Nisha Raphael: మైనర్ బాలుడిపై లైంగిక దాడి.!. ఇన్‌ఫ్లుయెన్సర్ నిషా రాఫెల్‌పై కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
Case on Nisha Raphael: సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్ పై కావాలని బురదజల్లడానికి ఈ విధమైన ఆరోపణలు తెరమీదకు తెచ్చారంటూ ఆమె సన్నిహితులు దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Case filed against social media influencer Nisha raphael in kerala: ఇటీవల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ లకు ఒక రెంజ్ లో క్రేజ్ పెరిగింది. కొంత మంది తమ వీడియోలు, రీల్స్ తో సమాజంకు ఉపయోగపడే కంటెంట్ ను క్రియేట్ చేస్తారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను తమ సామాజిక మాధ్యమంతో తమ ఫాలోవర్స్ తో పంచుకుంటారు. వీరి వల్ల చాలా మందికి ఉపయోగపడే విషయాలు ఈజీగా తెలుస్తాయి. కానీ మరికొంత మంది ఇన్‌ఫ్లుయెన్సర్ లు దీనికి భిన్నంగా ఉంటారు.
ఏదో ఒక రకంగా ఫెమస్ అవ్వాలని కాంట్రవర్సీలు చేస్తారు. మరికొంత మంది ఇన్‌ఫ్లుయెన్సర్ ముసుగులో యువతులను, మైనర్ బాలలను ట్రాప్ చేసి వారిపై అఘాయిత్యాలు చేయడం, లైంగిక దాడులు చేయడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిషా రాఫెల్ ప్రస్తుతం వార్తలలో నిలిచారు.
కేరళలోని త్రిస్సూర్ కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిషారాఫెల్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమెకు నెట్టింట మంచి ఫాలోవింగ్ ఉంది. అంతే కాకుండా.. మోటివేషనల్ వీడియోలు, స్పీచ్ లను కూడా ఇస్తారు. అయితే..నిషారాఫెల్ ఒక మైనర్ బాలుడిని ట్రాప్ చేసి లైంగిక దాడికి పాల్పడినట్లు విషయం వెలుగులోకివచ్చింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిషా రాఫెల్ పై కేసు నమోదు చేశారు.
బాలుడిని త్రిసూర్ జనరల్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా.. అతనిపై లైంగిక వేధింపులు జరిగినట్లు నిర్ధారణ అయ్యంది. దీంతో నిషా రాఫెల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన త్రిసూర్ వెస్ట్ పోలీసులు విచారణ చేపట్టారు.
మరోవైపు నిషారాఫెల్ మాత్రం ఇది పూర్తిగా తప్పుడు కేసు అని.. నిషా ప్రతిష్టను దిగజార్చేందుకే ఈ కేసు పెట్టారని ఆమె సన్నిహిత వర్గాలు దీన్ని ఖండిస్తున్నారు.
రెండు ఫ్లాట్ల విషయంలో నిషాకు, ఫిర్యాదుదారుకు మధ్య వివాదం ఉందని.. అందుకే కావాలని తన ప్రతిష్టను దిగజార్చేందుకు ఈవిధంగా ఆరోపణలు చేశాడని చెప్తున్నారు. మరోవైపు.. నిషాపై వచ్చిన లైంగిక ఆరోపణల వ్యవహారంలో తమిళనాడు పోలీసులు విచారణ చేపట్టారు.