SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

గ్రామస్తులకు అడ్డంగా దొరికిన మైనర్ జంట.. పంచాయితీలో వారు ఏం చేశారంటే?

Bihar Viral Love Story: బీహార్‌లోని ఓ ప్రాంతంలో మైనర్ బాలుడు, బాలిక పట్టుబడ్డారు. అయితే, వారిని పట్టుకున్న గ్రామస్తులు గట్టిగా అడగడంతో వారు ప్రేమించుకుంటున్నారని స్పష్టం చేశారు. వారు మైనర్లు కావడంతో పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు.. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 11, 2026, 04:03 PM IST | Updated: Nov 11, 2026, 04:06 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Bihar Viral Love Story: బీహార్‌లోని నవాదా జిల్లాలో ఓ వింత ప్రేమ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్న మైనర్ బాలబాలికలు స్థానికులకు ఏకాంతంగా ఓ ఇంట్లో పట్టుబడ్డారు.. ఆ తర్వాత పంచాయితీ పెద్దలు, గ్రామస్తుల ఎదుట జరిగిన పరిణామాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. అసలు ఈ ఘటన ఏంటి? దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాదా పరిసర ప్రాంతానికి చెందిన మైనర్ బాలుడు, బాలిక కొన్నాళ్లుగా ప్రాణంగా ప్రేమించుకుంటున్నారట.. వీరిద్దరూ రహస్యంగా కలుసుకున్న సమయంలో స్థానికులు గమనించి పట్టుకున్నారట.. అనంతరం ఇరు కుటుంబాలకు సమాచారం అందించి.. వారిద్దరినీ గ్రామ నడిబొడ్డుకు తీసుకొచ్చి.. గ్రామ పంచాయితీ నిర్వహించారట.. గ్రామస్తులు, పెద్దమనుషులు వారిని నిలదీసి మందలించే ప్రయత్నం కూడా చేశారట..

అయితే, అక్కడ జరిగిన పరిణామం ఊహించని మలుపు తిరిగిందని స్థానికులు తెలుపుతున్నారు.. బాలుడితో పాటు బాలిక ఇద్దరూ ఏమాత్రం భయపడకుండా.. తమ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తుల ముందే తాము ఒకరినొకరు ఇష్టపడుతున్నామని.. పెళ్లి చేసుకుంటామని ఏమాత్రం భయపడకుండా.. తేల్చి చెప్పారట.. ముఖ్యంగా ఆ బాలుడు చూడడానికి అందంగా లేకపోయి.. శారీరక తీరు అక్కడ ఉన్నవారి దృష్టిని ఆకర్షించడంతో తీవ్ర చర్చకు దారితీసినట్లు తెలుస్తోంది.. ఆ బాలుడి రూపంపై గ్రామస్తులు పలు రకాల విమర్శలు చేస్తూ.. పెళ్లిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట.. కొందరు హేళనగా మాట్లాడినా.. మరికొందరు ఆగ్రహంతో అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఊరంతా బాలుడి రంగు, రూపాన్ని చూసి.. వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ఆ బాలిక మాత్రం తన నిర్ణయంపై ఏమాత్రం వెనక్కి తగ్గలేదట.. సమాజపు మాటలతో పాటు కుటుంబ సభ్యుల అసహనానికి భయపడకుండా.. ముఖంపై చిరునవ్వుతో తన ప్రియుడి పక్షానే నిలబడింది. రూపంతో నాకు పనిలేదు.. అతడే నా సర్వస్వం.. అన్నట్లుగా ఆమె ప్రదర్శించిన ధైర్యం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారట..మైనర్ల వ్యవహారం కావడంతో పాటు చట్టపరంగా వారికి పెళ్లి వయస్సు రాలేదని కొందరు పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారట.. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలతో పాటు ఫోటోలు కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES