SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ముక్కు లేకుండానే పుట్టిన పసికందు.. వైద్యులు షాక్‌!

Baby Without Nose: అమెరికాలోని ఓ పసికందు ముక్కు లేకుండా జన్మించాడు.. అయితే, జన్యు లోపం కారణంగానే జన్మించినట్లు వైద్యులు తెలిపారు. అతని గొంతు నుంచి శ్వాస తీసుకునేందుకు వైద్యులు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారట.. అయితే, ఇప్పుడు ఆ పసికందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 11, 2026, 02:18 PM IST | Updated: Nov 11, 2026, 02:19 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Baby Without Nose: వైద్య శాస్త్ర చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన అమెరికాలోని అలబామాలో చోటుచేసుకుంది. ఎలీ థాంప్సన్ అనే అప్పుడే జన్మించిన పసికందు ముక్కు లేకుండానే భూమిపైకి అడుగుపెట్టాడు.. పుట్టిన క్షణాల్లోనే చిన్నారి రూపాన్ని చూసిన తల్లిదండ్రులతో పాటు వైద్యులు కూడా షాక్‌ అయ్యారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎలీ కంప్లీట్ కంజెనిటల్ అర్హీనియా అనే అత్యంత అరుదైన జన్యుపరమైన లోపంతో జన్మించాడట.. అంటే బయటికి ముక్కు కనిపించకపోవడమే కాకుండా.. లోపలి నాసికా మార్గాలు, సైనస్ గదులు కూడా అస్సలు ఉండవట.. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 19.7 కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే ఇలాంటి విచిత్రమైన జన్యు లోపం వస్తుందన్నారు. వైద్య చరిత్ర మొత్తం పరిశీలించినా.. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా 40 కంటే తక్కువగానే ఉన్నట్లు వైద్య అధికారులు వెల్లడించారు.

శిశువులు సాధారణంగా పుట్టిన వెంటనే ముక్కు ద్వారానే ఎక్కువగా శ్వాస తీసుకుంటారు.. అయితే, నాసికా రంధ్రాలతో పాటు అంతర్గత మార్గాలు లేకపోవడంతో ఎలీ శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఆపసోపాలు పడ్డట్లు తెలుస్తోంది.. పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో వైద్యులు తక్షణమే రంగంలోకి దిగారట.. కేవలం ఐదు రోజుల పసికందుగా ఉన్నప్పుడే అతనికి అత్యవసరంగా ట్రాకియోటమీ శస్త్రచికిత్స నిర్వహించారట.. గొంతు భాగంలో చిన్న రంధ్రం చేసి ఒక గొట్టం అమర్చడంతో నేరుగా ఊపిరితిత్తులకు గాలి అందేలా ఏర్పాట్లు చేశారట..

శస్త్రచికిత్స అనంతరం చిన్నారిని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలుస్తోంది. ఆహారం తీసుకోవడంతో పాటు శ్వాస ప్రక్రియను మెరుగుపరచడానికి ప్రత్యేక చికిత్స అందించారట... వైద్యుల నిరంతర శ్రమతో ఎలీ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. శరీరంలో అన్ని భాగాలు పరిశీలించిన తర్వాత ఆసుపత్రి వర్గాలు చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన్నట్లు తెలుస్తోంది..
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES