• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /సీఎంగా..పీఎంగా 25 యేళ్ల రాజకీయ ప్రస్థానంలో మోడీ చూపించిన మార్క్ ఇదే..

సీఎంగా..పీఎంగా 25 యేళ్ల రాజకీయ ప్రస్థానంలో మోడీ చూపించిన మార్క్ ఇదే..

Narendra Modi Political Journey: రాజకీయాల్లో నరేంద్ర మోడీది విలక్షణ శైలి. అణకువ.. ఆలోచన.. అంతకు మించిన సహనం… ఆయన్ని రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా తీర్చి దిద్దింది. వినయం, విధేయత, మృదుస్వభావం ఆయన్ని రాజకీయనాయకుడిగా మార్చింది. ఎన్నికల్లో ఎక్కడా పోటీచేయకుండా రాజకీయాల్లో వ్యూహరచన చేయడంలో నరేంద్ర మోడీ సిద్ధహస్తుడిగా పేరుతెచ్చుకున్నారు. ఆ తర్వాత ఊహించని విధంగా గుజరాత్ కు ముఖ్యమంత్రిగా…భారత దేశానికి ప్రధాన మంత్రిగా సేవలు అందిస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లో 25ఏళ్లు పూర్తి చేసుకున్నారు. నరేంద్రమోడీ రాజకీయ ప్రస్థానంపై జీ తెలుగున్యూస్ స్పెషల్ ఫోకస్..!!

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 08, 2026, 12:24 AM IST|Updated: Oct 08, 2026, 03:30 PM IST
joinshare
సీఎంగా..పీఎంగా 25 యేళ్ల రాజకీయ ప్రస్థానంలో మోడీ చూపించిన మార్క్ ఇదే..
Image Credit: Narendra Modi (File/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Ajit Agarkar Salary: చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ జీతం ఎంతంటే..? మొత్తం ఆస్తుల విలువ తెలుసా..!

Ajit Agarkar Salary: చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ జీతం ఎంతంటే..? మొత్తం ఆస్తుల విలువ తెలుసా..!

2

Donald Trump: 'నేను 8 యుద్ధాలు ఆపాను. నాకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి': డొనల్డ్‌ ట్రంప్‌

3

ఇదేం అరాచకం సామి.. ప్రేక్షకులపై పగపట్టిన కమల్, శంకర్‌లు ..! ‘భారతీయుడు 3’తో సాధించేదేమిటి..?

4

సీజన్ మారినప్పుడల్లా జలుబు, జ్వరం వస్తున్నాయా? ఈ 5 సింపుల్ చిట్కాలతో ఇన్ఫెక్షన్లకు బై బై చెప్పండి!

5

UPI పేమెంట్స్‌పై కేంద్రం వెనకడుగు..? మరిన్ని రోజులు వాయిదా పడే అవకాశం..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

NAMO Completes 25 Years as Goverment Head: రాజకీయాలపై అవగాహన… పార్టీ పెద్దలతో పరిచయాలు... వినయం, విధేయత, మృదు స్వభావం ఆయన్ని తిరుగులేని రాజకీయ నాయకుడిగా మార్చాయి. భారతీయ జనతాపార్టీలో కీలక నేతలతో మెలుగుతూ రాజకీయాలపై పట్టు సాధించారు. వివిధ రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు, నాయకుల తీరు, ప్రజానాడిపై అధ్యయనం చేసి వ్యూహకర్త లక్షణాలను అలవరచుకున్నారు. గుజరాత్ లో జరిగిన భూకంపం ఆయన రాజకీయ భవిష్యత్తును మార్చేసింది. గుజరాత్ రాజకీయాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినపుడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టే అవకాశం వెతుక్కొంటూ వచ్చింది.  2001 అక్టోబరు 7వ తేదీన గుజరాత్ సీఎంగా నరేంద్రమోడీ తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఈ అక్టోబరు 7వ తేదీనాటికి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి.

ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే నైజం.. 

