Cyberabad Police key advices to families on dasara and bathukamma: రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా పండగ శోభ కన్పిస్తుంది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. దీంతో చాలా మంది తమ సొంతూర్ల బాటపట్టారు. ఇప్పటికే ప్రయాణికులతో బస్ స్టేషన్లు, రైల్వేలు, రోడ్లన్ని ట్రాఫిక్ తో కిట కిట లాడుతున్నాయి.
చాలా మంది దసరా సెలవులలో తమ సొంతూర్లకు లేదా బంధువుల ఇంటికి లేదా టూర్లకు ప్లాన్ లు చేస్తారు. అయితే.. ఇదే అదనుగా భావించిన దొంగలు తమ చేతివాటం చూపిస్తారు. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులు ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది.
ముఖ్యంగా ఇంటికి తాళం వేసుకుని వెళ్లే వారు దగ్గరలోని పోలీస్ స్టేషన్ లలో సమాచారం ఇవ్వాలని కోరారు. అంతే కాకుండా బంగారం, డబ్బులను ఇంట్లో పెట్టకుండా లాకర్ లో పెట్టుకొవాలని సూచించారు. పిల్లలను రద్దీగా ఉండే ప్రదేశాల్లో జాగ్రత్తగా చూసుకొవాలని సూచించారు.
ఇక వాహనాలను చైన్ లతో, ఇంటి తాళాలు సెంట్రలైజ్ గా ఉండేలా చూసుకొవాలని చెప్పుకొచ్చారు. ఎక్కడైన అనుమానితులు కన్పిస్తే వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు.