• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ముంబైలో దావూద్ ఇబ్రహీం ఆనవాళ్లు కనుమరుగు.. బుల్డోజర్స్‌తో దుర్మార్గుడి ఇల్లు నేలమట్టం..

ముంబైలో దావూద్ ఇబ్రహీం ఆనవాళ్లు కనుమరుగు.. బుల్డోజర్స్‌తో దుర్మార్గుడి ఇల్లు నేలమట్టం..

Dawood Ibrahim: కరుడు గట్టిన ఉగ్రవాది ఇండియా మోస్ట్ వాంటెడ్ అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూడ్ ఇబ్రహీంకు మహారాష్ట్ర సర్కార్ ఊహించని షాక్‌ ఇచ్చింది. ముంబై లో తరతరాలుగా అతనికి వారసత్త్వంగా సంక్రమించిన ఇంటిని బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ పునాదులతో సహా నేలమట్టం చేసింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 21, 2026, 13:36 IST|Updated: Nov 21, 2026, 13:42 IST
joinshare
ముంబైలో దావూద్ ఇబ్రహీం ఆనవాళ్లు కనుమరుగు.. బుల్డోజర్స్‌తో దుర్మార్గుడి ఇల్లు నేలమట్టం..
Image Credit: Dawood Ibrahim House (Source/ZEE Telugu News)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Dawood Ibrahim House Buldozers: ఒకపుడు ముంబై డాన్‌ గా చక్రం తిప్పిన దావూద్‌ ఇబ్రహీంకు ముంబైలో నిలువనీడ లేకుండా చేసింది దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్. బాలీవుడ్‌లో ఎవరు నటించాలి.. ఎవరు నటించకూడదు.. ఎవరికీ ఛాన్సులు ఇవ్వాలి.. ఇవ్వకూడదనే ఎక్కడో ఉండి హిందీ చిత్ర పరిశ్రమను వణికించాడు. ఒకపుడు ఆయన ఫైనాన్స్‌తో రన్ అయిన బాలీవుడ్ ఫైనాన్స్ మాఫియా.. కేంద్రంలో మోడీ సర్కారు వచ్చిన తర్వాత పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తాజాగా ముంబైలో పురాతనమైన ఆయన బిల్డింగ్‌ను ప్రభుత్వం నేలమట్టం చేసింది.  ఇంతకీ ముంబైలో దావూద్  ఇల్లు ఎక్కడుంది? ముంబై పేలుళ్ళలో ఆ ఇంటి పాత్ర ఏంటి..? బిల్డింగ్‌ను కాపాడుకునేందుకు దావూద్‌  వేసిన స్కెచ్‌ ఏమిటనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

అండర్‌ వరల్డ్‌  డాన్‌ దావుద్‌ ఇబ్రహీంకు ముంబై సర్కార్‌ షాక్‌.. 
ముంబై అండర్ వరల్డ్ డాన్‌  దావూద్ ఇబ్రహీం ఇంటిని బృహన్ ముంబై కార్పోరేషన్  నేలమట్టం చేసింది.  భేండీ బజార్ లోని ఇంటిని పునాదులతో సహా  కూల్చేశారు.  జేసీబీలతో కూల్చివేత పనులు చేపట్టింది బీఎంసీ అధికారులు. హాజీ ఇస్మాయిల్ హాజీ హబీబ్ ముసాఫిర్ ఖాన్ గా పిలువబడే 162 ఏళ్ల నాటి ఈ ఇంటిలో దావూద్ ఇబ్రహీం పూర్వీకులు నివసించారు. కూల్చివేతల క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తుగా గట్టి భద్రతను పెంచారు. స్థానికుల నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టారు.


ఇంటిని  పునాదులతో సహా తీసి నేల మట్టం చేసిన BMC..
దావూద్ ఇబ్రహీం భారత్‌ను విడిచి వెళ్లడానికి ముందు ఈ భవనాన్ని తన చివరి నివాసం, ఆఫీసుగా  ఉపయోగించేవారు.  1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కుట్రతోనూ ఈ భవంతికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు తర్వాత దీనిని  టాడా కోర్టు తన ఆధీనంలోకి తీసుకుంది. 1864లో ప్రయాణికులకు వసతి కల్పించేందుకు ముసాఫిర్‌ఖానాగా నిర్మించిన ఈ భవనంలో మొదట 36 దుకాణాలు, గోడౌన్లు ఉండేవి. కాలక్రమేణా ప్రయాణికుల రాక తగ్గడంతో పై అంతస్తుల్లోని గదులను నివాసాలుగా అద్దెకిచ్చారు. రెండో అంతస్తును దావూద్ ఇబ్రహీం అక్రమంగా ఆక్రమించుకున్నట్లు వక్ఫ్ బోర్డుకు సమర్పించిన అఫిడవిట్‌లో చెప్పారు. అనంతరం భవనం పునరాభివృద్ధి కోసం సైఫీ బుర్హానీ అప్‌లిఫ్ట్‌మెంట్ ట్రస్ట్‌కు విక్రయించినట్లు సమాచారం.

దావూద్ ఇబ్రహీం కస్కర్ మొదట్లో తన తల్లిదండ్రులు హెడ్ కానిస్టేబుల్ ఇబ్రహీం కస్కర్, అమీనా బీ, తన తోబుట్టువులతో కలిసి ముసాఫిర్‌ఖానా రెండో అంతస్తులో నివసించేవాడు. 1970వ దశకం చివరలో, 1980లలో ముంబయి అండర్‌ వరల్డ్‌లో దావూద్ ఇబ్రహీం ప్రాబల్యం పెరగడంతో, అద్దె ఒప్పందం కాస్తా కనుమరుగైంది. అతను ఆ భవనాన్ని కబ్జా చేసి రెండో అంతస్తు మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. హాజీ ఇస్మాయిల్ హాజీ హబీబ్ ముసాఫిర్‌ఖానా ట్రస్ట్‌కు చెందిన ఈ యాత్రికుల విడిది అతడి నివాసంగా, కార్యాలయంగా, అప్రకటిత ప్రధాన కార్యాలయంగా మారిపోయింది.

అక్రమంగా ఇంటిని ఆక్రమించుకున్న దావూద్ కుటుంబీకులు.. 
ఈ స్థలంపై దావూద్‌కు ఎలాంటి హక్కు ఉన్నట్లు ఎలాంటి పత్రాలూ లభించలేదు. దావూద్ ఇబ్రహీంకు గానీ, కస్కర్ కుటుంబంలోని ఏ ఒక్కరికి గానీ ఈ ఆస్తిపై కనీస రిజిస్ట్రేషన్ గానీ, యాజమాన్య హక్కుల ఆధారాలు గానీ లేవని ప్రభుత్వ సంస్థల రికార్డులు, న్యాయపత్రాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని 32 వాణిజ్య దుకాణాలు, పై అంతస్తులలోని 19 నివాస గదులు సాధారణ అద్దెదారులు, దుకాణదారుల ఆధీనంలో ఉండగానే, కేవలం ఆక్రమణ బలంతోనే ఈ ముఠా పక్మోడియా స్ట్రీట్ నుంచి చక్రం తిప్పింది. స్మగ్లింగ్ వస్తువులను దాచడానికి కూడా ఈ భవనాన్ని ఉపయోగించేవారు.

ముంబై భేండీ బజార్ లో అండర్ వరల్డ్ డాన్‌ దావూద్‌ ఆక్రమించుకున్న ఇల్లు..

1986లో దావూద్ ఇబ్రహీం భారత్ విడిచి పారిపోయిన తర్వాత కూడా అతడి అనుచరులు ఈ భవనంలో చురుకుగా ఉండేవారు. ఆ తర్వాత 1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల కుట్ర జరిగిన ప్రధాన కేంద్రాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. 1993 పేలుళ్ల తర్వాత, కస్కర్ కుటుంబం చెర నుంచి ఈ భవనాన్ని విడిపించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దావూద్ తల్లి అమీనా బీ, ఇతర కుటుంబ సభ్యులు అక్కడే నివసిస్తూ వచ్చారు. ఆ తర్వాతి కాలంలో దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ దీనిని వినియోగించుకున్నట్లు వార్తలు వచ్చాయి. చివరకు టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ యాక్ట్  నిబంధనల కింద దావూద్ ఆధీనంలోని రెండో అంతస్తును కోర్టు జప్తు చేసింది.

ముంబైలో దావూద్‌ గుర్తులను పూర్తిగా తుడిచేసిన మహారాష్ట్ర సర్కార్‌ ..

1998, 2018 మధ్య కాలంలో స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్  కింద ఈ కుటుంబ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. అప్పనంగా వచ్చిన ఆస్తిని ఒదులుకోవడానికి ఇష్టపడని  ఈ ఉత్తర్వులపై దావూద్ తల్లి అమీనా బీ, దావూద్ సోదరి హసీనా పార్కర్ ఢిల్లీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు.  చివరకు ఏప్రిల్ 2018లో సుప్రీంకోర్టు వారి పిటిషన్‌ను కొట్టివేస్తూ, ముంబయిలోని వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు తమకు సంబంధం లేని గదుల కోసం కస్కర్ కుటుంబంతో ప్రభుత్వం పోరాడుతుండగానే, మరోవైపు ఈ భవనానికి అసలైన యజమాని అయిన 'హాజీ ఇస్మాయిల్ హాజీ హబీబ్ ముసాఫిర్‌ఖానా ట్రస్ట్' శిథిలావస్థలో ఉన్న ఈ కట్టడాన్ని రూ. 1.10 కోట్లకు 'సైఫీ బుర్హానీ అప్‌లిఫ్ట్‌మెంట్ ట్రస్ట్' కు విక్రయించేందుకు నవంబర్ 2015లో ఛారిటీ కమిషనర్ నుంచి అనుమతి పొందినట్లు బాంబే హైకోర్టు పత్రాలు చెబుతున్నాయి.


దావూద్‌ పూర్వీకులు నివసించిన భవనం కూల్చివేత ..
ఈ విక్రయంతో భవన చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. అంతేకాదు అది BMC దృష్టిని ఆకర్షించింది. నగరపాలక సంస్థ ఈ కట్టడాన్ని అత్యంత శిథిలావస్థలో ఉన్న, ప్రమాదకరమైన భవనంగా  వర్గీకరించింది. దీనిని కూల్చివేయడానికి హైకోర్టు ఆగస్టు 2020లో అనుమతి మంజూరు చేసింది. ఆ తర్వాతి కొన్నేళ్లలో, BMC అధికారులు పై అంతస్తులను ఖాళీ చేయించి, దావూద్ ఇబ్రహీం ఒకప్పుడు నివసించి, కార్యకలాపాలు సాగించిన మొదటి, రెండో అంతస్తులలోని ప్రధాన నివాస భాగాలను కూల్చివేశారు.

మిగిలిన 10 మొదటి అంతస్తు గదులతో పాటు గ్రౌండ్ ఫ్లోర్ స్థలాన్ని కూడా త్వరలోనే కూల్చివేయనున్నట్లు నవంబర్ 16న BMC నోటీసు జారీ చేసే వరకు గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఉంది. రోడ్డు విస్తరణ కోసం, ప్రమాదకర కట్టడాన్ని తొలగించడానికి ఈ కూల్చివేత అవసరమైంది. అయితే, స్థానికులు దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ, BMC పేర్కొన్నట్లు గ్రౌండ్ ఫ్లోర్ కేవలం ‘ప్రార్థనా మందిరం’ మాత్రమే కాదని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ తన నోటీసులో ఆ స్థలాన్ని ప్రార్థనా మందిరంగా పేర్కొంటూ, ప్రార్థనలు చేసుకునేవారు ప్రత్యామ్నాయ స్థలానికి వెళ్లాలని ఆదేశించింది.మొత్తంగా ఓ దుర్మార్గుడు ఆక్రమించుకొని దేశంల ప్రధాన దుర్ఘటనకు కేంద్రంగా నిలిచిన ఈ ఇంటి చరిత్ర గత చరిత్రే అనే చెప్పాలి.

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Telugu News
Crime News