రాజకీయ ఎత్తుగడలతో  వ్యూహాత్మకంగా అడుగులు వేయడంలో నరేంద్ర మోడీ సిద్ధహస్తుడు.  ప్రతిపక్షాల విమర్శలు సమర్థవంతంగా ఎదుర్కొంటూ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు. గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశ గమనాన్నే మార్చేశారని విదేశీ నేతల అభినందనలు అందుకున్నారు. అంతేకాదు వివిధ దేశాలకు చెందిన అత్యున్నత పురస్కారాలను అందుకున్న నేతగా ఎదిగారు.  రాజకీయాల్లో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. అవినీతి అంతం.. బీజేపీ పంతం అనే నినాదాన్ని అమలుచేస్తూ సమర్థవంతం పాలన అందిస్తున్నారు. ప్రభుత్వం పరంగా తీసుకొచ్చిన సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతంచేసి అభివృద్ధి చెందుతున్న  దేశాల సరసన భారత్ ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత… ఇబ్బందికర పరిస్థితులు నరేంద్ర మోడీకి నిద్రపట్టని రాత్రులుగా మారాయి. గుజరాత్ లో శాంతి భద్రతలను కాపాడటంలో నరేంద్ర మోడీ విఫలమయ్యారని విపక్షాల విమర్శల తూటాల ఇబ్బంది పెట్టాయి. ప్రభుత్వ సారథిగా మోడీ పనితీరును, సమర్థతను ప్రశ్నించాయి. విమర్శలు ఎదుర్కొంటూనే అభివృద్ధిపై దృష్టి సారించారు. అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అభివృద్ధి,  ప్రణాళిక అమలుపై పరుగులు తీయించారు. పదవి చేపట్టిన వంద రోజుల్లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పేదలకు గూడు, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక ఆధారిత అభివృద్ధి అనే ఐదు ప్రాధాన్యత అంశాలుగా అభివృద్ధి ప్రణాళిక అమలుకు అధికారులను నిద్రపోనీకుండా చేశారు.

సీఎంగా ఎన్నికైన యేడాదిలోనే రాష్ట్ర ఎన్నికలు..

నరేంద్ర మోడీ రెండో సారి 2002 డిసెంబరు 22 తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విపక్షాల విమర్శలను పట్టించుకోలేదు… అభివృద్ధి ఎజెండాను తనదైన శైలిలో అమలు చేశారు. గుజరాత్ లో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కింది. ప్రజలకు సుపరిపాలన అందించడంలో నరేంద్రమోడీ ప్రత్యేక ముద్ర వేశారు. గుజరాత్ రూపురేఖలను మార్చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కొత్త రూపులు సంతరించుకున్నాయి. తాగునీరు, సాగునీరు అందించడంలో ప్రత్యేక దృష్టిసారించారు. ప్రకృతి వైపరీత్యాలతో నివాసాలను కోల్పోయిన బాధితులకు పునవాసం కల్పించడంలో స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేశారు.

అభివృద్ధికి మారుపేరు..

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధికి మారుపేరుగా మారిపోయారు. ప్రభుత్వ అధికారుల సహకారంతో అద్బుతాలను ఆవిష్కరించారు. ఆర్థిక సంస్కరణలతో సాధించిన ప్రగతి, చేపట్టిన అభివృద్ధితో దేశంలోనే రోల్ మోడల్ గా నిలిచారు. అన్నిరంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో పాలనలో పారదర్శకత, ప్రజాసమస్యల పరిష్కారంలో జవాబుదారి తనం పెరిగింది. గుజరాత్ లో ఇ-గవర్నెన్స్, స్పెషల్ ఎకనమిక్ జోన్ల ఏర్పాటు, విద్యుత్తు రంగంలో సంస్కరణలు, పెట్టుబడుల సాధన, కొత్త పరిశ్రమల ఏర్పాటు,  వ్యవసాయం, పరిశ్రమలు, వస్తూత్పత్తుల ఎగుమతులతో ఆర్థిక ప్రగతి సాధనలో సఫలమయ్యారు. రైతులకు సాగునీటి సమస్యలను పరిష్కారానికి, ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంలో భగీరథ ప్రయత్నం చేశారు. సుజలాం - సుఫలాం పథకంతో జలవనరుల సంరక్షణ, నీటివనరుల అభివృద్ధి దేశానికే రోల్ మోడల్ గా నిలించింది. భూసార పరీక్షలు నిర్వహించి రైతుల దిగుబడి పెంచడానికి వినూత్న ప్రయోగాలు ఫలించాయి. రైతుల ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించారు. విద్యారంగంలో సమూల మార్పులతో అద్భుత ఫలితాలు సాధించారు.

2002, 2007, 2012లో వరుసగా మూడు సార్లు సీఎంగా విజయం.. 
ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇది ప్రజల జీవనప్రమాణాల్లో మార్పునకు సాధ్యమైంది. పేదరిక నిర్మూలనకు పెద్దపీట వేశారు. గుజరాత్ అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేశారు. అవినీతికి ఎక్కడా ఆస్కారం ఇవ్వలేదు. పారదర్శక పాలనతో బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం రెట్టింపు అయింది. నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా సాధించి ప్రగతి, గుజరాత్ లో తెచ్చిన మార్పు ఎన్నికల ప్రచార అస్త్రంగా మారింది. 2012 జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ అభివృద్ధి ఎజెండాతో ముందుకెళ్లారు ఆ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో 182 స్థానాలకు గాను 115 స్థానాల్లో గెలిచారు. గుజరాత్ లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా 2012 డిసెంబరు 26 తేదీన ప్రమాణ స్వీకారం చేశారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ విజయవంతంగా రాణించడంతో… భారతీయ జనతాపార్టీ పెద్దలు దేశ రాజకీయాలపై దృష్టి మళ్లించారు. బీజేపీలో తొలితరం నాయకుడు వాజ్ పేయి తర్వాత... మలితరం నాయకుడిగా నరేంద్ర మోడీ ప్రజల్లోకి వెళ్లారు. గుజరాత్ మార్క్ అభివృద్ధితో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లారు. 2014 మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ విజయఢంకా మోగించింది. పదేళ్ల కాంగ్రెస్ పాలనకు తెరదించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సూచనలు, సలహాలతో భారతీయ జనతాపార్టీ ప్రతినిధిగా నరేంద్రమోడీ భారత ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తంచేశారు. 13 యేళ్లపాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోడీ ఆ పదవికి, మణినగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి 2014 మే 21తేదీన రాజీనామా చేశారు.  రెవెన్యూ మంత్రి ఆనందిబెన్ పటేల్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు.

నాలుగు సార్లు ముఖ్యమంత్రి.. మూడు సార్లు ప్రధానిగా..

నరేంద్రమోడీ రాజకీయ ప్రస్థానంలో నాలుగు సార్లు  గుజరాత్  సీఎంగా, మూడు సార్లు భారత ప్రధానికి ప్రమాణస్వీకారం చేశారు. నరేంద్ర మోడీ సారథ్యంలో 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికలు భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేశాయి. బీజేపీ సాధించిన ఘన విజయాల్లో మోడీ కీలక పాత్ర పోషించారు. మూడు సార్లు కాంగ్రెసేతర పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోడీ దక్కించుకున్నారు. సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి సమర్థవంతమైన పాలన అందిస్తూ దూసుకుపోతున్నారు.

వికసిత్ భారత్ లక్ష్యం..

దేశ రాజ్యాంగ విలువలకు బలమిచ్చే వికసిత భారత్ సాధన కోసం  ప్రధాని నరేంద్రమోడీ కార్యాచరణ ప్రణాళికను అమలుచేస్తున్నారు. ఎలాంటి రాజకీయ నష్ట భయాలు లేకుండా దేశ ప్రయోజనాల కోసం సాహసోపేత సంస్కరణలు చేపట్టారు. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ హయాంలో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం చరిత్రలో మైలు రాళ్లుగా నిలిచాయి. జాతీయ రహదారులు కొత్తరూపులను సంతరించుకున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కల్పించారు. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాల్లో రాష్ట్రం ఎంతో పురోగతి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. స్పేస్ టెక్నాలజీ అభివృద్ధి, రాకెట్ ప్రయోగాలు, చంద్రయాన్, అంతరిక్ష పరిశోధనలు బలోపేతమయ్యాయి.

2040నాటికి చంద్రుడిపై మావన సహిత ప్రయోగం..

