్ అవుతుందా? అసలు ఏం జరుగుతుంది? కుటుంబ సభ్యులు తెలుసుకోవాల్సిన విషయాలేమిటి? అనే అంశాలపై UIDAI ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డుదారుడు మరణించినప్పుడు, ఆ కార్డు మోసపూరిత వ్యక్తుల చేతికి చిక్కకుండా కుటుంబ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి UIDAI వివరించింది.

ఆధార్ కార్డుదారుడు చనిపోతే ఏం చేయాలో UIDAI ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. UIDAI కొత్తగా ఒక ఫెసిలిటీని తీసుకువచ్చింది. దీని ప్రకారం 'రిపోర్ట్ డెత్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెంబర్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సర్వీస్ మై ఆధార్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. దీని ప్రధాన లక్ష్యం ఏమిటంటే, ఆధార్ కార్డును దుర్వినియోగం చేయకుండా, KYC సంబంధిత మోసాలు జరగకుండా చూడటం. కుటుంబ సభ్యులు చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్‌ను అటాచ్ చేసి, వెంటనే రిక్వెస్ట్ ద్వారా వారి ఆధార్ కార్డును డియాక్టివేట్ చేయవచ్చు.

సాధారణంగా ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు, పాన్ కార్డు, LPG కనెక్షన్, పెన్షన్ వంటి వాటికి లింక్ అయి ఉంటాయి. కాబట్టి, వ్యక్తి మరణించిన వెంటనే ఆధార్‌ను డియాక్టివేట్ చేయించాలి. మోసపూరిత వ్యక్తుల చేతికి చిక్కకముందే ఈ కీలక నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. కుటుంబ సభ్యులు దీనిని డియాక్టివేట్ చేయడం ద్వారా ఆర్థికంగా మోసపోకుండా జాగ్రత్త పడవచ్చు.

 

Every request is handled with due diligence. Once the request is successfully verified, UIDAI initiates the process to deactivate the deceased person's Aadhaar. #myAadhaarPortal #ReportDeath #UIDAI #Aadhaar #ProtectIdentity https://t.co/SzWIpnjWDi

— Aadhaar (@UIDAI) October 8, 2026

 

UIDAI ఆన్‌లైన్ ప్రక్రియ..
చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డును డియాక్టివేట్ చేయాలంటే, మొదటగా 'మై ఆధార్' పోర్టల్‌లో వివరాలతో లాగిన్ అవ్వాలి. 
ఆధార్ నంబర్‌కు వచ్చే OTPని ఉపయోగించి, సర్వీసెస్ విభాగంలోకి వెళ్లి 'రిపోర్ట్ డెత్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెంబర్' పై క్లిక్ చేయాలి. 
అక్కడ మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్, పేరు, పుట్టిన తేదీ ఇతర వివరాలతో పాటు డెత్ సర్టిఫికేట్ నంబర్‌ను కూడా నమోదు చేయాలి. 
ఆ తర్వాత బయోమెట్రిక్ లేదా OTP ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆధార్ డేటా ఇప్పటికే డెత్ సర్టిఫికేట్‌తో లింక్ అయి ఉండటం వల్ల ఈ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. 
సంబంధిత డాక్యుమెంట్లు సబ్మిట్ చేసిన 90 రోజుల్లో ఈ ప్రక్రియ ముగుస్తుంది. అనంతరం మై ఆధార్ పోర్టల్ ద్వారా డియాక్టివేషన్ స్టేటస్‌ను కూడా చెక్ చేసుకోవచ్చు. 
మీ ఆధార్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి రికార్డులు అప్‌డేట్ అయ్యాయో లేదో కూడా తెలుసుకోవచ్చు.

Read Also: EPFO అత్యవసర సెక్యూరిటీ అలర్ట్! ఈ 4 వివరాలు ఎవరికీ చెప్పకండి.. ఖాతా ఖాళీ అవుతుంది!
 

Add Zee News as a Preferred Source
TAGS:
Aadhaar Card