Bihar School Teacher Viral Video: సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులే దారితప్పి పోతున్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పాల్సిన కొందరు టీచర్లు.. ఏకంగా పాఠశాల్లోనే అత్యంత అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వివాదాలకు కేరఫ్ అడ్రెస్‌గా మారుతున్నారు. తాజాగా బీహార్ రాష్ట్రంలోని జెహానాబాద్ జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా ఆ ఉపాధ్యాయుల రొమాన్స్‌కి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. స్కూల్ లోపల ఒక మహిళా ఉపాధ్యాయురాలు తన తోటి ఉపాధ్యాయుడి ఒడిలో కూర్చుని ఉండటం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. బడి సమయంలోనే.. ఎటువంటి భయం లేకుండా వారు ప్రవర్తించిన తీరు చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న ఎవరో తమ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.. దేవాలయంతో సమానమైన పాఠశాలలో ఇలాంటి దిగజారుడు పనులు చేయడమేంటని పలువురు మండి పడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు చెప్పాల్సింది పోయి.. ఇలా చేయడంతో ఈ ఘటన పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తూ వస్తోంది.. ఉపాధ్యాయులే ఇలా ఉంటే.. ఇక వారి దగ్గర చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు ఏంటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో విద్యాశాఖ అధికారుల తీరుపై చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే కొందరు ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి.. బాధ్యులైన ఆ ఇద్దరు ఉపాధ్యాయులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని స్థానికులతో పాటు విద్యావేత్తలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. భవిష్యత్తులో మరే పాఠశాలలోనూ ఇటువంటి సంఘటనలు జరకుండా అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.