Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలని సర్కార్ నిర్ణయించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం విద్యాశాఖపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.హైదరాబాద్‌లో జరిగిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్వేగభరితంగా మాట్లాడారు. తన ప్రభుత్వ హయాంలో ఇవ్వడానికి ధనదాహాలు లేకపోయినా.. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం అత్యుత్తమ విద్యను అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన ముక్కు సూటిగా మాట్లాడుతూ.. నిజాం కాలం నాటి నుంచి మిగిలిన నిధులన్నీ ఎప్పుడో అయిపోయాయి. ఈ సత్యాన్ని చెప్పడానికి నాకెలాంటి భయం లేదు. నేను ఎప్పుడూ ముక్కు సూటిగానే మాట్లాడుతాను" అని అన్నారు. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను శ్రద్ధగా చదివించాలని.. ఒకవేళ వారికి చదువుపై ఆసక్తి లేకపోతే నైపుణ్యాలు నేర్పించాలని లేదా క్రీడల వైపు ప్రోత్సహించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఆధునిక కాలపు అవసరాలకు అనుగుణంగా విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యం అన్నారు. ఏ ఒక్క విద్యార్థికి కూడా నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా విద్యా విధానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
కాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో 10+2 విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్కూల్ విద్యలో భాగంగా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. విద్యార్థులకు 12వ తరగతి నుంచే స్కిల్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నత విద్యగా పరిగణించి.. విద్యార్థులకు ప్రత్యక విద్యను అందించాలని స్పష్టం చేశారు. సర్కార్ బడులను ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని సీఎం చెప్పారు. ఇందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులను పాఠశాలల్లో కల్పించాలని.. ఈ విషయాల్లో ఎక్కడ కూడా రాజీ పడాల్సిన అవసరం లేదని అధికారులను హెచ్చరించారు.
Also Read: