Python Video: గుంపుగా దాడి చేసిన తగ్గెదెలా.. పిల్లులకు సుస్సు పోయించిన కొండ చిలువ.. వీడియో వైరల్..
Python vs cat video: పిల్లులు గుంపులుగా చిన్న కొండ చిలువపై దాడి చేశాయి. అయిన కూడా అది వాటితో పొరాటంకు దిగింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Cats trying to attacks on python video: సోషల్ మీడియాలో తరచుగా పాములు, కొండ చిలువల వీడియోలు బాగా వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్లు కూడా వీటిని చూసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా పాములు వర్షాకాలంలో ఎక్కువగా ఇండ్లలోకి వస్తుంటాయి. చీకటిగా ఉండే ప్రదేశాలు,ఎలుకలు ఉన్నచోట ఇవి ఎక్కువగా ఉంటాయి.
అంతే కాకుండా కొండ చిలువలు ఎక్కువగా కొండలు, రాళ్లు,దట్టమైన చెట్లు ఉన్న చోట ఉంటాయి. కొన్నిసార్లు కొండ చిలువలు మనుషులపై లేదా ఇతర జీవులపై దాడి చేస్తాయి. అవి వాటిని చుట్టుకుని ఊపిరాడకుండా చేసి హతమారుస్తాయి.
పాములు తమ కాటుతో మనుషులను, ఇతర జంతువులను చంపుతాయి. వీటి మధ్య తరచుగా పొరాటం జరుగుతుంది. ఇలాంటి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా.. ఒక కొండ చిలువ మీద కొన్నిపిల్లులు మూకుమ్మడిగా దాడి చేసిన వీడియో వైరల్ గా మారింది.
దీనిలో కొన్ని పిల్లులు చిన్న కొండ చిలువను చూశాయి. అవి దాన్ని రౌండప్ చేశాయి. అంతే కాకుండా పలు మార్లు దాని మీద దాడికి దిగాయి. కొండ చిలువ సైతం ఎక్కడ తగ్గకుండా రివర్స్ లో మూకుమ్మడిగా దాడి చేసిన కొండచిలువలకు చుక్కలు చూపించింది. పదే పదేవాటిపై దాడి చేస్తు అక్కడి నుంచి దూరంగా పోయేలా చేసింది.
కొండ చిలువ చిన్నగా ఉన్న కూడా దాడి చేస్తు పిల్లులకు ముచ్చెమటలు పట్టించింది. ఇక పిల్లులు ప్రాణభయంతో కొండ చిలువపై దాడిచేయడం మానేసి, దూరంగా వెళ్లిపోయాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.