• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /iQOO Neo 12 Launch: 9,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్.. ఈ ఫోన్ ఫీచర్లు అదుర్స్!

iQOO Neo 12 Launch: 9,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్.. ఈ ఫోన్ ఫీచర్లు అదుర్స్!

Iqoo Neo 12: త్వరలోనే మార్కెట్‌లోకి iQOO నియో 12 స్మార్ట్‌ఫోన్‌ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. అలాగే ఇది మోస్ట్ పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో లాంచ్‌ కాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 24, 2026, 10:37 AM IST|Updated: Oct 24, 2026, 10:38 AM IST
joinshare
iQOO Neo 12 Launch: 9,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్.. ఈ ఫోన్ ఫీచర్లు అదుర్స్!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తెలంగాణపై తుపాను ఎఫెక్ట్.. ఎల్లో అలర్ట్ జారీ..

తెలంగాణపై తుపాను ఎఫెక్ట్.. ఎల్లో అలర్ట్ జారీ..

2

Actress: కరుప్పు సినిమా నటి మృతి.. వైరల్‌గా చివరి పోస్టులు!

3

Oppo అభిమానులకు గుడ్ న్యూస్.. Reno 17, Pro, Reno 17c ఫోన్ల ఫీచర్లు లీక్!

4

Uttar Pradesh: సెల్ టవర్ ఎక్కిన యువతి.. వీడియో కాల్ లో పెళ్లి చేసిన పెద్దలు.. యూపీలో వింత ఘటన..

5

BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై వేటుపడనుందా..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Iqoo Neo 12: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఐక్యూ స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి డిమాండ్‌ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్‌ అయ్యే వీటిని యువత ఎంతో ఆసక్తిగా కొనుగోలు చేస్తూ ఉంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ కంపెనీ ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్స్‌తో కొత్త కొత్త మొబైల్స్‌ను అందుబాటులోకి తీసుకు వస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే త్వరలోనే ఐక్యూ కంపెనీ త్వరలోనే ఐక్యూ నియో 12 స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీనిని కంపెనీ మోస్ట్ పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌తో లాంచ్‌ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది మోస్ట్ పవర్‌ఫుల్  స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతోంది. వెనక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను  కూడా కలిగి ఉండడం విశేషం. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వీబో అందించిన సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు  చైనాలో ఇప్పటికే ప్రారంభమయ్యాయని iQOO తెలిపింది.. ఈ iQOO నియో 12 స్మార్ట్‌ఫోన్‌ అక్టోబర్ 28న చైనాలో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సిలికాన్ యానోడ్ టెక్నాలజీతో కూడిన 9,000 mAh బిగ్‌ బ్యాటరీని కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ బ్యాటరీని ఛార్జ్‌ చేసేందుకు 100 W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.

అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 29 గంటలకు పైగా షార్ట్ వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని iQOO అధికారికంగా ప్రకటించడం విశేషం.. iQOO నియో 12 ​​స్మార్ట్‌ఫోన్ మొట్టమొదటి 2K రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 185 Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో పాటు pTSF టెక్నాలజీని కలిగిని కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేను విజినోక్స్ నుంచి అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది.. డిస్‌ప్లేలో వినియోగించిన PTSF టెక్నాలజీతో పాటు లూమినసెంట్ మెటీరియల్ వపర్‌ వినియోగాన్ని చాలా వరకు తగ్గించే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్ కాంటెస్ట్‌తో పాటు ఫ్రాస్ట్ బ్లేడ్ బ్లూ, షాడో బ్లాక్ కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. iQOO నియో 12 స్మార్ట్‌ఫోన్‌ వెనుక ప్యానెల్‌పై టెక్స్చర్డ్ ఫినిషింగ్‌ను కూడా అందించిన్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్రాస్ట్ బ్లేడ్ బ్లూ వేరియంట్ లైట్‌ బ్లూ కలర్‌తో పాటు షాడో బ్లాక్ సిల్వర్ ఫినిషింగ్‌ను కూడా కలిగి ఉండడం విశేషం.. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను చైనా అకాడమీ ఆఫ్ ఆర్ట్ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. iQOO నియో 12 పాలిష్ చేసిన మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది..

ఈ iQOO నియో 12 స్మార్ట్‌ఫోన్ బ్యాక్‌ సెటప్‌లో రౌండ్‌ కెమెరా మాడ్యూల్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో రెండు కెమెరాలతో పాటు చాలా ప్రత్యేకమైన ఒక ఫ్లాష్ కూడా లభిస్తోంది.. ఈ iQOO నియో 12 స్మార్ట్‌ఫోన్‌ సన్నని బెజెల్స్‌తో కూడిన ఫ్లాట్ డిస్‌ప్లేతో పాటు ఫ్రంట్‌ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. iQOO నియో 12 స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో అందుబాటులలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ చాలా ప్రత్యేకమైన Q3 గేమింగ్ చిప్ కూడా కలిగి ఉంటుంది.. iQOO నియో 12 థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఐస్ డోమ్ యాక్టివ్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అలాగే ఇది త్వరలోనే భారత మార్కెట్‌లోకి కూడా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News