• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /వర్కింగ్ మదర్స్, ఉమెన్స్ కోసం స్పెషల్ హెల్త్ టిప్.. బార్లీ పాయసంతో మానసిక ఒత్తిడికి చెక్..!!

వర్కింగ్ మదర్స్, ఉమెన్స్ కోసం స్పెషల్ హెల్త్ టిప్.. బార్లీ పాయసంతో మానసిక ఒత్తిడికి చెక్..!!

Barley Kheer: ప్రస్తుత ఆధునిక కాలంలో మహిళలు ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

Written ByBhoomi
Published: Nov 11, 2026, 05:12 PM IST|Updated: Nov 11, 2026, 05:14 PM IST
joinshare
వర్కింగ్ మదర్స్, ఉమెన్స్ కోసం స్పెషల్ హెల్త్ టిప్.. బార్లీ పాయసంతో మానసిక ఒత్తిడికి చెక్..!!
Image Credit: Healthy Recipes:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Hardik Pandya: 'నా కెప్టెన్ శ్రేయస్.. నా టీమ్ పంజాబ్..' హార్దిక్ పాండ్యా ఫస్ట్ రియాక్షన్..!

Hardik Pandya: 'నా కెప్టెన్ శ్రేయస్.. నా టీమ్ పంజాబ్..' హార్దిక్ పాండ్యా ఫస్ట్ రియాక్షన్..!

2

వర్కింగ్ మదర్స్, ఉమెన్స్ కోసం స్పెషల్ హెల్త్ టిప్.. బార్లీ పాయసంతో మానసిక ఒత్తిడికి చెక్..!!

3

అర్ధరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన యువకుడు.. చివరకు పెళ్లి.. ఆ తర్వాత మరో ట్విస్ట్!

4

ఇవ్వడానికి ఏం లేదు.. విద్యను మాత్రమే అందించగలను: సీఎం రేవంత్

5

ఇంట్లో ఎన్ని కిటికీలు ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందో తెలుసా? ఈ నియమాలు తెలుసుకోండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Barley Kheer: ప్రస్తుత ఆధునిక కాలంలో మహిళలు ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే, ఈ బిజీ లైఫ్‌స్టైల్, ఆఫీస్ టెన్షన్స్, ఇంటి పనుల వల్ల చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ తీవ్రమైన మానసిక ఒత్తిడి, అలసటను ఎదుర్కొంటున్నారు. నిత్యం ఉరుకులు పరుగుల జీవితంతో సతమతమయ్యే మహిళల ఆరోగ్యం కోసం ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మానసిక ప్రశాంతతను చేకూర్చి, శరీరాన్ని రిలాక్స్ చేసే ఆరోగ్యకరమైన ఆహారాల్లో బార్లీ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

పాతకాలంలో నీరసంగా ఉన్నప్పుడు బార్లీ గిన్నెడు తినేవాళ్లు. ఇది మానసిక ఒత్తిడితోపాటు ఆందోళన తగ్గించడంలోనూ ఎంతో సహాయపడుతుంది.

బార్లీ పాయసం ఎలా తయారు చేస్తారు.. కావాల్సిన పదార్థాలు ఏవో చూద్దాం.

-1 కప్పు బార్లీ 
-నీరు 2 కప్పులు  
-బెల్లం పొడి 1 కప్పు 
-అర లీటర్ కొబ్బరి పాలు 
-అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి
-6 నుండి 8 పచ్చి యాలకులు
-రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి 
-ఎండుద్రాక్షలు గుప్పెడు 
-జీడిపప్పు 
-నట్స్ కూడా వేస్తే పాయసానికి మంచి రుచి వస్తుంది.

తయారీ విధానం:

బార్లీ సిద్ధం చేయడం: 
ముందుగా బార్లీని తీసుకుని శుభ్రంగా కడిగి నీటిని వడకట్టాలి. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో 2 కప్పుల నీరు పోసి, బార్లీ బాగా మెత్తగా ఉడికే వరకు 4 నుండి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఆపై కుక్కర్‌లో ప్రెషర్ పూర్తిగా పోయే వరకు అలాగే ఉంచాలి.

బెల్లం కలపడం: 
ఇప్పుడు ఉడికించిన బార్లీలో తగినంత బెల్లం పొడి వేసి బాగా కలపాలి. బెల్లం పూర్తిగా కరిగే వరకు మీడియం మంటపై కలుపుతూ, ఆ తర్వాత సన్నని మంటపై మరో 2 నిమిషాలు ఉడికించాలి.

కొబ్బరి పాలు, యాలకుల పొడి: 
ఆ తర్వాత మంట తగ్గించి, అందులో కొబ్బరి పాలు, పచ్చి యాలకుల పొడి వేసి మంచిగా కలపాలి. దీనిని మీడియం మంటపై సుమారు 10 నిమిషాల పాటు మెల్లగా ఉడకనివ్వాలి.

 చివరగా, ఒక చిన్న పాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి, అందులో నాలుగు జీడిపప్పులు, ఎండుద్రాక్షలను వేసి దోరగా వేయించి పాయసంలో కలుపుకుంటే కమ్మనైన బార్లీ పాయసం రెడీ. 
 

Also Read: 

 

 

వైట్‌కాలర్‌ ఉద్యోగాలకు AI పెద్ద ముప్పు.. బ్లూకాలర్‌కే ఢోకా లేదు: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Health
Telugu News