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత అంతరిక్ష రంగం ఒక సరికొత్త శిఖరానికి చేరింది. అంతరిక్ష ప్రయోగాలను కేవలం శాస్త్రీయ పరిశోధనలకే పరిమితం చేయకుండా, దేశాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి, ప్రపంచ స్థాయి ఆర్థిక అవకాశాలకు ఒక శక్తివంతమైన సాధనంగా ప్రధాని నరేంద్ర మోడీ మలిచారు. భారతదేశం సొంతంగా 2035 నాటికి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఒక భారతీయ వ్యోమగామిని 2040 నాటికి  చంద్రునిపైకి పంపాలని లక్ష్యంగా నిర్దేశించారు.  ప్రధాని మోడీ ఇస్రోను అంతర్జాతీయ వాణిజ్య ప్రయోగాల హబ్‌గా మార్చారు. ప్రభుత్వ రంగానికే  పరిమితమైన అంతరిక్ష రంగాన్ని ప్రధాని మోడీ ప్రైవేట్ భాగస్వామ్యానికి అందుబాటులోకి తెచ్చారు. భారతీయ రాకెట్ల ద్వారా ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 430 కంటే ఎక్కువ విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు.

వలస పాలనలోని చట్టాలకు చరమ గీతం.. ఇండియాన్ పీన్ కోడ్ స్థానంలో భారతీయ  న్యాయ సంహిత..

పేదరికాన్ని స్వయంగా చూసి ఎదిగిన నేపథ్యం నుంచి వచ్చిన ప్రధాని మోడీ, ఆ అనుభవాన్ని ప్రజా సంక్షేమ పథకాలుగా మలిచారు. జీఎస్టీ, సంక్షేమ ఫలాల ప్రత్యక్ష బదిలీ, వలస పాలన నాటి పాత చట్టాల రద్దు వంటివి పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. స్వచ్ఛ భారత్, డిజిటల్ చెల్లింపులు, వోకల్ ఫర్ లోకల్ వంటి పిలుపుల ద్వారా ప్రజలను ఈ మార్పులో భాగస్వాములను చేశారు. 25 కోట్ల మందికిపైగా దేశ ప్రజలను పేదరికం నుంచి విముక్తికల్పించే ప్రయత్నంచేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత ప్రధానమైన ఆర్థిక శక్తిగా భారత్ ఎదగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. నారీ శక్తి, యువ శక్తి, రైతుల సాధికారత కోసం వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. 60 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు, 4 కోట్లకు పైగా పక్కా ఇళ్లు కట్టివ్వడం వంటి చరిత్రాత్మక విజయాలు సామాన్యుల జీవితాల్లో ఆత్మగౌరవాన్ని నింపాయి. ఇండియన్ పీనల్ కోడ్ కు బదులు భారతీయ న్యాయ సంహితను తీసుకొచ్చారు.

ప్రభుత్వ పాలనలో అన్నివర్గాల భాగస్వామ్యం.. 

సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా పాలన సాగింది. 3.5 కోట్ల మంది మహిళలు లక్షాధికారులుగా మారగా, నారీ శక్తి వందన్ అధినియమం ద్వారా మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించారు. పీఎం-కిసాన్ ద్వారా అన్నదాతల ఖాతాల్లోకి 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు చేరాయి. స్టార్టప్‌లు, విద్యా సంస్కరణలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించగా, అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతాల కోసం పీఎం-జన్‌‌మన్ కార్యక్రమం బాసటగా నిలిచింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వ మూలధన వ్యయం రూ.2 లక్షల కోట్ల నుంచి ఏకంగా రూ.12 లక్షల కోట్లకు పైగా పెరిగింది. హైవేల విస్తరణ, రైల్వేల విద్యుద్ధీకరణ వేగవంతమయ్యాయి. దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.13 లక్షల కోట్లకు చేరింది. రక్షణ రంగ ఉత్పత్తులు, సెమీకండక్టర్ల తయారీలో భారత్ స్వావలంబన సాధించింది.

యోగా, తృణధాన్యాల ప్రాచుర్యం..

అభివృద్ధిని పర్యావరణ పరిరక్షణతో, సంస్కృతితో ప్రధాని అనుసంధానించారు. యోగా, తృణధాన్యాల ప్రాచుర్యం, కాశీ విశ్వనాథ్ ధామ్ పునరుద్ధరణ, అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ దేశ సాంస్కృతిక వారసత్వానికి పూర్వ వైభవాన్ని తెచ్చాయి. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ...  ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధించిన దేశంగా భారత్ ను నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. సవాళ్లను ఎదుర్కొంటూ ఆర్థికంగా బలపడుతున్న దేశాల్లో మూడో వ్యవస్థగా అవిష్కరించాలనే ప్రయత్నం ఫలించాలని ఆశిద్ధాం..!!
 

Add Zee News as a Preferred Source
TAGS:
PM Modi
National News
Trending News