SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

డిగ్రీ, బీటెక్ అర్హతతో కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు! 844 ఖాళీలు.. ఫీజు ఉచితం! వెంటనే అప్లై చేసుకోండి!

నిరుద్యోగులకు భారీ శుభవార్త.. సెంటర్‌ ఫర్ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (CDAC) 844 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇందులో మొత్తం కాంట్రాక్ట్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ప్రాజెక్ట్ మేనేజర్ ఇతర పోస్టులు ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్‌ https://www.cdac.in/ ఓపెన్‌ చేసి నోటిఫికేషన్‌లో పూర్తి వివరాలు చదవాలి. ఆ పై దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఈ పోస్టులకు సంబంధించిన అర్హత పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Oct 06, 2026, 09:10 AM IST | Updated: Oct 06, 2026, 09:16 AM IST
Image Credit: CDAC Recruitment 2026
Join

CDAC Recruitment 2026: సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 844 ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ భర్తీ చేస్తోంది. ఇందులో హైదరాబాద్‌లో కూడా పోస్టులు ఉన్నాయి. మొత్తం 11 సెంటర్‌లలో ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టింది. అర్హత పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌ క్షుణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..
CDAC లో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్ మేనేజర్‌, టెక్‌ లీడ్‌ అండ్‌ సపోర్ట్‌ రోల్స్‌లో భర్తీ చేయనుంది. మొత్తం 844 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 2026 అక్టోబర్‌ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత..
CDAC పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే సంబంధిత డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ పొంది ఉండాలి. ఏదైన గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి వీరు పట్టా పొంది ఉండాలి.

వయో పరిమితి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే వయో పరిమితి 30 ఏళ్ల నుంచి 56 ఏళ్ల వారు అర్హులు ప్రభుత్వ రిజర్వేషన్‌ ప్రకారం ఏజ్‌ రిలాక్సేషన్‌ కూడా లభిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. CDAC పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శాలరీ రూ.3.6 లక్షల నుంచి రూ.22.9 వరకు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ..
ఈ పోస్టులకు ఎంపిక విధానం వివిధ CDAC సెంటర్‌లలో రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అర్హత ఉన్న అభ్యర్థులు CDAC అధికారిక వెబ్‌సైట్‌లో కెరీర్‌  పోర్టల్‌ careers.cdac.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ప్రత్యేకంగా మీ అర్హత ఉన్న కేటగిరీకి అప్లై చేసుకోవాలి. బీఈ, బీటెక్‌, ఐటీ, డిగ్రీ, ఎంఈ/ఎంటెక్‌, పీహెచ్‌డీ, సీఏ, ఎల్‌ఎల్‌ఎం లేదా సీఎస్‌ లేదా సీఎంఏ, ఎంబీఏ లేదా పీజీ, ఎల్‌ఎల్‌బీ పాసైన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే..

Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ బీమా సంస్థలో 450 ఉద్యోగాలు! ఏ డిగ్రీ ఉన్నా ఓకే! సిలబస్‌ పూర్తి వివరాలు!

ఇక ఎంపికైన అభ్యర్థులు మూడేళ్లపాటు ప్రాజెక్టులు పూర్తి అయ్యే వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఇది కేవలం కాంట్రాక్ట్‌ ప్రాతిపదికపై నియామకం ఉంటుంది. సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ అనేది Meity, కేంద్ర ప్రభుత్వ రిక్రూట్‌మెంట్‌ ద్వారా జరుగుతుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES