• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /నాసా మరో సంచలనం.. ఖగోళం నుంచి భూగోళానికి ప్రమాదం పొంచి ఉందా..!!

నాసా మరో సంచలనం.. ఖగోళం నుంచి భూగోళానికి ప్రమాదం పొంచి ఉందా..!!

NASA: ఖగోళం నుంచి భూగోళానికి ప్రమాదం పొంచి ఉందనే వార్తలు ప్రజానీకాన్ని భయపెడుతున్నాయి. గగన తలంలోంచి భూమిపై గ్రహశకలం దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించనట్లు సమాచారం. ఇంతకీ ఖగోళంలో ఏం జరిగింది. ఎక్కడినుంచి ఏం దూసుకొస్తోంది. భూమిమీద పడితే ఎక్కడపడే అవకాశాలున్నాయి? అనంత విశ్వంలో సంభవించే అత్యంత శక్తిమంతమైన గామా కిరణాల విస్ఫోటనాలను అధ్యయనం కోసం నాసా ప్రయోగించిన అబ్జర్వేటరీ టెలీస్కోప్ ఆపరేషన్ ముగిసింది. కక్ష్య క్షీణించి, రెస్క్యూ మిషన్ విఫలం కావడంతో టెలీస్కోప్ ఆపరేషన్ నియంత్రణ చేయబోమని నాసా అధికారికంగా ప్రకటించింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 15, 2026, 07:13 AM IST|Updated: Nov 15, 2026, 07:14 AM IST
joinshare
నాసా మరో సంచలనం.. ఖగోళం నుంచి భూగోళానికి ప్రమాదం పొంచి ఉందా..!!
Image Credit: NASA Operation (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
అదుర్స్‌కు సీక్వెల్‌గా ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ ..?

అదుర్స్‌కు సీక్వెల్‌గా ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ ..?

2

కార్తీక మాసంలో దీపదానం ఎలా చేయాలి? ఎవరికి దానం చేస్తే పుణ్యఫలం కలుగుతుంది?

3

తెలంగాణకు తుఫాన్ ఎఫెక్ట్.. నవంబర్ 20 నుంచి 22 వరకు భారీ వర్షాలు.. ఈ 6 జిల్లాలకు అలర్ట్!

4

కార్తీక మాసంలో తులసి ముందు నెయ్యి దీపం ఎందుకు వెలిగిస్తారు? అసలు రహస్యం ఇదే!

5

పుతిన్ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

NASA Mission: జాతీయ అంతరిక్ష విమానయాన సంస్థ  దీనిని 2004లో ప్రయోగించింది.  దీనిని డెల్టా 7320 రాకెట్ ద్వారా భూమికి సమీప కక్ష్యలోకి ప్రయోగించారు. సుమారు 1,452 కిలోల బరువున్న ఈ టెలిస్కోప్ అంతరిక్షంలో రెండేళ్ల పాటు గామా కిరణాల విస్పోటనాలను అధ్యయనం కోసం ప్రయోగించిన నాసాకు 22 ఏళ్లపాటు అద్భుతమైన సేవలు అందించింది.

నవంబర్ 4వ తేదీన స్పేస్ టెలిస్కోప్ కక్ష్య క్షీణించి  భూ వాతావరణంలోకి పునఃప్రవేశం చేసింది. స్పేస్ టెలిస్కోప్ కక్ష్య తప్పిన తర్వాత ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రాంతంపై వాతావరణంలోకి ప్రవేశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

భూమి వైపు వస్తున్న క్రమంలో చాలా వరకు వాతావరణంలోనే కాలిపోతుందని, కొన్ని చిన్న శకలాలు భారతదేశంలోని ముంబై, హైదరాబాద్ వంటి నగరాలు ఉన్న అక్షాంశాల పరిధిలో పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.  

విశాలమైన అంతరిక్ష క్షేత్రం, అధిక సున్నితత్వం కలిగిన బరస్ట్ అలర్ట్ టెలిస్కోప్ సంవత్సరానికి వంద జీర్బీలను గుర్తించింది. అంతరిక్షంలో జరిగే విస్పోటనాలను అధ్యయనం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఉపగ్రహంలోనే ఆర్క్-మినిట్ స్థాన ఖచ్చితత్వంతో బరస్ట్ స్థానాలను గణిస్తుంది.

ఎక్స్‌రే టెలిస్కోప్..

ఎక్స్-రే టెలిస్కోప్  నిర్దేశిత అనుసరణ పరిశీలనల సమయంలో గామా కిరణాల విస్పోటనాల ఆఫ్టర్‌గ్లోల స్పెక్ట్రాలను పొందుతుంది. ఈ చిత్రాలను అధిక కచ్చితత్వంతో స్థాన నిర్ధారణ కోసం ఉపయోగిస్తారు,   లైట్ కర్వ్‌లను ఫ్లేరింగ్, ఎక్స్-రే ఆఫ్టర్‌గ్లో  దీర్ఘకాలిక క్షీణతను అధ్యయనం చేయడానికి ఈ టెలిస్కోప్ ను  ఉపయోగిస్తారు.

స్విఫ్ట్ టెలిస్కోప్ వందలాది సూపర్‌ నోవా పేలుళ్లు, నక్షత్రాలను ముక్కలు చేసే బ్లాక్ హోల్స్, నక్షత్రాల ఎక్స్-రే మంటలు, గ్రహశకలాలు, తోకచుక్కలను అధ్యయనం చేసింది. ఖగోళ పరిశోధకులకు, శాస్త్రవేత్తల అధ్యనాలకు స్విప్ట్‌ టెలిస్కోప్ విశిష్టసేవలు అందించింది. 22 ఏళ్ల పాటు అంతరిక్షంలో  అధ్యయనం చేసిన స్విఫ్ట్ టెలిస్కోప్ కక్ష్య తప్పి భూ గోళంవైపు దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.  1,452 కిలోల బరువున్న ఈ టెలిస్కోప్ కక్ష్యదాటిన తర్వాత ధ్వంసమైందని, దీని శకలాలు హైదరాబాద్, ముంబై నగర పరిసరాల్లో పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

టెలిస్కోప్ కక్ష్య.. 
ఈ టెలిస్కోప్ కక్ష్య క్షీణించి భూమి వైపు వస్తున్నప్పుడు, భూమధ్యరేఖకు ఇరువైపులా ఉన్న 20.6 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఇది కూలిపోయే అవకాశం ఉందని యూఎస్ స్పేస్ ఫోర్స్ లెక్కగట్టింది. ఈ భౌగోళిక బెల్ట్‌ పరిధిలోకి భారతదేశంలోని ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలు వస్తాయి. దీన్ని చూసి కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఛానళ్లు ఆయా నగరాలకు ప్రమాదం పొంచి ఉందని అతిగా ప్రచారం చేశాయి.

భూ వాతావరణంలో విపరీతమైన ఘర్షణ.. 

భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు కలిగే విపరీతమైన ఘర్షణ  కారణంగా ఈ ఉపగ్రహంలో మెజారిటీ భాగం అక్కడికక్కడే కాలి బూడిదైపోయింది. దీనికి సంబంధించిన కొన్ని శకలాలు సముద్రంలో పడిపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో నాసా టెలిస్కోప్ వల్ల హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలకు ఎలాంటి ఇబ్బంది లేదని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తంచేశారు.

(రచయత.. మునిరాజ్ జీ న్యూస్ డెస్క్ సౌజన్యంతో)

Add Zee News as a Preferred Source
TAGS:
National News
World News
Trending News