• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /బ్యాంకింగ్ రంగంలో గందరగోళం.. యూనియన్ల ప్రధాన డిమాండ్లు ఇవే.. కస్టమర్లకు ఊరట ఇచ్చే వార్త!

బ్యాంకింగ్ రంగంలో గందరగోళం.. యూనియన్ల ప్రధాన డిమాండ్లు ఇవే.. కస్టమర్లకు ఊరట ఇచ్చే వార్త!

యూనైటెడ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్, కేంద్ర ప్రభుత్వ మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో, ఈ నెల 28, 29, 30 తేదీల్లో బ్యాంకులు వరుసగా మూసివేయబడతాయి. అయితే, ఈసారి ఆదివారం (27వ తేదీ) అన్ని బ్యాంక్ బ్రాంచీలు పనిచేస్తాయి. ప్రధానంగా వారానికి ఐదు పని దినాలు కావాలన్న డిమాండ్‌తో బ్యాంక్ ఉద్యోగులు ఈ సమ్మె చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Sep 26, 2026, 06:42 AM IST|Updated: Sep 26, 2026, 06:44 AM IST
joinshare
బ్యాంకింగ్ రంగంలో గందరగోళం.. యూనియన్ల ప్రధాన డిమాండ్లు ఇవే.. కస్టమర్లకు ఊరట ఇచ్చే వార్త!
Image Credit: Bank Strike Reasons

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bank Strike Reasons: మీరు డబ్బు డిపాజిట్ చేయాలన్నా లేదా విత్ డ్రా చేయాలన్నా, ఈ నెల చివరి వారంలో బ్యాంకులు బంద్ ఉండనున్నందున ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో బ్యాంకుల సమ్మె కొనసాగుతుంది. వారానికి ఐదు పని దినాలు కావాలని, ఇతర డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

వారానికి ఆరు రోజులు పని చేయడం వల్ల తాము తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నామని, కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. ఐదు రోజులు పని దినాలుగా మారుస్తామంటే పని గంటలు తగ్గవని, ఏడాదికి అదనంగా 17 గంటల 20 నిమిషాలు పని చేయాల్సి వస్తుందని కూడా వారు వాదిస్తున్నారు. ఇప్పటికే రెండో, నాలుగో శనివారాలు సెలవుల్లో ఉన్నాయని, మళ్ళీ ఈ డిమాండ్ ఎందుకు అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు, పని దినాలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంపై అసలు చర్చలే జరగలేదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. పర్ఫామెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ పక్కన పెట్టడం, ఫ్యామిలీ పెన్షన్ వంటి డిమాండ్లను అంగీకరించినట్లు పేర్కొన్నప్పటికీ, పని దినాల విషయంలో బ్యాంకులు నిరసన తెలుపుతున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా సెప్టెంబర్ 28 నుండి 30 వరకు జరిగే ఈ సమ్మెలో, సుమారు 8 లక్షల మంది ఉద్యోగుల ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు బ్యాంక్ యూనియన్ల ఉమ్మడి సంస్థ అయిన యూఎన్‌బీయూ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతున్నాయి.

బ్యాంకు ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు:
- వారానికి ఐదు పని దినాలు అమలు చేయడం (ప్రతి శని, ఆదివారాలు సెలవు).
- ఉద్యోగుల పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకంలో (Performance Linked Incentive) మార్పులు చేయడం.
- ప్రభుత్వం ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు బ్యాంక్ ఉద్యోగులతో చర్చలు జరపాలి.
- పెండింగ్‌లో ఉన్న పాత డిమాండ్ల పరిష్కారం.

సెప్టెంబర్ 28 నుండి వరుసగా బ్యాంకులు బంద్ ఉంటాయి కాబట్టి, మీ బ్యాంకింగ్ పనులను ముందే పూర్తి చేసుకోండి. సాధారణంగా ఆదివారాల్లో బ్యాంకులు మూసివేస్తారు, కానీ ఈసారి సమ్మె కారణంగా సెప్టెంబర్ 27న బ్యాంకులు తెరిచి ఉంటాయి. సమ్మె వల్ల వినియోగదారులపై ప్రభావం పడవచ్చు, కాబట్టి ముందుగానే జాగ్రత్త వహించండి. రేపు ఒక్క రోజు ఏవైనా బ్యాంకు లావాదేవీలు ఉంటే చూసుకోండి.

ఈ సమ్మె వల్ల నగదు విత్ డ్రా, డిపాజిట్లు, పాస్‌బుక్ అప్‌డేట్ వంటి సేవలకు ప్రభావం ఉండవచ్చు. అయితే, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి.
మరోవైపు, ఐదు రోజుల పని దినాలపై చర్చలు జరుగుతున్నాయని, పరిశీలనలు పూర్తయ్యాక సంబంధిత వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని, ఏటీఎంలలో తగినంత నగదు ఉండేలా చూసుకోవాలని బ్యాంకుల ఆదేశించింది

Add Zee News as a Preferred Source
TAGS:
Bank Holiday