• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /గన్‌పౌడర్ లేని రోజుల్లోనే బాణాసంచా కాల్చారా? మన పూర్వీకులు పాటించిన పద్ధతులివే!

గన్‌పౌడర్ లేని రోజుల్లోనే బాణాసంచా కాల్చారా? మన పూర్వీకులు పాటించిన పద్ధతులివే!

Ancient Indian Fireworks: కొన్ని వందల ఏళ్ల క్రితం ప్రాచీన కాలంలో చిచ్చుబుడ్లు, భూచక్రాలు అస్సలు లేకపోయేవి.. అయినప్పటికీ మన పూర్వీకులు బాణాసంచాలను కాల్చుతూ ఉండేవారు.. అసలు వారు ఇంట్లోనే ఎలా వాటిని తయారు చేసుకునేవారో? భారతీయ గ్రంథాల్లో వివరించిన మండే పదార్థాలేంటో? వీటినికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 07, 2026, 09:50 AM IST|Updated: Nov 07, 2026, 09:51 AM IST
joinshare
గన్‌పౌడర్ లేని రోజుల్లోనే బాణాసంచా కాల్చారా? మన పూర్వీకులు పాటించిన పద్ధతులివే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
దీపావళి రోజు జూదం ఎందుకు ఆడతారో తెలుసా? పార్వతీ పరమేశ్వరుల పాచికల ఆట వెనుక అసలు కథ ఇదే!

దీపావళి రోజు జూదం ఎందుకు ఆడతారో తెలుసా? పార్వతీ పరమేశ్వరుల పాచికల ఆట వెనుక అసలు కథ ఇదే!

2

AP MPTC ZPTC Results: ఏపీలో కౌంటింగ్ వేళ హైటెన్షన్.. పలుచోట్ల వాహనాల దగ్దం.. ఇరువర్గాలపై పోలీసుల లాఠీ చార్జ్..

3

తమిళ సీఎం విజయ్ దీపావళి ధమాకా.. రూ. 100కే 10 రకాల కూరగాయలు..!

4

గన్‌పౌడర్ లేని రోజుల్లోనే బాణాసంచా కాల్చారా? మన పూర్వీకులు పాటించిన పద్ధతులివే!

5

Surekha Vani Video: 49 ఏళ్ల వయసులో రెచ్చిపోయిన సురేఖ వాణి.. టీనేజ్ కుర్రాడితో రొమాన్స్.?. వీడియో వైరల్...

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ancient Indian Fireworks: దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. మనకు ముందుగా గుర్తొచ్చేవి రంగురంగుల చిచ్చుబుడ్లు, కాకరపువ్వులు.. నేలపై అద్భుతంగా గిర్రున తిరిగే భూచక్రాలు, చెవులు దిమ్మెక్కించే లక్ష్మీ బాంబులు.. అయితే, ప్రస్తుతం ఇప్పుడు ఈ బాంబుల్లో వినియోగించే రసాయన మందుగుండు అందుబాటులోకి రాని ప్రాచీన కాలంలో మన పూర్వీకులు దీపావళి వేడుకల్లో వేటిని వినియోగించేవారో అనేది ఇప్పుడు అందరికీ కలిగే ఒక ఆసక్తికరమైన ప్రశ్న.. టపాసుల్లో వినియోగించే గన్‌పౌడర్ రాకముందు భారతదేశంలో ప్రకృతి ప్రసాదించిన వనరులతోనే అద్భుతమైన కాంతితో పాటు శబ్ద విన్యాసాలు చేసేవారని ప్రాచీన చారిత్రక ఆధారాలు చెబుతూ వస్తున్నాయి..

ప్రాచీన కాలంలో బాంబుల శబ్దాన్ని సృష్టించేందుకు ప్రధానంగా పచ్చి వెదురు బొంగులను వినియోగించేవారట.. ఆ వెదురు కొమ్మలను అగ్నిగుండంలో వేసినప్పుడు.. లోపలి గాలి వేడెక్కి ఒత్తిడికి గురై పెద్ద శబ్దంతో పేలిపోయేదట.. దీనిని మరింత తీవ్రతరం చేయడానికి వెదురు కణుపుల లోపల ముడి ఉప్పును నింపి వేడిచేసేవారట.. ఉప్పు వేడికి పగిలేటప్పుడు పటపటలాడే పెద్ద చప్పుడు వస్తూ.. రాత్రి పూట ప్రత్యేకమైన వినోదాన్ని అందించేదట.. గ్రామాల్లో దుష్ట శక్తులను, విష కీటకాలను తొలగించేందుకు ఈ సహజ సిద్ధ పద్ధతిని పాటించేవారని సమాచారం..

అంతేకాకుండా ప్రకృతిసిద్ధమైన కాంతుల కోసం రకరకాల ఎండిన వనమూలికలతో పాటు చెట్ల జిగుర్లు, సల్ఫర్, ముడి పొటాషియం నైట్రేట్, సున్నపురాయి, ప్రత్యేక లోహ చూర్ణాలను కలిపి మట్టి పాత్రల్లో లేదా గొట్టాల్లో నింపేవారట.. ఆ మిశ్రమానికి నిప్పు అంటించినప్పుడు ఆకాశంలోకి పొగతో పాటు వివిధ రంగుల ప్రకాశవంతమైన వెలుగులు వచ్చేవాట.. ఇవి పరిసరాలకు హాని కలిగించకుండా.. కేవలం అద్భుతమైన వాసనతో పాటు పొగతో.. కంటికింపుగా ఉండేవి.

భారతీయ గ్రంథాల్లో మండే పదార్థాల తయారీ గురించి అనేక రకాలుగా వివరిస్తూ వచ్చారు. చాణక్యుడు రచించిన ప్రసిద్ధ అర్థశాస్త్రంలో యుద్ధ తంత్రాలకు సంబంధించిన ఆగ్నేయాస్త్రాలతో పాటు పొగను చిమ్మే రసాయన మిశ్రమాలు, అగ్ని బాణాల తయారీ సూత్రాలను అద్భుతంగా వివరించారు. అగ్నిని పూలలా విరజిమ్మే విధానాలతో పాటు రాజుల ఉత్సవాలలో ఉపయోగించిన అగ్ని విన్యాసాల గురించి ప్రాచీన సంస్కృత గ్రంథాల్లో అనేక రకాలుగా వివరించారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News