SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఈరోజు బ్యాంకులు పనిచేస్తాయా? లేవా? క్లారిటీ ఇచ్చిన SBI.. అడ్వైజరీ జారీ!

బ్యాంకు ఖాతాదారులకు ఎస్‌బీఐ కీలక అడ్వైజరీ జారీ చేసింది. బ్యాంక్ ఉద్యోగుల యూనియన్ల సమ్మె వాయిదా పడటంతో, ఈ రోజు నుంచి బ్యాంకులు యథావిధిగా అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ బ్రాంచీలు, బ్యాంకింగ్ సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని ఎస్బిఐ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Sep 28, 2026, 06:42 AM IST | Updated: Sep 28, 2026, 06:47 AM IST
Image Credit: SBI Advisory
Join

బ్యాంకు ఖాతాదారులకు ఎస్‌బీఐ కీలక అడ్వైజరీ జారీ చేసింది. బ్యాంక్ ఉద్యోగుల యూనియన్ల సమ్మె వాయిదా పడటంతో, ఈ రోజు నుంచి బ్యాంకులు యథావిధిగా అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ బ్రాంచీలు, బ్యాంకింగ్ సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని ఎస్బిఐ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రభుత్వ రంగ బ్యాంకులు ఐదు రోజుల పని దినాల అమలు కోసం చేపట్టిన మూడు రోజుల వరుస సమ్మె వాయిదా పడింది. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ల మధ్య జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటం వల్ల ఖాతాదారులకు ఇబ్బంది కలుగుతుందని భావించి, ఆదివారం (సెప్టెంబర్ 27) కూడా బ్యాంకులు పనిచేశాయి. అయితే, రాత్రి జరిగిన అత్యవసర సమావేశంలో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు నిర్ణయించిన సమ్మెను వాయిదా వేయాలని యూఎఫ్‌బీయూ ప్రకటించింది. సమస్యల పరిష్కారానికి ఒక హై-లెవల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. దీనితో బ్యాంకులు ఈ రోజు నుంచి యథావిధిగా అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ ఖాతాదారులకు అడ్వైజరీ జారీ చేస్తూ, సమ్మె వాయిదా పడటంతో బ్యాంక్ బ్రాంచీలు, సేవలు అంతరాయం లేకుండా కొనసాగుతాయని తెలిపింది. కస్టమర్లు చూపిన సహనానికి బ్యాంక్ కృతజ్ఞతలు కూడా తెలియజేసింది.

 

 

రాత్రి అసలు ఏం జరిగింది?
సెప్టెంబర్ 27 రాత్రి 9:30 గంటల సమయంలో ఐబీఏ (IBA, యూఎఫ్‌బీయూ మధ్య సమావేశం జరిగింది. ఈ యూనియన్ సంస్థలు తమ సంతకాలతో కూడిన సర్క్యులర్‌ను జారీ చేస్తూ, సమస్యల పరిష్కారానికి తక్షణమే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నట్లు తెలిపాయి. ఈ ఆదేశాలను సంబంధిత వర్గాల అందరికీ తెలియజేశారు.

ఎస్‌బీఐ ఓపెన్ ఉంటుందా?
బ్యాంకు సమ్మె సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు వాయిదా పడటంతో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు ఈ రోజు నుంచి యథావిధిగా పనిచేస్తాయి. సోమవారం కూడా అన్ని బ్యాంక్ బ్రాంచీలు అందుబాటులో ఉంటాయి. ఈ సమ్మె వాయిదా పడటంతో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు గ్రామీణ, ప్రాంతీయ బ్యాంకులు కూడా యథావిధిగా పనిచేస్తాయి. మరోవైపు, ప్రైవేట్ రంగ సంస్థ అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా సెప్టెంబర్ 28 సోమవారం నుంచి యథావిధిగా తన సేవలను అందిస్తుందని, బ్యాంక్ శాఖలు తెరిచి ఉంటాయని కస్టమర్లకు తెలియజేసింది.
సర్క్యులర్ ప్రకారం, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు వివిధ వర్గాల మధ్య చర్చలు జరిగాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఆందోళన కార్యక్రమాలను, సమ్మెను వాయిదా వేయడానికి యూఎఫ్‌బీయూ అంగీకరించింది. దీనివల్ల వినియోగదారులు సోమవారం నుంచి సాధారణ బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు.

 

 

Read Also: 3 రోజులు బ్యాంకులు బంద్.. మీ ఫోన్‌కు ఈ మెసేజ్ వస్తే అస్సలు 

సాధారణంగా ప్రతి ఆదివారంతో పాటు, రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవులంటాయి. కానీ, పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, కుటుంబాల కోసం తగిన సమయం కేటాయించలేకపోతున్నామని పేర్కొంటూ, ఐదు రోజుల పని దినాల అమలు కోసం ఉద్యోగులు సమ్మెకు పూనుకున్నారు. ఐదు రోజుల పని విధానం అమల్లోకి వస్తే పని భారం పెరుగుతుందని వారు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ, సరైన స్పందన రాకపోవడంతో వారు సమ్మెకు పిలుపునిచ్చారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES