Supreme Court: మీకు నచ్చితే లివింగ్ రిలేషన్, బ్రేకప్ అయితే రేప్ కేసులా..?.. సుప్రీంకోర్టు సీరియస్..
SC On kerala false promise case: ఇటివల సమాజంలో కొంత మంది యువతీ, యువకులు పరస్పరం అంగీకారంతో లివింగ్ రిలేషన్ లో కలిసి ఉంటున్నారు. ఒక వేళ ఏదైన జరిగితే బ్రేకప్ లు చెప్పుకుంటున్నారు. దీంతో కొంత మంది నచ్చని వారిపై అత్యాచారం, మోసం వంటి కేసులు కూడా పెడుతున్నారు. దీనిపై సుప్రీంకోర్టు కేరళ కేసులో ఘాటు వ్యాఖ్యలు చేసింది.
SC On Breakup can not turn as consensual intimacy: సమాజంలో కొంత మంది యువతీ, యువకులు ఎక్కువగా పాశ్చాత్త ధోరణుల్లో ప్రవర్తిస్తున్నారు. మనం ఆచారం, సంప్రదాయల్ని మంటగలిసేలా పనులు చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావంలో పడి వివాహ బంధంను అపహస్యం చేసేలా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల చాలా మంది యువతీ, యువకులు పెళ్లికాకుండానే డేటింగ్ ల పేరిట ఒకే ఇంట్లో, కనీసం కన్నవాళ్లకు తెలియకుండా లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారు. పెళ్లి చేసుకుంటామని చెప్పి ఎదుటి వారిని నమ్మించి శారీరక సంబంధం కూడా పెట్టుకుంటున్నారు. మరికొంత మంది ఒక అడుగు ముందుకేసి పెళ్లికాకుండానే పిల్లల్ని కూడా కంటున్నారు. అయితే.. వీరి మధ్య ఏదైన గొడవలు జరిగిన లేదా తాము అనుకున్న దానికి క్రమంగా ఏదైన భిన్నంగా ఉంటే వెంటనే బ్రేకప్ లు చెప్పుకుంటున్నారు.
అప్పటి వరకు తమతో సన్నిహితంగా ఉన్నవారిపై అన్నిరకాల కేసులు కూడా పెడుతున్నారు. మోసం కేసులు, అత్యాచారం కేసులు పెట్టి ఎదుటి వారిని రోడ్డున లాగుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల మరీ ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై తాజాగా.. సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం కేరళలో జరిగిన ఘటనకు చెందిన పిటిషన్ విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది.
కేరళకు చెందిన ఒక యువతి తనను స్థానికంగా ఒకవ్యక్తి పెళ్లి పేరుతో మోసం చేశాడని, అప్పటికే పెళ్లి జరిగిన విషయాన్ని దాచిపెట్టి తనతో మోస పూరిత లైంగిక సంబంధంపెట్టుకున్నాడని కేసు పెట్టింది. సదరు వ్యక్తిపై అత్యాచారం, మోసం వంటి తదితర నేరాల కింద కేసుల్ని పెట్టింది. కర్ణాటకలోని మైసూరులో వివాహం చేసుకున్న తర్వాత కూడా తనకు చెప్పకుండా.. తనతో 1996 నుండి 2003 వరకు సహజీవనం చేశారని ఆమె ఆరోపించింది. ఈ కేసు విచారణలో భాగంగా అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు వరకు చేరింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన జస్టిస్‌లు బి.వి. నాగరాత్న, ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఒక జంట మధ్య పరస్పరం అంగీకారంతో కొనసాగిన సంబంధం, బ్రేకప్ కారణంగా వివాదం తలెత్తితే దాన్ని అత్యాచారం, మోసం ముద్రవేయలేమని కోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి గౌరవాన్ని, స్వేఛ్చను హరించే విధంగా చర్యలు తీసుకొలేమని ధర్మాసనం తెల్చి చెప్పింది. ఇటీవల విఫలమైన సంబంధాలను నేర విచారణలుగా మార్చే ధోరణి బాగా పెరిగిపోయిదని ధర్మాసం ఆందోళనలు వ్యక్తం చేసింది. కేవలం సంబంధం ముగిసి పోయిందన్న కారణంగా వారిపై అత్యాచారముద్ర వేయడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. యువతీ, యువకుల్లో ఇలాంటి ఆలోచన ధోరణుల్లో మార్పులు రావాలని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు కేరళ కేసులో చేసిన వాదనలు కాస్త వార్తలలో నిలిచాయి.