SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నేడు శత వసంతంలోకి బీజేపీ కురువృద్దుడు అద్వానీ .. ప్రధాని సహా పలువురి శుభాకాంక్షలు..

BJP Senior Leader LK Advani Enters100 years: ఎల్ కే అద్వానీ ఇది రాజకీయాల్లో ఓ సునామి. దేశ రాజకీయాలను మలుపు తిప్పిన పేరు. అంతేకాదు దేశ రాజకీయ దశా, దిశను మార్చిన పేరు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం రామ రథయాత్రతో ఈయన చేపట్టిన యాత్రకు దేశం మొత్తం కదిలొచ్చింది. అంతేకాదు దేశంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా బీజేపీనీ తీర్చిదిద్దడంలో ఈయన పాత్రను కాదనలేము. ఈ రోజు శత వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈయనకు ఆయన ప్రధాన శిష్యుడు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు సామాజిక మాధ్యమాల వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 08, 2026, 11:49 AM IST | Updated: Nov 08, 2026, 12:08 PM IST
Image Credit: LK Advani Birthday Wishes (X/Source)
Join

PM Narendra Modi Wishes to his Guruvu LK Advani: పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ కంటే ఎల్.కే. అద్వానీగా దేశ ప్రజలకు సుపరిచితుడయ్యారు. నేడు బీజేపీ ఉచ్చ దశలో ఉందంటే ఆయన గ్రౌండ్ లెవల్లో చేసిన పునాదులే నేడు బీజేపీ దేశ వ్యాప్తంగా విస్తరించగలిగింది. అంతేకాదు వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారంలో వచ్చిందంటే ఆయన నేర్పిన విలువలే ఆ పార్టీకి శ్రీరామరక్షగా నిలిచాయి.


సరిగ్గా ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్)పుట్టిన యేడాది తర్వాత అప్పటి సింధ్ రాష్ట్రం(పాకిస్థాన్)లో పుట్టారు. భారతీయ జనతా పార్టీ పూర్వ రూపం జనసంఘ్ ఈ యేడాది 75 వసంతంలోకి అడుగుపెట్టింది. అంతేకాదు బీజేపీ పూర్వ రూపం జన సంఘ్ స్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ  125వ జయంతి వేళలో ఈయన శత వసంతంలోకి అడుగుపెట్టారు.  దేశ విభజన తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన పుట్టిన ప్రదేశాన్ని ఒదిలి బాంబే స్టేట్‌ (ప్రస్తుతం గుజరాత్)కు వారి కుటుంబం వలస వచ్చింది. సరిగ్గా 100 యేళ్ల క్రితం 1927 నవంబర్ 8న దీపావళి రోజున జన్మించడం యాదృచ్ఛికం అని చెప్పాలి. సరిగ్గా వందేళ్ల పుట్టినరోజున అడుగుపెట్టిన ఈ రోజు కూడా దీపావళి పర్వదినం కావడం విశేషం.

ఆయన పుట్టినరోజు సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సహా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా  పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

 

బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు.. 

ఆ తర్వాత 1982లో బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. అంతేకాదు వాజ్ పేయ్ తర్వాత భారతీయ జనతా పార్టీ రెండో జాతీయ అధ్యక్షుడిగా 1986 నుంచి 1991 వరకు పనిచేశారు. ఆ తర్వాత 1993- 1998 వరకు జాతీయ అధ్యక్షుడిగా.. ఆపై 2004 నుంచి 2005 వరకు భారతీయ జనతాపార్టీకి మూడు సార్లు జాతీయ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన ఘతన ఈయనకే దక్కింది. అంతేకాదు ఈయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ ఇంతింతై అన్నట్టుగా ఎదిగింది. 1989లో ఆయన అధ్యక్ష పీఠం ఉన్న సమయంలోనే కాంగ్రెస్ బలం 400 నుంచి 200 కు పడిపోయింది. 1996లో బీజేపీ దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పై 1998, 1999లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాజ్ పేయి మంత్రివర్గంలో హోం మంత్రిగా.. డిప్యూటీ ప్రైమ్ మినిష్టర్‌గా పనిచేశారు. అంతకు ముందు మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను నిర్వహించారు.  2004,2009లో ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ఎన్నికలకు వెళ్లిన బీజేపీ.. అధికారంలోకి రాలేకపోయింది. ఆ తర్వాత నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక ప్రధాన మంత్రి  కావాలన్న కల కల్లగా మిగిలిపోయింది. అటు రాష్ట్రపతి కల కూడా నెరవేరలేదు. కానీ కేంద్రం ఆయన సేవలను గుర్తించి భారతరత్నతో గౌరవించింది.     
 

దేశ రాజకీయాలను మలుపు తిప్పిన అయోధ్య రథయాత్ర.. 

1989లో జూన్‌లో హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన పాలంపూర్‌లో జరిగిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అయోధ్యలో రామ మందిర ఉద్యమానికి మద్దతు పలికింది. ఆ తర్వాత బీజేపీ తన మేనిఫెస్టోలో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి చోటు దక్కింది. ఆ తర్వాత 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 85 సీట్లు దక్కించుకుంది. అంతకు ముందు బీజేపీకి పార్లమెంటులో ఉన్న స్థానాల సంఖ్య 2 మాత్రమే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 197 సీట్లు గెలుచుకుంది. అటు జనతాదళ్ 143 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బీజేపీ, వామపక్షాలు బయట నుంచి ఇచ్చిన మద్ధతుతో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నేషనల్ ఫ్రంట్ పేరుతో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఇక అద్వానీ జీవనంలో అయోధ్య రథయాత్రకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అక్టోబర్ 30న అయోధ్యలో వీహెచ్‌పీ తలపెట్టిన కార్యక్రమానికి బీజేపీ తన వంతు మద్దతు ప్రకటించంది.  అప్పుడు గుజరాత్‌లోని సోమనాథ్‌ నుంచి అయోధ్యకు పాదయాత్ర చేయాలని సంకల్పించారు. కానీ అప్పటి బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రమోద్ మహాజన్ చేసిన సూచన మేరకు రథయాత్ర చేయాలని సంకల్పించారు. రామ మందిర నిర్మాణం కోసం తలపెట్టిన ఈ యాత్రకు పవిత్రమైన రథయాత్ర పేరు పెట్టారు. సెప్టెంబర్ 12న 1990 రథయాత్రపై ప్రకటన చేసారు. సెప్టెంబర్ 25 దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజున సోమనాథ్ నుంచి ఈ యాత్రను మొదలుపెట్టారు. అక్టోబర్ 30న అయోధ్యకు ఈ రథయాత్రకు చేరుకోవాలని రూట్ మ్యాప్ సిద్దం చేసుకున్నారు.

సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర.. 

అద్వానీ ఈ రథయాత్ర కోసం సోమనాథ్ ను ఎంచుకోవడం వెనక పెద్ద రీజనే ఉంది. ఇక్కడ వెలిసిన జ్యోతిర్లింగ ఆలయంపై లెక్కలేనన్ని సార్లు దండయాత్రలు జరిగాయి. మహమ్మద్ గజనీ, అల్లావుద్దీన్ ఖీల్జీ సహా ఎందరో ముష్కరులు సోమనాథ్ ఆలయాన్ని కొల్లగొట్టి ధ్వంసం చేసారు. ఆ తర్వాత అహల్య బాయి హోల్కర్ సహకారంతో అక్కడ మళ్లీ ఆలయాన్ని పునరిద్దరించారు.  ఆ తర్వాత మళ్లీ ధ్వంసం అయింది. ఇక స్వాతంత్య్రం తర్వాత అప్పటి కేంద్ర మంత్రి కే.ఎం.మున్షీ ఇక్కడ ఆలయాన్ని పునరిద్దించారు. దానికి అప్పటి కేంద్ర హోం  మంత్రి సర్ధార్ వల్లభబాయ్ పటేల్ సహాయ సహకారాలు అందించారు. ఆయన సహకారంతో సోమనాథ్ ఆలయం పునర్నించబడింది. ఆ ఆలయ స్పూర్తితో అయోధ్యలో ఆలయ నిర్మాణం జరగాలని అద్వానీ తలపెట్టారు. 

1990 సెప్టెంబర్ 25వ తేదిన సోమనాథ్‌లోని జోత్యర్లింగానికి పూజల తర్వాత అద్వానీ రథయాత్ర మొదలైంది. ఈ యాత్రలో ఆయన వెంట ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెన్నంటే ఉన్నారు. గుజరాత్ లోని 300 కిలోమీటర్ల చొప్పున 600 పైగా గ్రామాల్లో ఈ రథయాత్ర కొనసాగింది. అప్పట్లో అద్వానీ ప్రసంగం వినడానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చేవారు. అప్పట్లో రోజుకు 25 నుంచి 30 ప్రసంగాలు చేసేవారు. ఆ తర్వాత సమస్తిపూర్‌లో అద్వానీని లాల్ ప్రసాద్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం సహా పలు ఘటనలు దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES