Elephant Video: హెల్మెట్‌తో ఫుట్ బాల్ ఆడుతున్న గున్న ఏనుగు.. ఇంతలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన తల్లి ఏనుగు.. వీడియో వైరల్..
Baby elephant funny video: గున్న ఏనుగు అడవిలో నుంచి బైటకు వచ్చింది. అది కాస్త అక్కడే పార్క్ చేసిన బైక్ పైన ఉన్న హెల్మెట్ ను తీసింది. దానితో ఫుట్ బాల్ ఆడింది. ఈ వీడియో వైరల్ గా మారింది.
Baby elephant playing with helmet funny video: సోషల్ మీడియాలో ఇటీవల కుప్పలు తెప్పలుగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు చూస్తుంటే ఆశ్చర్యంకు గురిచేస్తాయి. మరికొన్ని వీడియోలను చూస్తుంటే ఫన్నీగా ఉంటాయి. ఈక్రమంలో నెటిజన్లు ఎక్కువగా నవ్వులు తెప్పించే వీడియోలను చూసేందుకు ఆసక్తిని చూపిస్తారు. తరచుగా శునకాలు, పిల్లులు, ఏనుగుల ఫన్నీ వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతాయి. ఇవి చేసే చేష్టలు చాలాఫన్నీగా ఉంటాయి. అందుకే చాలా మంది ఇటీవల మూగజీవాలను పెంచుకునేందుకు చాలా మందిఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు.
అవి కూడా తమ యజమానుల పట్ల చాలా విశ్వాసంతో ఉంటాయి. అయితే కొన్నిసార్లు అడవుల్లోని జంతువులు రాత్రి పూట అడవికి దగ్గరగా ఉండే ప్రదేశాల్లోకి రాత్రి పూట వస్తాయి. ఒక గున్న ఏనుగు తల్లి ఏనుగుతో పాటు అడవి నుంచి బైటకు వచ్చింది.అప్పుడు అది చాలా నవ్వులు తెప్పించేదిలా ప్రవర్తించింది.
అడవిలో నుంచి ఒక గున్న ఏనుగు తన తల్లితో పాటు బైటకు వచ్చింది. రోడ్డు దాటి దగ్గరలో ఉన్న ఒక ఇంటి వద్దకు వెళ్లింది. అక్కడ బైక్ పార్క్ చేసి ఉంది. ఇంతలో గున్న ఏనుగు ఆ హెల్మెట్ తీసుకుని ఫుట్ బాల్ ఆడింది. అది చూసిన తల్లి ఏనుగు దాని వెనుకాలే వచ్చింది. కింద పడ్డహెల్మెట్ తీసుకుని మరల బైక్ మీద పెట్టింది.
ఆ తర్వాత తన గున్నఏనుగును వారించినట్లు దాని హావా భావాలు ఉన్నాయి. ఈ ఘటన అక్కడ అమర్చిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మలున్నారే.. పిల్లల్ని ఎప్పుడు ఆడుకొనివ్వరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.