• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Road Accident: ఏపీలో ఘోర ప్రమాదాలు- 8 మంది మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Road Accident: ఏపీలో ఘోర ప్రమాదాలు- 8 మంది మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

CM Chandrababu Deep Condolence About Massive Road Accidents: ఆంధ్రప్రదేశ్‌లో రహదారులు రక్తమోడాయి. చలికాలం కావడంతో మంచు కౌగిలిలో ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో 8 మంది మృతి చెందడడంతో పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఘోర రోడ్డు ప్రమాదాలపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 24, 2026, 16:23 IST|Updated: Nov 24, 2026, 16:29 IST
joinshare
Road Accident: ఏపీలో ఘోర ప్రమాదాలు- 8 మంది మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Image Credit: Chandrababu

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఈ 4 సెట్టింగ్స్ మార్చండి.. కన్ఫామ్‌గా వస్తుంది!

రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఈ 4 సెట్టింగ్స్ మార్చండి.. కన్ఫామ్‌గా వస్తుంది!

2

Karnataka: బెంగళూరులో ఘోరం.. లాడ్జీలో ప్రియుడితో గొడవ.. మూడో అంతస్తునుంచి పడి యువతి మృతి..

3

ఆడేవడన్న.. ఈడేవడన్న.. వైభవ్ సూర్యవంశీకి అడ్డవేడన్న.. 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ..!

4

Vaibhav Sooryavanshi: బుడ్డోడు చితక్కొట్టాడు.. 28 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డు..!

5

Road Accident: ఏపీలో ఘోర ప్రమాదాలు- 8 మంది మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AP Road Accidents: ఆంధ్రప్రదేశ్‌లో తెల్లవారితే చాలు ఘోర ప్రమాదాల వార్తతో నిద్రలేవాల్సి వస్తోంది. రాష్ట్రం నలుమూలలా ఘోర ప్రమాదాలు సంభవిస్తుండడంతో అమాయకులైన ప్రజలు రోడ్డుకు బలి అవుతున్నారు. మంగళవారం ఒక్కరోజే వేర్వేరే చోట్ల జరిగిన ప్రమాదాల్లో 8 మంది మృతి చెందారు. ఇది అధికారికంగా వచ్చిన సమాచారం. అంతేకాకుండా మొత్తం ప్రమాదాల్లో దాదాపు 12 మందికి పైగా మృతి చెంది ఉంటారని తెలుస్తోంది. ఈ ప్రమాదాలు పలువురి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ప్రమాదాలపై స్పందించిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదాలకు గల కారణాలు తెలుసుకుని మృతుల కుటుంబాలకు.. క్షతగాత్రులకు అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. ఈ ప్రమాదాల్లో విజయనగరం, విశాఖపట్నం, పల్నాడు జిల్లాల్లో 8 మంది చనిపోయినట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.

భోగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం సంభవించిందని.. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న వాహనం, రహదారి పక్కన నిలిపి ఉన్న ట్యాంకర్‌ను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టిందని వివరించారు. వాహనం నడుపుతున్న డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

ఇక విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలో మరో ప్రమాదం చోటు చేసుకుందని.. ఈ ఘటనలో ఇద్దరూ సజీవ దహనమయ్యారని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. బాటజంగాలపాలెం టోల్‌గేట్ వద్ద ఉదయం రోడ్డు ప్రమాదం జరగడంతో మంటలు చెలరేగి లారీ క్యాబిన్‌లో డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ చిక్కుకుని బయటకు రాలేక సజీవ దహనమయ్యారని అధికారులు వివరించడంతో సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప స్వాములు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని కూడా అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. క్రోసూరుకు చెందిన ముగ్గురు అయ్యప్ప మాలధారులు అమరావతిలో దర్శనం ముగించుకుని కారులో తిరిగి వస్తుండగా ప్రమాదం సంభవించిందని తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లడంతో స్వాములు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లిందని ముఖ్యమంత్రికి నివేదించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు స్వాములు మృతిచెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారని అతడిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు వివరించారు.

8 మంది ప్రాణాలు బలిగొన్న ఈ మూడు రోడ్డు ప్రమాద ఘటనలపై సంబంధిత జిల్లాల అధికారులు, పోలీస్, రవాణా శాఖ అధికారులు సమీక్షించాక కారణాలను విశ్లేషించి నివారణా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. ప్రమాదాల కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Crime News
Chandrababu Naidu
AP News
Telugu News