SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ashaatti Ammumma Video: ఇసుకనే బ్లాక్‌బోర్డ్‌గా చేసి.. చిన్నారులతో అక్షరాన్ని దిద్దిస్తున్న ఆశాత్తి అమ్మ.. వీడియో వైరల్..

kerala Ashaatti Ammumma news: 85 ఏళ్ల ఇందిరమ్మ ఆశాట్టి అమ్మమ్మ ఇసుక మీదనే చిన్నారులకు పాఠాలు బోధిస్తు అందరిచే మన్ననలు పొందుతున్నారు.ఈ వీడియో వైరల్గా మారింది.

Written By Inamdar Paresh
Published: Oct 24, 2026, 08:04 AM IST | Updated: Oct 24, 2026, 08:16 AM IST
Image Credit: kerala Ashaatti Ammumma news
Join

Ashaatti Ammumma grand mother teaching classes on sand in kerala: ఇటీవల చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువులపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ఎంత ఫీజులైన చెల్లించి మంచి స్కూల్లో తమ పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు. వారి ఫ్యూచర్ కోసం ఎంటి త్యాగాలకైన వెనుకాడటంలేదు. ఈ క్రమంలో మారుతున్న టెక్నాలజీతో పాటు స్కూల్ లు కూడా అప్ డేట్ అవుతున్నాయి. ఒకప్పుడు స్కూళ్లలో బ్లాక్ బోర్డులు ఉండేవి. కానీ ప్రస్తుతం చాలా వరకు స్కూళ్లలో డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. ప్రతిదీ ఆన్ లైన్లో విద్యార్థులకు కావాల్సిన క్లాసులు బోధిస్తున్నారు. అయితే కేరళకు చెందిన ఒక ఆశాట్టి అమ్మమ్మ మాత్రం ఇసుక మీద పిల్లలకు పాఠాలు బోధిస్తు అందరిని ఆశ్చర్యంకు గురిచేస్తున్నారు.

 

 

కేరళలకు చెందిన 85 ఏళ్ల ఆశాట్టి అమ్మమ్మ ఈ వయసులో కూడా చాలా మంది పిల్లలకు పాఠాలుబోధిస్తున్నారు. అది కూడా ఎలాంటి హంగులు, ఆడంబారాలు లేకుండా పిడికెడు ఇసులో చిన్నారులతో ఆశాట్టి అమ్మమ్మ అక్షరాలను దిద్దిస్తున్నారు.  స్థానికంగా చాలా మంది ఆశాట్టి అమ్మమ్మను ఎంతో ప్రేమతో చూసుకుంటారు. తమ పిల్లల్ని ఆశాట్టి చెప్పే క్లాసులకు పంపుతారు. ఇంత పెద్ద వయసులో కూడా ఆశాట్టి అమ్మమ్మ స్థానికంగా తన ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లలకు క్లాసులను ఇసుక మీద బోధిస్తున్నారు. చిన్నారులు ఇసుకలో ఆడుకొవడానికి ఆసక్తి చూపిస్తారు. 

ఒకవైపు వారిని ఆడిస్తునే మరోవైపు దానిలో కూడా క్లాసుల్ని బోధిస్తు  ఆశాట్టి అమ్మమ్మ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పిల్లలుసైతం ఆశాట్టి అమ్మమ్మ వద్దకు వెళ్లేందుకు తమ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటి వరకు వందల మంది పిల్లలకు ఇసుక మీద ఆశాట్టి అమ్మమ్మ క్లాసులు బోధించారని అక్కడి వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేరళ బామ్మ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఏదైన చేయాలనే తపన, సాధించాలని బలమైన కోరిక ఉన్నవారికి వయసు అడ్డంకి కాదని ఈ బామ్మ లైవ్ ఎగ్జాంపుల్ అంటూ నెటిజన్లు ఆశాట్టి అమ్మమ్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES