SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

CBSC కొత్త నిబంధన.. టెన్త్‌లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఇకపై పాస్.. విద్యార్థులకు బిగ్ రిలీఫ్!

CBSE Class 10 Exams: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి విద్యార్థుల కోసం సరికొత్త పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టనుంది. రాబోయే 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

Written By Bhoomi
Published: Oct 30, 2026, 11:29 AM IST | Updated: Oct 30, 2026, 11:31 AM IST
Image Credit: CBSE New Rules
Join

CBSE Class 10 Exams: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి విద్యార్థుల కోసం సరికొత్త పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టనుంది. రాబోయే 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీని ప్రకారం, విద్యార్థులు చదవాల్సిన ఐదు ప్రధాన తప్పనిసరి సబ్జెక్టులతో పాటు అదనంగా మరో స్కిల్ సబ్జెక్టును ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఈ విధానంలో విద్యార్థులకు సాధారణ అకడమిక్ సబ్జెక్టులతోపాటు నైపుణ్య ఆధారిత విద్యకు కూడా ప్రాధాన్యం కల్పిస్తారు.

కొత్త విధానంలో స్కిల్ సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అవకాశం కల్పిస్తారు. గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం వంటి ప్రధాన సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదానిలో ఫెయిల్ అయినట్లయతే..  స్కిల్ పేపర్ లో పాసైతే.. 10వ తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంటుందని సీబీఎస్ఈ పేర్కొంది. అయితే ఈ వెసులుబాటు ప్రస్తుత 10వ తరగతి విద్యార్థులకు వర్తించదని గమనించాలి. 2027-28 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి పరీక్షలు రాసే తదుపరి బ్యాచ్ కు మాత్రమే ఈ విధానం వర్తించనుంది.

ఈ మార్పుతో విద్యార్థులకు తమ నైపుణ్యాలను నిరూపించుకునేందుకు మరో ఛాన్స్ లభించనుందని చెప్పాలి. అయితే కొత్త విధానంలోని పూర్తి అర్హతలు, మార్కుల లెక్కింపు... అమలు నిబంధనలను బోర్డు అధికారిక మార్గదర్శకాల ద్వారా స్పష్టం  చేయాల్సి ఉంటుంది.

ఇక వొకేషనల్ ఎడ్యుకేషన్ కింద విద్యార్థులకు బోర్డు రెండు మార్గాలను అందుబాటులోకి తెచ్చింది:

స్కిల్ సబ్జెక్టులు: 
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ మార్కెట్స్, హెల్త్‌కేర్, డిజైన్ థింకింగ్ వంటి 22 నోటిఫైడ్ స్కిల్ సబ్జెక్టులలో ఒకదానిని ఎంచుకుని బోర్డు పరీక్షలు రాయవచ్చు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (NSQF) సర్టిఫికేట్ లభిస్తుంది.

కౌశల్ వికాస్:
ఈ ఆప్షన్‌ను ఎంచుకునే విద్యార్థులు బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. కేవలం స్కూల్ ఆధారిత ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో కనీసం 33 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.

కొన్ని అంశాలకు మినహాయింపు:
పాఠశాల ప్రిన్సిపాళ్లకు విడుదల చేసిన సర్క్యులేషన్‌లో సీబీఎస్‌ఈ అకడమిక్స్ డైరెక్టర్ ప్రగ్యా ఎం సింగ్ మాట్లాడుతూ.. 9వ తరగతికి 'ఇండివిడ్యుయల్స్ ఇన్ సొసైటీ', 'సిటి అండ్ ఏఐ మాడ్యూల్స్', అలాగే 10వ తరగతికి 'ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్' అంశాలను ప్రస్తుతానికి సిలబస్‌లో చేర్చడం లేదని స్పష్టం చేశారు. కేవలం పరీక్షల గురించిన భయం కాకుండా, విద్యార్థుల్లో అర్థవంతమైన అభ్యాసాన్ని పెంపొందించడమే బోర్డు ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES