• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /రాత్రికి రాత్రే మారిపోయిన ఆటో డ్రైవర్ జీవితం.. మట్టిలో దొరికిన 3 క్యారెట్ల వజ్రం.. విలువ ఎంతో తెలుసా?

రాత్రికి రాత్రే మారిపోయిన ఆటో డ్రైవర్ జీవితం.. మట్టిలో దొరికిన 3 క్యారెట్ల వజ్రం.. విలువ ఎంతో తెలుసా?

Auto Driver Finds Diamond: ఓ ఆటో డ్రైవర్‌ కల నిజమైపోయింది.. అతనికి రోజు వజ్రం దొరికిందని కల వచ్చిందట.. అయితే, అతను తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి నిజంగానే పన్నా జిల్లాలో భూమిని లీజుకు తీసుకుని డైమాండ్‌ కోసం తవ్వకాలు చేపట్టాడు. ఇందులోనే అతని ఒక వజ్రం లభించింది.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 21, 2026, 14:28 IST|Updated: Nov 21, 2026, 14:30 IST
joinshare
రాత్రికి రాత్రే మారిపోయిన ఆటో డ్రైవర్ జీవితం.. మట్టిలో దొరికిన 3 క్యారెట్ల వజ్రం.. విలువ ఎంతో తెలుసా?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Auto Driver Finds Diamond: అదృష్టం ఎప్పుడు.. ఏ రూపంలో తలుపు తడుతుందో ఊహించడం చాలా కష్టం.. మధ్యప్రదేశ్‌లోని వజ్రాల గనులకు ఎంతో ప్రసిద్ధి చెందిన పన్నా జిల్లాలో ఒక సామాన్య ఆటో డ్రైవర్ జీవితం రాత్రికి రాత్రే మారిపోయిందంటే నమ్ముతారా? తప్పకుండా నమ్మాల్సిందే.. తనకు వజ్రం దొరికినట్లు కలలో కనిపించడంతో.. ఆ కలను నిజం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం అతడిని రాత్రికి రాత్రే ధనవంతుడిని చేసింది.. అసలు ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటో? ఇప్పుడు మనం తెలుసుకుందాం...

పన్నా జిల్లాకు చెందిన సోనూ రైక్వార్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ వస్తున్నాడు. గత కొంతకాలంగా తనకు వజ్రం దొరికినట్లు తరచూ కలలు వస్తుండటంతో.. ఆ కలను నిజం చేసుకోవాలని సోనూ గట్టిగా నిర్ణయించుకున్నాడట.. ఇందులో భాగంగా స్థానిక ఉన్న డైమాండ్‌ ఆఫీసులో కేవలం రూ.200 చెల్లించి.. రాణిపూర్ ప్రాంతంలో ఒక చిన్నపాటి భూమిని లీజుకు తీసుకున్నాడట.. అక్కడ అతను లోతు తక్కువగానే గని తవ్వకాలు మొదలు పెట్టారు.. అలా 15 రోజుల పాటు మట్టిని జల్లెడ పడుతూ కష్టపడిన సోనూకు.. నవంబర్ 20న మెరిసే 3.17 క్యారెట్ల అరుదైన వజ్రం లభించిందట..

తమకు దొరికిన ఆ వజ్రాన్ని సోనూ.. పన్నాలోని ప్రభుత్వ వజ్రాల కార్యాలయంలోకి తీసుకెళ్లాడు. దానిని చెక్‌ చేసిన డైమండ్ ఎగ్జామినర్ అనుపమ్ సింగ్.. ఆ వజ్రం నాణ్యతను బట్టి మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువే పలికే అవకాశం ఉందని తెలిపారట.. దీంతో ఆటో డ్రైవర్‌ ఆనందానికి అవదులు లేకుండా పోయాయి..

పన్నా జిల్లాలో సామాన్యులు సైతం చిన్నపాటి స్థలాలను లీజుకు తీసుకుని వజ్రాల కోసం దశాబ్దాలుగా వెతికే సంప్రదాయం కొనసాగుతూ వస్తోందట.. అయితే, తవ్వకాల్లో వజ్రం దొరికినంత మాత్రాన దాని సంబంధించిన డబ్బులు నేరుగా ఆ వ్యక్తి చేతికి అందవట.. గనుల్లో లభించిన వజ్రాలను తప్పనిసరిగా జిల్లా అధికారుకు చూపించి దానికి ఎంత విలువ ఉంటుందని తెలుసుకుని విక్రయించాల్సి ఉంటుంది. అధికారులు పబ్లిక్ నోటీసు జారీ చేసి.. బహిరంగ వేలం నిర్వహిస్తారు.

వేలంలో వజ్రం అమ్ముడు పోయిన తర్వాత.. ఆ మొత్తం నుంచి ప్రభుత్వ రాయల్టీ.. పన్నులు, ఇతర నిబంధనల ప్రకారం ట్యాక్స్‌లు చెల్లించి.. మిగిలిన అమౌంట్‌ చేతికి అందుతుందట.. కష్టపడి పనిచేసే తత్వానికి అదృష్టం తోడైతే సామాన్యులు సైతం ఉన్నత స్థాయికి చేరుకోగలరని సోనూ రైక్వార్ ఘటన మరోసారి నిరూపించింది. ఈ డబ్బుతో తమ కుటుంబ ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయని సోనూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాడు..
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Viral News