Chanakya Niti For Success Telugu: చాణక్య నీతి శాస్త్రం మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలను క్లియర్గా వివరించింది. మనిషి జీవితంలో ఎలా ఉన్నత స్థాయిలో బ్రతకాలో.. ఆ స్థానానికి వెళ్లాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో అనే ఎన్నో రకాల అంశాల గురించి ఈ శాస్త్రం చెబుతూ వచ్చింది. ముఖ్యంగా చెడు అలవాట్లకు ఎలా దూరంగా ఉండాలో అనే సూత్రాలను కూడా చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించాడు. ఇదిలా ఉంటే ఒక వ్యక్తి జీవితంలో సుఖసంతోషాలతో పాటు స్థిరమైన ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే ఎలాంటి గుణాలు కలిగి ఉండాలో ఆయన స్పష్టంగా ఈ సంవత్సరంలో వివరించారు. కొందరి ఇళ్లలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. అలాంటి వారి జీవితంలో ఎన్నటికీ డబ్బు కోరత అనేది ఏర్పడదని చాణుక్యుడు పేర్కొన్నాడు.
ఇలాంటి గుణమే అసలైన సంపద..
ఆచార్య చానక్ చూడు తన ఒక అద్భుతమైన శ్లోకాన్ని వివరిస్తూ ఇలా చెబుతూ వచ్చారు.. ఎవరి మనసులోనైతే నిరంతరం ఇతరులకు మేలు చేయాలని భావన ఉంటుందో. వారి జీవితంలో కష్టాలన్నీ సక్రమంగా తొలగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా.. అలాంటి మంచి మనసున్న వ్యక్తులకు అడుగడుగునా సంపదలతో పాటు విజయాలు కలుగుతాయని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్న అనేక శ్లోకాల్లో వివరించాడు. స్వార్థం వీడి సమాజ శ్రేయస్సు కోసం నిలిచే వ్యక్తి జీవితం ఎల్లప్పుడు సమృద్ధిగా ముందుకు సాగుతూ ఉంటుందట..
చాణక్య నీతి శాస్త్రం అందించిన వివరాల ప్రకారం.. కొన్ని అద్భుతమైన సద్గుణాలు పాటించే వ్యక్తులతో పాటు వారి కుటుంబాలలో నిత్యం అదృష్టం విపరీతంగా లభిస్తుందట.. ఆహారాన్ని దైవంగా భావించి ఒక్క మెతుకు కూడా వృధా చేయకుండా ఉండే వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అన్నాన్ని గౌరవిస్తూ.. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే వారికి ఇంట ఎప్పటికీ ఆహార, తన కొరత ఉండదని చాణక్యనీతి శాస్త్రం వివరిస్తుంది..
ఏ ఇంట్లోనైతే భార్యాభర్తలు ఎలాంటి గొడవలు లేకుండా పరస్పరం గౌరవంతో.. ప్రేమతో జీవిస్తారో అలాంటి వారి ఇల్లు నిత్యం కళ్యాణం గా వర్ధిల్లుతుందట.. అంతేకాకుండా ప్రశాంతత తో పాటు సంతోషం విపరీతంగా పెరిగి సంపాదన దీర్ఘకాలంగా నిలుస్తుందని చాణక్యనీతి శాస్త్రం క్లియర్గా చెబుతోంది.. కష్టపడి సంపాదించిన ధనాన్ని విచక్షణారహితంగా ఖర్చు చేయకుండా. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసే వ్యక్తులు ఎప్పుడూ ఆర్థిక సంక్షోభంలో పడకుండా ఉంటారట. అనవసరపు ఖర్చులను అదుపులో ఉంచుకోవడమే నిజమైన సంపదకు మూలమని చానక్యుడు తన శాస్త్రంలో వివరించాడు..