SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

చేతికి డబ్బు రాగానే ఈ 4 తప్పులు చేయకండి.. చాణక్య నీతి చెబుతున్న కీలక పాఠాలు!

Chanakya Niti On Money: కొంతమంది డబ్బులు సంపాదించగానే జీవనశైలిలో మార్పులు వస్తూ ఉంటాయి. దీని కారణంగా కొంతమంది గతంలో ఎప్పుడూ లేని అలవాట్లను వ్యసనంగా మార్చుకుంటూ ఉంటారు. దీని కారణంగా అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చాణక్య నీతి శాస్త్రం చెబుతోంది. కాబట్టి డబ్బులు కనపడగానే ఈ క్రింది అలవాట్లకు దూరంగా ఉండాలని శాస్త్రం సూచిస్తుంది..

Reported By Dharmaraju Dhurishetty
Published: Oct 17, 2026, 10:34 AM IST | Updated: Oct 17, 2026, 10:36 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Chanakya Niti On Money Telugu: ధనాన్ని సంపాదించడానికి మనిషి ఎంతో శ్రమిస్తూ ఉంటాడు. అయితే కష్టపడి డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో.. సంపాదించిన ఆ ఆదాయాన్ని సరైన పద్ధతిలో కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అంతేకాకుండా ఆ డబ్బులను పొదుపు చేయడం మరింత ముఖ్యమని ఆచార్య చాణక్యుడు స్పష్టం చేశారు. ఆదాయం పెరగగానే చాలామంది జీవన శైలిలో ఒక్కసారిగా మార్పులు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ కోల్పోతే శ్రీమంతులైన చివరికి రోడ్డున పడాల్సి వస్తుందని చాణక్యనీతి శాస్త్రం క్లుప్తంగా చెబుతూ వస్తోంది. డబ్బు చేతికి రాగానే విడిచి పెట్టాల్సిన నాలుగు ముఖ్యమైన అలవాట్లకు సంబంధించిన వివరాలను కూడా చాణక్యుడు అందించిన నీతి శాస్త్రంలో కూడా ఎంతో క్లుప్తంగా వివరించారు. అవేంటో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హోదా కలిగిన వ్యక్తులుగా ఉండడం..
ఆదాయం పెరిగినప్పుడు విజయాన్ని చూసి సంతోషపడటం సహజమే అయినప్పటికీ.. ప్రతిసారి సంపాదనను ఇతరుల ముందు ఆడంబరంగా ప్రదర్శించాల్సిన అవసరం లేదు.. ఆర్థిక స్థితిని అందరికీ బహిరంగంగా చూపించడం వల్ల ఇతరులలో లేనిపోని అసూయతో పాటు అనవసరమైన పోటీ, దురాశ పెరిగే ప్రమాదం విపరీతంగా ఉంది. అందుకే సంపాదన, పొదుపు వివరాలను సీక్రెట్ గా ఉంచుకోవడమే చాలా మంచిదని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది..

కీర్తి ప్రతిష్టల కోసం స్తోమతకు మించి అస్సలు దానం చేయకూడదు..
దానధర్మాలు చేయడం ఉత్తమమైన గుణమే అయినప్పటికీ.. ఆపదలో ఉన్న పేదలకు, ఏమి లేని వారికి సహాయం చేయడం ఒక అద్భుతమైన సామాజిక బాధ్యత.. అయితే సమాజంలో పేరు ప్రఖ్యాతలు విపరీతంగా రావాలనో.. నలుగురు మెచ్చుకోవాలనో.. తమ ఆర్థిక శక్తిని మించి విచ్చలవిడిగా దానాలు చేయడం అంత మంచిది కాదని చాణక్యనీతి శాస్త్రం వివరిస్తోంది. నిజమైన సాయం అనేది ఆడంబరం కోసం కాకుండా. ఎదుటి వారి అవసరాన్ని తీర్చేలా ఉండాలని ఈ సంవత్సరం వివరిస్తూ వస్తోంది..

విలాసవంతమైన వస్తువులు అస్సలు కొనొద్దు..
ఖరీదైన కార్లతో పాటు బ్రాండెడ్ వస్తువులు, ముఖ్యంగా దుస్తులు, బంగారు ఆభరణాలు ఇతరులను ఆకర్షించేందుకు లేదా గొప్ప చెప్పుకోవడానికి కొనుగోలు చేయడం ఆర్థిక పతనానికి దారి అని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది. స్తోమత ఉన్నప్పుడు అభిరుచి మేరకు ఖర్చు పెట్టడంలో తప్పు లేదని.. సమాజంలో గొప్పగా కనిపించేందుకు అప్పులు చేసి మరి విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడం ప్రమాదకరమని చాలాక్యనీతి శాస్త్రం క్లియర్గా చెబుతోంది. ఏదైనా వస్తువులు కొన్నవెందుకు ముందు అది ఎంతవరకు అవసరమో అని విషయాలను కూడా ఆలోచించుకోవాలని ఈ శాస్త్రం సూచిస్తుంది..

ఈ అలవాట్లకు దూరంగా ఉండండి..
డబ్బులు రాగానే జీవితాన్ని ఆస్వాదించాలని అనుకుంటూ ఉంటారు.. దీనికి కారణంగా మద్యపానం అలవాటు చేసుకోవడమే కాకుండా ధూమపానం కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది జూదాలు ఆడుతూ ఉంటారు.. ఇలా చెడు అలవాట్లకు బానిసలు అయిపోతే సంపద క్షణాల్లో కరిగిపోయే అవకాశాలు ఉన్నాయని.. ఈ వ్యసనాల వల్ల కేవలం ఆర్థిక నష్టమే కాకుండా ఆరోగ్యం దెబ్బతిని, కుటుంబ సంబంధాలు ఊహించని స్థాయిలోకి కనుమరుగైపోతాయని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది. కాబట్టి డబ్బులు కనిపించగానే మద్యపానం సేవించడం వంటి అలవాట్లకు చాలా దూరంగా ఉండటం మేలు..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES